స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటే దిక్కుతోచని వాడను, మంచి మార్గమేదో తెలియనివాడను, అజ్ఞానాంధకారంలో కూరుకుపోయినవాడను. నా బుద్ధికి తోచినంత మేరకు ధైర్యంగా నిన్ను శరణుజొచ్చుటయే శ్రేయమని నిశ్చయించుకొన్నవాడను అని భావం. కారణమేమంటె-
‘యుష్మానీతో అభయం జ్యోతిరశ్యామ్’ ‘‘నిన్ను ముందుంచుకొని అభయ రూపమైన దివ్యకాంతులను పొందగలను’’. నిన్ను గురిం చి పెద్దల వలన-
త్రీ రోచనా దివ్యా ధారయంత హిరణ్యయాః శుచయో ధారపూతాః
అస్వప్నజో అనిమిషా అదబ్ధా ఉరుశంసా ఋజవే మర్త్యాయ॥ ఋ.2-27-9॥
‘‘హితమూ, రమణీయమూ అయిన పవిత్ర భావనలచేత పవిత్రం చేసేవారు నిద్ర- కునికుపాట్లు లేని ప్రతిభాశాలురు మరియు మిక్కిలి ప్రశంసనీయులు అయిన సరళ స్వభావులైన మనుష్యులకోసం మూడు దివ్యమైన జ్యోతిస్సులను వహిస్తారు’’అని వినియున్నాను. అట్టి మీ మహిమను తెలుసుకొని-
యుష్మాకం మిత్రావరుణా ప్రణీతౌ పరి శ్వభ్రేవ దురితాని వృజ్యామ్‌॥
‘‘ఓ మిత్ర, వరుణ, అర్యములారా! మీ సర్వోత్తమ నీతిమార్గంలో నడుస్తూ, నేను నిర్మలుడనై పాపవిముక్తుడ నగుదునుగాక’’! అందుచేత మీ నీతిమార్గాన్ని అనుసరిస్తాను. అట్టి నీతిమంతులను-
న కిష్టం ఘ్నంత్యంతితో న దూరాద్య ఆదిత్యానాం భవతి ప్రణీతౌ॥ ॥
‘‘సమీపంనుండి గాని దూరంనుండి గాని ఎవరూ బాధింపలేరు మరియు చంపలేరు’’అని భగవానుడే వచించియున్నాడు. మరియు
నహి తేషామమా చన నాధ్వసు వారణేషు. ఈశే రిపురఘుశంసః॥
యస్మై పుత్రాసో అదితేః ప్ర జీవసే మర్త్యాయ. జ్యోతిర్యచ్ఛంత్యజస్రమ్‌॥
‘‘ఆదిత్యులు తమ జ్యోతులను (జ్ఞానాన్ని) ప్రసరింపచేసిన వారికి ఆదివ్యాధులు సంభవింపవు. వారి మార్గాలలోగాని వారి సాధనాలలోగాని పాపజనుల ప్రభావం ప్రసరించదు’’ ఆదిత్యులారా! నేను భగవానుని ఈ విధంగా ప్రార్థిస్తున్నాను.
ఉర్వశ్యామ భయం జ్యోతిరింద్ర మా నో దీర్ఘా అభి నశంత మిస్రాః॥
‘‘ప్రకాశించేవాని ప్రకాశింప చేయువాడా! నేను మహాబృహత్తరమైన అభయప్రదమైన జ్యోతిని పొందెదనుగాక!’’ అందరు ఈ ప్రార్థనానుభవాన్ని ఎల్లప్పుడు అనుభవింతురుగాక!
***
ఆదిత్యులారా! పాప నివారణ మీకే తెలుసు
విదా దేవా అఘానామాదిత్యాసో అపాకృతిమ్‌ పక్షా వయో యథోపరి వ్య స్మే శర్మ యచ్ఛతానేహసో
వ ఊతయః సు ఉతయో వ ఉతయః॥
ఋ-47-2॥

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512