స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
సూర్యుని వంటి దివ్యగుణ సంపన్నులారా! మీరు పాపాలను నశింపచేయుట బాగా తెలిసినవారు. పక్షి తన పిల్లలపై రెక్కలను కప్పి ఎలా రక్షిస్తుందో అదే విధంగా మీరూ మాపై రక్ష మరియు ప్రేమలను కప్పి రక్షించండి. మీరు మాపై చూపే రక్ష మరియు ప్రేమలు దోషరహితమైనవి. మీరు చూపే ప్రేమ, రక్షణలే సత్యమైన ప్రేమ, రక్షణలు.
వివరణ:- ఆదిత్యులే పాపనాశనశక్తి కలిగినవారు. ఎందుకంటే వారు;
త ఆదిత్యాస ఉరవో గభీరా అదబ్ధాసో దిప్సంతో భూర్యక్షాఃఅంతః పశ్యంతి వృజినోత సాధు సర్వం రాజభ్యః పరమా చిదంతి॥
॥ ‘‘ఆ ఆదిత్యులు విస్తారమైన, గాఢమైన, దుస్సాధ్యమైన పాపాలను నశింపచేసే ఇచ్ఛకలవారు. బహునేత్రాలు గల ఆ ఆదిత్యులు పాపాలను నిశితంగా అంతరంగా దర్శింపగలరు’’. అందుచేత మీరు-
మహి వో మహతామవో వరుణ మిత్ర దాశుషే. యమాదిత్యా అభి ద్రుహో రక్షథా నేమఘం నశత్...॥ ఋ.8-47-1॥
‘‘ఓ వరుణ! ఓ మిత్ర! ఓ అర్యమా! ఆదిత్యులారా! మీరు దాతలకు, మహాపురుషులకు గొప్ప రక్షకులు.
- ఇంకాఉంది