స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
క్రతువును= కర్మను చేసే కరణాలు అనగా సాధనాలు అని అర్థం. మనోబుద్ధ్యాదుల లక్ష్యమొక్కటే అయినపుడు అవి స్థూలంగా భిన్నభిన్నమైనవయినా పరస్పరం విరోధమైన కరణాలు కావు. ఆత్మ క్రతు= కర్మనుచేసే యాజ్ఞికుడైన యజమాని అయినపుడు మనో, బుద్ధి, ఇంద్రియాలు ఆయన అధీనంలో ఉండేవే అవుతాయి. అంటే అవి ఆత్మకు విధేయంగా కర్మలనుచేసే కరణాలు అవుతాయి. ఫలితంగా అవి ఆత్మవలె స్వతంత్రాలు కావు. ఆ విధంగా స్వతంత్రమైన ఆత్మకు పరతంత్రంగా ఉంటూ మనోబుద్ధ్యాదులు ఆత్మదర్శన ప్రయోజనార్థంగా సార్థకమవుతాయి. ఆ రీతిగా అనేక శరీరాలు ధరించే ఆత్మను మనోబుద్ధాదీంద్రియాలు అనుసరిస్తాయి.
**
నేనేమి చెప్పగలను? ఏమని ఆలోచించను?
వి మే కర్ణా పతయతో వి చక్షుర్వీదం జ్యోతిర్హృదయ ఆహితం యత్‌
వి మే మనశ్చరతి దూర ఆధీః కిం స్విద్వక్ష్యామి కిము నూ మనిష్యే॥

భావం:- నా చెవులు చెవులకింపైన తావుల వెంట పరుగులుపెట్టాయి. నా కండ్లు సుందరమైన రూపాలలో చిక్కుకొనిపోయాయి. అందువల్ల నా హృదయంలో ఉన్న ఆత్మ వివిధ వాసనల వెంటబడింది. ఇక నా మనసో! దూరదూరంగా ఉన్నవాటికై ఆలోచింపసాగింది. మరింక నేనేమి చెప్పను? ఏమి ఆలోచించను? భగవానుడు ఆత్మజ్యోతిని దర్శించుమని జీవుల నాదేశించాడు. ఇది విన్న జీవాత్మ ఇదికూడ ఇంద్రియ గోచరమయ్యే పదార్థమని భ్రమించింది. వెంటనే ఇంద్రియాలతో దానిని చూచేందుకు, తెలుసుకొనేందుకు ప్రయత్నమారంభించింది. ముందుగా చెవులను పిలిచి ఆత్మారాముని తెలుసుకొనివచ్చి చెప్పుమని ఆదేశించింది ఆత్మ. ఆత్మాదేశానుసారం చెవులు వెళ్లాయి. కాని మార్గంలో మధుర శబ్దాలు వినబడ్డాయి. చెవులు ఆకర్షితమై అక్కడే ఆగిపోయాయి. చెవులు తిరిగి రాకపోవడంతో కళ్లను పిలిచి ఆత్మను దర్శించి రమ్మని ఆజ్ఞాపించింది. చెవులవలె కళ్లుకూడ వెళ్లి మార్గమధ్యలో కనబడ్డ మనోహర రూపాలను చూచి తన్ను మరచి అక్కడే నిలిచిపోయాయి. సర్వేంద్రియాలు కూడ ఆత్మ ఆజ్ఞానుసారం వెళ్లి అదే విధంగా ప్రవర్తించాయి.
- ఇంకాఉంది