స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకంటే ఉత్తమ యజ్ఞకర్తలు సర్వోత్తమమైన వేద మంత్రాల ద్వారా మిమ్ము సేవిస్తూ యజ్ఞాలనుచేస్తారు కాబట్టి.
మనం చేసే భగవదారాధనలన్నీ వేద మంత్రాలతోనే చేయాలని వేదాలలో అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. ప్రస్తుత మంత్రంలో అగ్నికి విశేషణంగా ‘ఆరే అస్మే చ శృణ్వతే’దూరంగా ఉండి కూడ మా మాటలను వినేవాడు లేదా మీ మాటలు మరియు దూరంగా ఉన్నవారి మాటలు వినేవాడు అన్న వాక్యం చెప్పబడింది.
దీనినిబట్టి యజ్ఞాగ్ని కేవలం భౌతికమైన అగ్నికాదని సమస్తాన్ని వినగల చేతన శక్తిసంపన్నమైన దివ్యతత్త్వమని గ్రహించాలి. ఆ దివ్యతత్త్వమే వేద చతుష్టయంలో ప్రధానంగా వర్ణింపబడింది. అదే దైవమని తదారాధనయే భారతీయ సంస్కృతీ వైభవానికి జీవగఱ్ఱయని ప్రతి భారతీయుడు గర్వించడంకాదు భక్తితో ఆరాధించాలి.
అంతేకాదు. వేద మంత్రాలతో స్తుతింపబడి మరియు ఆరాధింపబడిన దైవం ఆయనకు భక్తులెంత దూరంలోఉన్నా గాని భక్తుల కాయనెంత దూరంలోఉన్నా గాని వారి ప్రార్థనలను దగ్గర నిలిచిన వానివలె వింటాడు అన్న విశ్వాసం కలిగి ప్రతి వ్యక్తి యజ్ఞాగ్నిని భక్తిపూర్వకంగా ఆరాధించాలి.
**
దేవా!నిరాటంకమైన
నీ ఆశ్రయాన్ని ఇమ్ము
సుగో హి వో అర్య మన్మిత్ర పంథా
అనృక్షరో వరుణ సాధురస్తి
తేనాదిత్యా అధి వోచతా నో
యచ్ఛాతా నో దుష్పరిహంతు శర్మ॥ ॥ 2-27-6॥

భావం:- న్యాయ, మిత్ర, లోకోపకార స్వభావాల్లారా! మీ మార్గాలే నిజంగా సుఖంగా నడువదగినవి బాధారహితమైనవి, ఉత్తమమైనవి. మీరు న్యాయాది భావాలనుండి మమ్ము తొలగనీయక అందే ప్రవర్తించునట్లు చేసి మాకు శుభాన్ని, ఆశ్రయాన్ని ఈయండి.
వివరణ:- సంసారమార్గమనేక కష్టనష్టాలు, ఈతి బాధలు, దుఃఖకరమూ అయిన కారణంగా అది ఎగుడుదిగుడులతో కూడిన చిత్తడిమార్గమై యున్నది.
ఆ మార్గం ఈర్ష్యాసూయలు, రాగద్వేషాలు అరిషడ్వర్గాలు, అసత్యమూ, అశుచిత్వమూ, అతృప్తి మొదలైన ఎన్నో పాపభావాలకు కాణాచి. పరిస్థితులకు వశపడిగాని లేదా అల్పజ్ఞత చేతగాని మరే కారణాల చేతగాని విచలితుడై మానవుడు వీనివలన పరాజితుడైపోతున్నాడు. కాని మానవుని నైసర్గిత తత్త్వమిది కాదు.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512