స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
యజ్ఞాలలో వేద మంత్రాలనే చదవాలి.
ఉపప్రయంతో - అధ్వరం మంత్రం వోచే మాగ్నయే
ఆరే- అస్మే చ శృణ్వతే॥ యజుర్వేదం 3-11॥
భావం:- యజ్ఞవేదికకు సమీపించే మేము దానికి దూరంగా ఉన్నా కూడ మా మాటలను వినగల భగవత్స్వరూపుడైన అగ్నిని వేద మంత్రాలలో స్తుతిస్తాము.
వివరణ:- భగవంతుడు ఆరాధింపబడే యజ్ఞానికి దూరానఉన్నా వారు అగ్నిని వేదమంత్రాలతో స్తుతించాలని, ఎందుకంటే ఆ భగవంతుడు చాలా దూరంలో ఉండి కూడ వారి మాటలను వింటూ ఉంటాడని ఈ మంత్రం చెబుతూంది. అంతేకాక భగవంతుడు ముఖ్యంగా ఆరాధింపబడేది కూడ యజ్ఞంతోనే. అందుకే ‘యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః’ (శు.య.వే.31-16) విద్వాంసులు యజ్ఞంద్వారానే భగవంతుని పూజిస్తారు’’ అని శుక్లయజుర్వేదం చెప్పింది. మరి అట్టి యజ్ఞానికి దూరంలోగాని సమీపంలో గాని ‘ఉప ప్రయంతో అధ్వరం మంత్రం వో చే మాగ్నయే’ వేద మంత్రమే పలికెదము’’అన్న ప్రతిజ్ఞావాక్యం ద్వారా శుక్ల యజుర్వేదం వేదమంత్రోచ్చారణనే విధిగా విధించింది. ఋగ్వేదం కూడ ఒక సందర్భంలో- ‘ఓ మరుత్తులారా! మిమ్ము, ఇంద్రుడు మరియు అగ్నిదేవతలను మా రక్షణకొరకు ప్రభుప్రీతి= సమర్థవంతమైన వేదమంత్రాలతో మేము పిలుస్తున్నాము’’అని పై యజుర్వేద మంత్రాభిప్రాయానే్న అనువదించింది.
- ఇంకాఉంది