స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజంగా ఆత్మ జన్మరహితమైనది. శాశ్వతమైనది. అంటే మానవ మరణశీల దేహంలో ఉన్నా అది అమరమైనదే అని ఋగ్వేదం ‘అమర్త్యో మర్త్యేనా స యోనిః’ (ఋ.1-164-38) ‘‘అమృతమైనదైనను మరణ స్వభావం గల ఒక ఉపాధియందు ఆత్మ ఉంటుంది’’అని ఆత్మ స్వరూపాన్ని మరోమారు వర్ణించింది. ఆ విధంగా ఆత్మ దేహం పొందేందుకు కారణం కర్మయే.‘అపాజ్ ప్రాజేతి స్వధయా గృభీతః’ (ఋ.1-164-38) ‘‘తన కర్మవశం వలన బంధింపబడి శాశ్వత స్థితినుండి అశాశ్వత దేహబంధంలో ఆత్మ చిక్కునపడిపోతుంది’’ అని ఋగ్వేదం ఆత్మదేహబంధ స్థితికి హేతువును పేర్కొంది. ఈ రీతిగా ఆత్మకర్మబంధంచేత సద్గతి-దుర్గతులను పొందుతుంది. అంచేత ‘పశ్యతేమమ్’. దీనిని చూడుమని మంత్రం హెచ్చరించింది.
ధ్రువం జ్యోతిర్నిహితం దృశయే కం మనోజనిష్ఠం పతయత్స్వంతః
విశే్వ దేవాః సమనసః సకేతా ఏకం క్రతుమభి వి యంతి సాధు॥ ॥
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512