స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేద మాకాంక్షించిన దేశం
ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసీ జాయతామా రాష్ట్రే రాజన్యః
శూర- ఇషవ్యో-తివ్యాధీ మహారథో జాయతాం దోగ్ధ్రీ
ధేనుర్వోఢానడ్వానాశుః సప్తిః పురంధిర్యోషా జిష్ణూ రథేష్ఠాః
సభేయో యువాస్య యజమానస్య వీరో జాయతాం
నికామే నికామే నః పర్జన్యో వర్షతు ఫలవత్యోన - ఓషధయః
పచ్యంతాం యోగక్షేమో నఃకల్పతామ్‌॥
యుజుర్వేదం 22-22॥
భావం:- ఓ దేవా! బ్రహ్మవేత్తలు, శస్త్రాస్తవ్రిదులైన వీరులు మహారథులు, దేశహితాన్ని కోరే భూమిపాలకులు, నిండు పొదుగులు గల ఆవులు, బరువులు మోయగల ఎద్దులు, వేగంగా పోగల గుఱ్ఱాలు, బుద్ధిమంతులై నగరాలను పాలింపగల స్ర్తిలు, సభానిర్వహణ చతురులైన యువకులు, యుద్ధవీరులు, ఈ దేశంలో పుట్టెదరుగాక! సకాలంలో మేఘాలు వర్షించుగాక! ఓషధులు పరిపుష్టంగా ఫలించుగాక! యోగక్షేమాలు మాకు సిద్ధించుగాక!
వివరణ:- ఏవి సమృద్ధిగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందో వాటిని ఈ మంత్రంలో ప్రస్తావించడం జరిగింది. మొదటగా బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు దేశంలో జన్మించాలి. వారే జన్మింపకుంటే ఆ దేశంలోని ప్రజలు అజ్ఞానాంధకారంలోనే మ్రగ్గిపోతారు. బ్రహ్మవేత్తలున్న దేశం వైజ్ఞానికంగా ముందడుగువేసి అగ్రగణ్య దేశంగా వాసిగాంచుతుంది. వీరి తరువాత దేశంలో ముఖ్యంగా ఉండవలసినవారు పరాక్రమశీలురైన యోధులు. వీరే లేకుంటే దేశము స్వాతంత్య్రాన్ని కోల్పోయి పారతంత్య్ర దేశమైపోతుంది.
బలం వావ విజ్ఞానాత్ భూయః అపి హ శతం విజ్ఞాన
వతామేకో బలవానాకంపయతే॥
(్ఛందోగ్యోపనిషత్తు 7-8-1)
‘‘శారీరకబలం విజ్ఞానంకంటే బలీయమైనది. ఒక బలవంతుడు వందలకొలది విజ్ఞానవంతులను కపింపచేస్తాడు’’అని ఛాందోగ్యోపనిషత్తులోని సనత్కుమారుని వచనం దేశానికి శారీరక బల సంపన్నులైన వీరుల ఆవశ్యకత ఎంత ముఖ్యమో ప్రకటిస్తూ ఉంది. మరో ముఖ్యాంశమేమంటే వీరులు కేవలం సంఖ్యాపరంగా ఎక్కువగా ఉండటం ముఖ్యంకాదు. వారు శస్త్రాస్తవ్రిదులుగా కూడ అయి ఉండాలి.
వీరేగాక పాడిని వృద్ధిపరచే ఆవులు, బరువులుమోసే ఎడ్లు, రథాలను వేగంగా లాగగల అశ్వాలు, దేశాన్ని పాలించగల బుద్ధిమంతులైన స్ర్తిలు, అన్నింటిని నిర్వహింపగల యువకులు దేశంలో ఉద్భవించాలి. సకాలంలో వర్షాలుపడాలి. జనుల కడుపులను నింపే ఓషధులు సుష్టుగా ఫలించాలి. ప్రజలు యోగ- క్షేమాలు కలిగి వర్ధిల్లాలి. ఈయన్ని సమృద్ధిగా ఉన్న దేశమే ఆదర్శ దేశం. అదే వేద మాకాంక్షించిన దేశం.
పరమేశా! ఉత్తమ ధనమీయి
ఇంద్ర శ్రేష్ఠాని ద్రవిణాని ధేహి చిత్తిం దక్షస్య సుభగత్వమస్మే
పోషం రరుూణా మరిష్టిం తనూనాం స్వాద్మానం వాచః సుదినత్వమహ్నామ్‌॥ ॥

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు