స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇట్టి లక్షణాలు గల ధనం మనందరం భావించే ధనం వంటిదని చెప్పగలమా? అందుకే ఈ విలక్షణమైన జ్ఞాన ధనం ముక్త్ధినమే. ఈ ధనానే్న మేము కోరేది. దానినే ఇమ్ము ‘యత్త్వా యామి దద్ధి తన్నః’ (ఋ.10-47-8) అని సాధకుణ్ణి దైవాన్ని ప్రార్థించమంటూంది ఋగ్వేదం.
మా స్తోత్రాలే మా దూతలు
వనీవానో మమ దూతాస ఇంద్రం స్తోమాశ్చరంతి సుమతీరియానాః
హృది స్పృశో మనసావచ్యమానా అస్మభ్యం చిత్రం వృషణం రయిందాః॥ ॥ భావం:- ఓ ప్రభూ! సద్భుద్ధి ప్రదాయిని అయినదియు, హృదయ వినిర్గతమైనదియు, మనఃపూర్వకముగా చెప్పబడునదియు, నిరతిశయభక్త్భివ సమన్వితమైనదియు అయిన మా స్తోత్రాలు భగవానుడైన ఇంద్రునివద్దకు చేరుతున్నాయి. నీవు మాకు ధర్మబద్ధమూ, మహాహారిణియు అయిన ధనాన్ని మాకిమ్ము.
వివరణ:- పరమభాగవతుడైన భక్తునిమదిలో తన భక్తిసందేశాన్ని భగవంతునకు పంపాలనే తలంపు కలిగింది. అప్పుడా భక్తుడికి మదిలో భగవద్వాణి ఇలా వినబడింది. ‘మాయాయంతి కృతేన కర్త్వేన చ’ (ఋ.10-48-3) ‘‘చేసిన మరియు చేయబోయే కర్మల ద్వారా రెండు విధాలయిన భక్తులు నావద్దకు వస్తారు’’అంటే వెనుక చేసిన మరియు భవిష్యత్తులో చేయబోయే కర్మలవలన సంభవించే సుఖాలననుభవించేందుకు రెండు విధాలుగా జనులు భగవంతుని వద్దకు చేరతారని భావం. ప్రస్తుత మంత్రంలో భక్తుడు చేయబోయే కర్మల ఫలాలననుభవించేందుకు భగవంతుని వద్దకు పోవాలని తలచాడు. తనకంటే ముందుగా ఆయన వద్దకు దూతను పంపాడు. ఆ దూత ఎవరో కాదు. భగవన్నుతియే.
దూత బుద్ధిమంతుడు, స్వ స్వామి మనోభిప్రాయాన్ని సమర్థవంతంగా తెలియచేయగలవాడు, ఇతరుల మనోభావాలను సునిశితంగా గ్రహించగలవాడూ కావాలని నీతి శాస్తజ్ఞ్రులు దూత లక్షణాలను పేర్కొన్నారు. ఆ లక్షణాలను ప్రస్తుతం భక్తుడు పంపిన దూతకన్వయించి వేదం ‘సుమతీ రియానాః’ ‘‘ఉత్తమ జ్ఞానవంతుడు కావాలి’’అని నిర్దేశించింది.అంటే ఆ భగవన్నుతి దూత భక్తుని భగవద్భక్తికి ప్రతీకం కావాలని భావం.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు