స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక ఉత్తరార్థ మంత్రంలో పుణ్యకర్మనాచరించే ఉపాయాన్ని ఈ విధంగా వివరించింది.
‘యత్తే ధీతిం సుమతి మావృణీమహే- ధ స్మా నస్ర్తీవరూథ శివో భవః’ ‘‘నీ ధ్యానం, చింతనల ద్వారా సుజ్ఞానాన్ని పొందుతాం. ప్రకృతి, జీవుడు, పరమాత్మ అనే త్రివిధ తత్త్వాలలో శ్రేష్ఠుడవైన (పరమాత్మ) నీవు మాకు శుభదాయకుడవగుదువు గాక’’ నిజమే. సృష్టిలో దైవం తప్ప శ్రేష్ఠమైనది కలదా? లేదు. కాబట్టి జీవులకు దైవధ్యానం మరియు చింతనలే నిః శ్రేయసంప్రదాయకాలు. జీవులు చేసే కర్మలు పుణ్యప్రదమైనవయినా పాపదాయకమైనవయినా ఆయనకు సర్వమూ గ్రాహ్యమే. ఆయన దృష్టిపథంలోనికి రాకుండ ఏ జీవుడూ ఏ కర్మనూ చేయజాలడు. ఎందుకంటే ఆయ ‘రజనీ సమీయసే’ ఊర్ధ్వ అధోలోకాలలో సర్వత్ర వ్యాపించియున్నాడు’’వ్యాపించి ‘ఉభయాన్ అనువ్రతా దూతో దేవానామ్’ పాపపుణ్యకర్ములకు ఇరువురికి వారి కర్మానుగుణమైన సుఖదుఃఖాలననుభవింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి ‘జీవులారా! సావధానులై సత్కర్మలనే ఆచరించండి’అని వేదం హితవును ప్రబోధిస్తూంది.
**
శరీరం రాలిపోయేదే
తవ శరీరం పతయిష్ణ్వర్వంతవ చిత్తం వాత- ఇవ ధ్రజీమాన్‌
తవ శృంగాణి విష్ఠితా పురుత్రారణ్యేషు జర్భురాణా చరంతి॥ య.29-22॥
భావం:- ఓ జీవాత్మా! నీ శరీరం నశించిపోయేదే. నీ మనస్సు గాలివలె వేగవంతమైనది. మరియు చంచలమైనది. బలిసిన నీ ఇంద్రియాలు విషయారణ్యాలలో స్థిరంగా ఉండి అక్కడే సంచరిస్తున్నాయి.
వివరణ:- తల్లివలె మేలును కోరే వేదమాత జీవులను ఉద్ధరించేందుకు ఎన్నో ఉపదేశాలనుచేస్తూ ఉంది. ఒకచోట ‘ధ్రువం జ్యోతిః’ ‘‘ఆత్మ నిత్య’’మని మృత్యుభయాన్ని పోగొట్టుతూ ఉంది. మరొకచోట శరీరమనిత్కమని, సంసారమసారమని, దానినుండి విముక్తిని పొందేందుకు ఉత్సాహాన్ని కలిగిస్తూంది. ఈ మంత్రంలో శరీరం వినాశన ధర్మం కలదని ‘తవ శరీరం పతయిష్ణ్వర్వన్’ ‘‘ఓ జీవాత్మా! నీ శరీరం పతనశీలమైనది’’అని హెచ్చరించింది. శీలం లేదా స్వభావం మాత్రం నశించేది మాత్రంకాదు.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు