స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఈ సందర్భంలో దయానందమహర్షి ‘మానవునిలోని ఆత్మ ఏది సత్యమో ఏది అసత్యమో నిర్ణయించగల సమర్థత కలిగియున్నద’’ని గట్టిగా చెప్పారు. అతడికి మదిలో సత్యజ్ఞానం స్ఫురించినంతనే మత్సరాది దుర్గుణాలు తొలగిపోయి వాని స్థానంలో లలితమూ, మార్దవమూ, ఆర్ద్రమూ అయిన భావా లు ఉదయిస్తాయి అని వేదం ‘సుగో హి వో పంథా సాధురస్తి’ ‘‘నీ మార్గాలు సుగమమూ, బాధారహితమూ మరియు శ్లాఘనీయమూ కాగలవు’’అని స్పష్టం చేసింది.
న్యాయ నిష్ఠ, మైత్రీ భావన, అలాగే లోకోపకార స్వభావం ఈ భావాలన్ని మానవునిలో హృదయ కల్మషాన్ని ప్రక్షాళనం చేస్తాయి. అట్టివానికి శత్రువులు లోకంలో ఎక్కడుంటారు? ఎందుకుంటారు? వారి జీవన మార్గాలన్నీ కంటక రహితంగా అంటే బాధారహితంగా ఉంటాయా? వేదం అనేక స్థలాలలోపై న్యాయ నిష్ఠ భావనను, మైత్రీభావనను, లోకోపకార భావాన్ని ఈ మూడింటిని సమష్టిగా ‘ఆదిత్య’అనే ఒకే నామంతో వ్యవహరించింది దాని లక్షణాన్ని ఋగ్వేదం ఇలా వివరించింది.
ఆదిత్యాసః శుచయో ధారపూతా అవృజినా అనవద్యా అరిష్టాః॥ ఋ.2-27-2॥
‘‘నిర్దోషమా (అర్యమ), అనింద్యమూ(మిత్ర), అహింసాత్మకమూ (అహింస) అయిన పవిత్ర విచారధారలచేత పవిత్రమైనది ఆదిత్య’’ అనబడుతుంది, వాస్తవానికి తదనుసరణీయుల జీవనమార్గాలే సుగమమైనవి.
- ఇంకాఉంది