స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

సుధితమ్:- మాట హీనం కానంత మాత్రాన అది యుత్తమమైనది కాదు. ఎందుకంటె అది పరిణామ దుష్ఫలదాయకం కావచ్చు. కాబట్టి ఆ మాట లేదా ఆలోచన సుధితమ్= బాగా శాస్ర్తియంగా తార్కికంగా విచారణ చేయబడినది కావాలి. అలాకాక మనస్సులోనికి వచ్చినంతనే వెంటనే మంచిదని తలంచి చెప్పరాదు. బాగా విచారణచేయబడిన అంశమే అయినా దానిని ఇతరులకు చెప్పినంతనే వారు దానినాచరించాలని ఒత్తిడి చేయరాదు. వారు స్వయంగా కూడ బాగా ఆలోచించుకోనివ్వాలి. ఎందుకంటె తనకు మంచిదని తోచినది ఇతరులకు ప్రయోజనకారి కాకపోవచ్చు కదా.
సుపేశసమ్:- మాట అఖర్వమూ- సుధితమేకాదు సుపేశసం కూడ కావాలి. అంటె సుందరంగా- లలితంగా- ఆకర్షణీయంగా కూడ ఉండాలి. అప్పుడే విన్నవాడు చెప్పిన విషయానికి ఆకర్షితుడవుతాడు. అట్టి అంశమే శుభప్రదమవుతుంది. అదే ప్రియమైనది అవుతుంది. ఒక్క మాటకే కాదు పరమేశ్వరుడికి కూడ సుందరత అవసరమైంది. అందుకే ఆయన సత్యం- శివం లక్షణాలతోబాటు సుందరతను కూడ(సత్యం శివం సుందరమ్) వహించాడు.
సు+ అస్= స్వః= సుందరమైన సత్యస్వభావం కలవాడన్న నామాన్ని కూడ ధరించాడు. అంతేకాదు. తాను సృష్టించిన సృష్టిని కూడ ఎంతో అందంగా సృజించాడు.
కాబట్టి చెప్పే ప్రతి మాట- ప్రతి విషయం అఖర్వం- సుధితం- సుపేశసంగా ఉండాలి. అప్పుడే ఆ మాట విన్నవారికి కల్యాణ కారకమవుతుంది. దానికి భిన్నంగా ఇతరులకు చెబితే వారు దానిని అజ్ఞానం చేత ప్రమాణంగా తీసకొని కర్మారంభణం చేస్తారు. ఆ కర్మ సంసార బంధన హేతువవుతుంది. ఈ జ్ఞానుల సూక్తి చాలవరకు సత్యమే. జీవులనేకం పశు- పక్షి- కీటక- క్రిమి- పతంగాది నీచ జన్మల నెత్తి దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. ఎందుకు? ఆ జీవులు తమ పూర్వజన్మలలో కర్మాధికార స్వేచ్ఛ కలియియున్నా కూడా ఏది సత్కర్మయో- ఏది అసత్‌కర్మయో విచారించుకోకుండా ఇతరులు చెప్పిన దానిని విని ఆచరించిన దాని దుష్ఫలితమే.
అందుకే ఈ మంత్రం ముఖ్యంగా ‘దధాత యజ్ఞియేష్వా’ అఖర్వమూ- సుధితమూ మరియు ఉపేశసమూ అయిన వచనాన్ని భగవత్ప్రీతి కొఱకై యజ్ఞయాగాది సత్కర్మాచరణ చేసే వారికి మాత్రమే వినిపించు. అట్టి వారికి వినిపిస్తే పూర్వీశ్చన.... కర్మణా భువత్.(ఋ.7-32-13.) నీ పూర్వజన్మకృత పాప కర్మబంధనమంతా త్రెంచివేయబడగలదు అని మానవ సమాజానికి హితోపదేశం చేస్తూంది.
భగవత్ప్రీతికరంగా యజ్ఞయాగాదులను చేసే వారిని గాని లేక లౌకిక సత్కర్మలనాచరించే వారిని గాని గుర్తించడమెలా? ఈ సందేహమెవరికయినా వస్తుంది.
ఇంగువ తొలగింపబడినా ఆ పాత్ర దాని వాసనను చాలాకాలం ఎలా కలిగియుంటుందో మనస్సు కూడ పూర్వజన్మ సంస్కారాలను వాసనారూపంగా ప్రస్తుత జన్మలో కలిగి యుంటుంది. అదే సహజబుద్ధిగా పరిణమించి కర్మలనాచరిస్తూ ఉంటుంది. అందుకే ‘పుఱ్ఱెను పుట్టిన బుద్ధి’ అని నానుడి ఏర్పడింది. అట్టి వాసనామయ బుద్ధితో కర్మ పాప- పుణ్యకర్మ రూపంలో జీవుణ్ణి మోక్షగామి కాకుండ సంసారంలో బంధిస్తుంది. ఆ విధంగా సంసార బంధనాన్ని కలిగించే వాసనామయమైన కర్మను వీడాలి.
కుర్వనే్నవేహ కర్మాణి జిజీవిషేచ్ఛత్ర సమాః
ఏవం త్వయి నాన్యథేతో- స్తి న కర్మ లప్యతే నరే॥ యజు.40-2.

--ఇంకావుంది...