స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
వీని కథ ఇంతటితో ఆగితే మంచిదే. కాని అవి పోయే సమయంలో ఆత్మజ్యోతిని కూడ వెంటపెట్టుకొని పోయాయి. అలాపోగా ‘వీదం జ్యోతిర్హృదయ ఆహితం యత్’ ‘‘హృదయ గుహలో ఉండే ఆత్మజ్యోతి కూడ ఇంద్రియాలతోబాటు వివిధ విషయాలలో చిక్కుకొనిపోయింది.’’ శాస్త్రం కూడ ఈ విషయానే్న ఇలా నిర్ధారిస్తూంది.
‘ఆత్మా జిజ్ఞాసతే, అనంతరం మనసా సంయుజ్యతే, మనః ఇంద్రియేణ, ఇంద్రియమర్థేన, తతో జ్ఞానోద్భవః’’ ఆత్మయందు తెలుసుకోవాలనే ఇచ్ఛ కలుగుతుంది. వెంటనే అది మనస్సుతో జత కూడుతుంది. తదుపరి మనస్సు ఇంద్రియాలతో సంయోగం చెందుతుంది. ఇంద్రియాలు విషయార్థాలతో సంపర్కం పొందుతాయి దానివలన జ్ఞానం జనిస్తుంది’’. ఆత్మననుసరించి మనస్సు, మనస్సుననుసరించి అంతఃకరణలు అనగా మనోబుద్ధి చిత్తఅహంకారాలు అనుగమిస్తాయి. అప్పుడు మనసు ఆగుతుందా?
ఇచ్ఛానుసారం పరుగులు తీస్తుంది. అందుకే ఈ మంత్రం ‘వి మే మనశ్చరతి దూర ఆధీః’ ‘‘నా మనస్సు కూడ దూరదూర తీరాలలో సంచరించింది’’అని మనస్స్వభావాన్ని వర్ణించింది. అంటే మనస్సుతో లగ్నమైన ఆత్మ ఇంద్రియాల ద్వారా విషయాలలో పరిభ్రమిస్తూ ఉంటుందని భావం.
అలా ఆత్మ తన లక్ష్యంనుండి పతితమవుతుంది. పతితమైన ఆత్మ ‘కింస్వి ద్వక్ష్యామి కిము నూ మనిష్యే.’ ‘‘ఏమని చెప్పేది? ఏమని విచారించేది? అని రోధిస్తుంది. నిజానికి మనోబుద్ధ్వహంకార చిత్తాలు ఆత్మకు సేవకులు. కాని ఆత్మ తన తప్పిదంవలన సేవకులను తనకు స్వామిగా భావించి ప్రవర్తించింది.
ఈ దుర్దశలో పడిన ఆత్మ పాపాచరణకు పాల్పడుతుంది అని అథర్వణవేదం ‘అక్షద్రుగ్ధో రాజన్యః పాప ఆత్మ పరాజితః’ (అథ.5-18-2) ‘‘ఇంద్రియాల విద్రోహంవలన ఆత్మ పరాజయం పొందుతుంది. అదే పాపం’’ అని ప్రతిపాదించింది.
ఋగ్వేద ప్రతిపాదననే నిర్థారించింది. కాబట్టి ఆత్మ తిరిగి తిరిగి ‘కింస్విద్వక్ష్యామి? కిము నూ మనిష్యే’ ‘‘ఏమని చెప్పేది, ఏమని విచారించేది’’అని పశ్చాత్తాప పడకుండ దైవాభిముఖంగా ఆత్మను ప్రవర్తింపచేయండి.
***
- ఇంకాఉంది