స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
విచిత్ర ధనాన్ని ఇమ్ము
సుబ్రహ్మాం దేవవంతం బృహంతమురుం గభీరమ్ పృథుబుధృమింద్ర
శ్రుత ఋషిముగ్రమభిమాతిషాహమస్మభ్యం చిత్రం వృషణం రయం దాః॥

భావం:- ఓ దేవా! ఉత్తమ జ్ఞానదాయినియు, దివ్యగుణ సంపన్నమైనదియు, ఘనమై, విస్తారమైనదియు, గంభీరమైనదియు, జనులందరకు ఆశ్రయణీయమైనదియు. వినినంతనే కోరుకోదగినదియు, సామాన్య జనులకు భయాన్ని కల్గించునదియు దురభిమానాన్ని అణచివేయునదియు అయిన విచిత్రమైన ఉత్తమ ధనాన్ని మాకు అనుగ్రహించుము.
వివరణ:- శాస్త్రాలలో అక్కడక్కడ సందర్భానుసారంగా ప్రస్తావించబడిన వాక్యాలలో ఏవో కొన్నింటిని తమ కనుకూలమైనవానిని గ్రహించి అలాగే నడుచుకోవడం దోషమే అవుతుంది. ఒకే విషయాన్ని గురించి అలాగే నడుచుకోవడం దోషమే అవుతుంది. ఒకే విషయాన్ని గురించి అక్కడక్కడ చెప్పిన వాక్యాలన్నింటిని ఒకచోట చేర్చి వాటిని పరస్పరం జతచేసుకొని అన్వయించుకొని ఆ వాక్యాలలో అంతర్లీనంగా చెప్పబడ్డ సార విషయాన్ని గ్రహించి ఆ ప్రకారం నడుచుకోవడం విజ్ఞత అవుతుంది. ఉదాహరణకు ఋగ్వేదంలోని ‘వయం స్యామ పతయో రరుూణామ్’ (ఋ.10-121-10) ‘‘మేము ధనపతులం కావాలి’’ అన్న వాక్యం ద్వారా లౌకిక ధనవంతుల కండని ఆ వేదం బోధించిందా? మరి అట్టి ధనాన్ని ఆర్జించమని వేదమే చెప్పాలా? దానిని లోకంలో బిచ్చగాడు కూడ ఆ మాట చెప్పగలడు కదా. మరి ఋగ్వేదం ఆర్జించి ధనపతులు కండని చెప్పిన ఆ ధనమెట్టిది? ఈ విషయం ‘వయం స్యామ పతయో రరుూణామ్’అన్న మంత్రంలో చెప్పబడ్డ 10వ కాండలో ఉన్న మరో 47వ సూక్తంలోని ప్రస్తుత మంత్రాన్ని పరిశీలిస్తే ఆర్జించి ధనపతులు కమ్మని ఋగ్వేదం లక్ష్యంగా చేసుకొన్న ఆ ధనమెట్టిదో అర్థమవుతుంది. ఋగ్వేదం తాను ఉద్దేశించిన ధనం అందరు భావించే ధనం వంటిది కాదని అది ‘చిత్ర’మైనదని ‘అస్మభ్యం చిత్రం వృషణం రయిం దాః’ చిత్రమైన ఆ ధనానే్న ఇమ్మని కోరే జ్ఞానియైన అర్థార్థి ప్రార్థనా వచనంగా సూచించి ఆ చిత్రమైన ధనానికి గల తొమ్మిది లక్షణాలను వివరించింది.
1. సుబ్రహ్మాణమ్:- ఉత్తమమైన జ్ఞానాన్ని కలిగించేదని దానికర్థం. బ్రహ్మ శబ్దానికర్థాలు పరమేశ్వరుడు, వేదజ్ఞానం, ధనం, అన్నం, స్తోత్రం, తపస్సు ఇలా ఎన్నో. ధనమీ అర్థాలకు సమన్వయించితే పరమేశ్వరుని సాక్షాత్కరింపచేసేది. జ్ఞానమిచ్చేది, ప్రశంసార్హమైనది, గోప్ప తపస్సాధకమైనది ఏదో అదే ధనమని విశేషార్థం సిద్ధిస్తుంది. మరి ఈ ధనం ప్రాకృతికమైన లౌకికమయిన ధనమే అవుతుందా?
2. దేవవంతమ్:- దివ్యగుణ సంపన్నుడని ఈ మాట కర్థం. పరమేశ్వరుని నిత్య ధ్యానపరాయణుడే దివ్యగుణ సంపన్నుడు. అతడికి పరమేశ్వర దర్శనభాగ్యం కాక మరే భాగ్యం కావాలి? భగవంతుని దర్శింప చేయలేనిది మరియు భగవంతుని మరపునకు తెచ్చే ధనమాతడు కోరుకొంటాడా?
3,4. బృహంతం ఉరుమ్:- మరి అతడు భగవద్దర్శన ప్రదాయిని- భగవత్ స్మరణకారిణి అయిన ధనాన్ని ‘నాల్పే సుఖమస్తి.’ (్ఛం (7-23-1) కొద్దిపాటి దానితో సంతోషముండదని బాగా తెలిసిన ఆతడు బృహంతమ్= ఘనంగా మరియు ఉరుమ్= విస్తారంగానే కోరుకొంటాడు. నిజమే. ఆ ధనమా విధంగా కోరుకోదగినదే.
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు