స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

5. గభీరమ్:- లోతయిన అని దీని అర్థం. భావాలు, స్వభావాలు గంభీరంగా ఉన్నాయనడం సహజం. కాని ధనం గంభీరంగా ఉందన్నమాట క్రొత్తగా అనిపించవచ్చు. శ్రమార్జితమైన ధనాన్ని ఉద్దేశించి వేదం ఆ మాట ఉపయోగించి యుండవచ్చు. సముద్రం కూ గంభీరంగానే ఉంటుంది. ఎక్కడ? లోతుగా ఉన్నచోటనే. అక్కడకు ఎవరూ చేరలేరు. అలాగే కష్జార్జితమైన ధనం కూడ గంభీరమే. దానిని కూడ ఎవరూ తాకలేరు. తాకినా అది తిరిగి యజమాని వద్దకే వస్తుంది. అందుకే ధనం కూడ గంభీరమైనదే.
6. పృథు బుధ్నన్:- గొప్పవారిచేత ఆశ్రయించబడునదని దీని అర్థం. జ్ఞాన ధనమట్టిదే కదా!
7. శ్రుత ఋషిమ్:- ఋషులకు ఆశ్రయణీయమయినదని దీని అర్థం. ‘కిం తేన ధనేనాహం కుర్యాం యేనాహం నా మృతా స్యామ్’ (బృహదారణ్యకం 2-4-3) ‘‘ముక్తి లభించని’’ ఆ ధనాన్ని నేనేమి చేసుకోను? అని ఋషులు భావిస్తారు. అందుకే ముక్త్ధినం వలె లౌకిక ధనం ఆశ్రయణీయమైనది కాదు.
8. ఉగ్రమ్:- తేజోవంతమైనది. శక్తివంతమైనది అని దీని అర్థం. ముక్త్ధినం కలవారు లౌకిక ధనం కలవారివలె భయభీతులుగా ఉండరు. ఎవరు దొంగిలింపలేని జ్ఞానముక్తి ధనాలతో విరాజిల్లుతూ వారు తేజోవంతులై ఉంటారు.
9. అభిమాతి షాహమ్:- అహంకారం మరియు దురభిమానాలను హరించునదని దీని అర్థం. జ్ఞానకీ రెండు దుర్లక్షణాలు దూరంగానే ఉంటాయి.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512