స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
అందుకు దూత వినమ్రభావంతో అనగా ‘వనీవానః’ అతిశయ ‘‘భక్త్భివాల వైభవం’’గా ప్రభువుకు వినిపించాలి. అప్పుడే దూతగా భగవన్నుతి స్వస్వామికి అనగా భక్తుడికి భగవత్కృపను అనుగ్రహింపచేయగలడు.
ఇక్కడ విచారణాశీలురకు ఒక సంశయం కలుగవచ్చు. అదేమంటే పైన చెప్పబడినట్టి భగవత్కృపాపాత్రమైన సన్నుతిని చేయగల లేదా స్వయంగా రచించగల సమర్థత లేని భక్తుని గతి ఏమి? అని. అప్పుడు ఆ సాధారణ భక్తుడు ఏ వ్యక్తినైనా భగవంతుని వద్దకు పంపవచ్చు. మరి భగవత్సన్నిధికి చేరేందుకు అందరు సమర్థులుకారు కదా. అంటే సమర్థులయినవారు కొందరున్నారు. వారే భగవద్భక్తులు. వారిని గుర్తించేదెలా? పైన దూతగా పంపబడే భగవన్నుతికే లక్షణాలు చెప్పబడ్డాయో అవే లక్షణాలను అనే్వషించి అవి ఎవరిలో ఉంటాయో ఆతడినే దూతగా పంపాలి. అతడు కూడ దైవసన్నుతి దూతవలె నీ భక్తిపూర్వక సందేశాన్ని భగవంతుడికి విన్పించగలడు.
దూతగా పంపిన భగవన్నుతి ద్వారా గాని భక్తజనదూత ద్వారాగాని దనుజులవలె కోరరాని కోర్కెను అర్థించరాదని వేదం ‘అస్మభ్యం చిత్రం వృషణం రయిందాః’ ‘‘మాకు హృదయానందకరమైన ధర్మయుక్తమైన ధనాన్ని (దీని వివరణ 240 మంత్ర వివరణలో చూడండి) అనుగ్రహించు’’మని హితవుచెప్పింది. భగవంతుని దృష్టిలో అట్టి వరాన్ని కోరేవారే ఆర్యులు కాబోలు. అందుకే ఋగ్వేదంలో ‘అహం భూమి మదదామార్యాయ’ (ఋ.4-26-2) ‘‘నేను ఆర్యులకే ఈ భూమిని దానం చేసియున్నాను’’అని భగవానుడే వాగ్దానం చేసాడు. భగవంతునినుండి దేనినైనా పొందాలనుకొంటే ముందు ఆర్యుడవుకమ్ము. ఆర్యుని లక్షణం ‘యజమాన’ పరోపకారతయే. ఆ విధంగా పరోపకారం చేయి. అప్పుడు ఈ విశాలభూమి అంతా నీదే.
***
242. మేము విజయఘోష చేస్తాం
ఏకో బహూనామసి మన్య ఈడితా విశంవిశం యుద్ధాయ సం శిశాధి
అకృత్తరుక్త్వయా యుజా వయం ద్యుమంతం ఘోషం విజయాయ కృణ్మసి॥ ॥
భావం:- ఆలోచనాపరుడవై, శత్రువులయెడల క్రోధాన్ని వహించి యుద్ధ విజిగీషుడవైన ఓ సేనాధిపతీ! నీ ఒక్కడవే అనేక జనులను సాధించిన విజయం ద్వారా సమ్మానం చేసినవాడవు కాగలవు. అవిచ్ఛిన్న వీరప్రతాపశీలుడవై ప్రజలను యుద్ధానికి ఉత్తేజపరచుము. మేము నీతోకూడి విజయంకోసం బిగ్గరగా జయజయ నినాదాలుచేస్తాము.
వివరణ:- యుద్ధ విద్యావిశారదుడు, బుద్ధిమంతుడు అయిన సేనాపతిని ఉత్సాహపరుస్తూ ఈ అథర్వణవేద మంత్రం ‘ఏకో బహూనామసి మన్య ఈడితా’ ‘‘ఓ మన్యూ! నీ వొక్కడవే అనేకులను సంరక్షించి పూజింపగలవాడవు’’అని కీర్తించింది.
- ఇంకావుంది...