స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధం కేవలం సైనికులు మరియు శస్త్రాస్త్రాది బలసంపన్నతచేత మాత్రమే నిర్వహింపబడేది కాదు. అంతకుమించి సేనాసమూహాలను యుద్ధరంగంలో నిర్వహించే వ్యూహాలపై యుద్ధ విజయమాధారపడి యుంటుంది. అది వ్యూహాత్మకంగా నిర్వహింపబడినపుడే విజయం తథ్యమవుతుంది. మంత్రం సేనాపతిని ‘మన్యు’అని సంబోధించింది. దానికర్థం- చింతన చేయుట, ఆలోచించుట మరియు స్వాభిమాన సహితమైన క్రోధం.
యుద్ధవ్యూహ విషయంగా చింతన మరియు ఆలోచన కలిగినవాడు కాకుంటే సేనాపతి శత్రువ్యూహాలను గ్రహింపనసమర్ధుడై తప్పక పరాజితుడు కాగలడు. ఇక శత్రువుల ఎడల స్వాభిమాన పూర్వకక్రోధమే లేకుంటే అట్టి సేనాధ్యక్షుడు యుద్ధమేమి చేయగలడు? సరే. సేనాపతిపై చెప్పబడిన త్రివిధ లక్షణాలు కలిగినవాడే అయినా అతడికి దేశప్రజల ప్రోత్సాహం మరియు ధన సహాయం లేకుంటే అతడికి యుద్ధవిజయం సందిగ్ధమే. కాబట్టి తనకు అట్టి ప్రజాసహకారం లభించేందుకు వేదం ‘విశం విశం యుద్ధాయ సం శిశాధి’ ‘‘యుద్ధ సన్నద్ధతకు ప్రజలను ఉత్తేజపరచుము’’అని సేనాధిపతికి హితవుచెప్పింది. దీనివెనుక వేద మనోగతమేమిటి? ఏ క్షణంలోనైనా శత్రుసేనల విశృంభణ మధికమై యుద్ధవిజయం సందిగ్ధ దశకు చేరిన సమయంలో సేనలు క్షణిక మనోదౌర్బల్యానికి గురిఅయితే అప్పుడు ప్రజాసమూహమంతా ‘త్వయా యుజావయం ద్యుమంతం ఘోషం విజయాయ కృణ్మసి’ ‘‘మీతో కలిసి బిగ్గరగా విజయఘోష చేస్తాము’’అని మీవెంటే ఉంటారని సేనాపతికి అభయమిచ్చింది. యజుర్వేదం ఇట్టి విజయఘోషను ఇలా వర్ణించింది.
ఉద్ధర్షయ మఘవన్నాయుధాన్యుత్సత్వనాం మామకానాం మనాంసి
ఉద్ వృత్రహన్ వాజినాం వాజినాన్యుద్ రథానాం జయతాం యంతు ఘోషాః॥
(యజు.17-42)
ఓ ఇంద్రా! ఆయుధాలకు పదునుపెట్టు. శక్తిసంపన్నులు, శ్రేష్ఠులు అయని సేనాపతులకు ఉత్సాహం మరియు సంతోషాన్ని కలిగించు. ఓ శత్రునాశక! అశ్వాలను, యుద్ధోపకరణాల వేగాన్నివేగిరపరచు. అప్పుడు విజయాలను సాధిస్తూ రథాలు విజయఘోషలను చేస్తాయి.
ఈ విధంగా యుద్ధసన్నాహం చేయకుంటే విజయఘోష గగన కుసుమమే అవుతుంది.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు