స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచకోశాలు
కేష్వంతః పురుష- ఆ వివేశ కాన్యంతః పురుషే- అర్పితాని
ఏతద్ బ్రహ్మన్నుప నల్హామసి త్వా కింస్విన్నః ప్రతి వోచాస్యత్ర॥
51॥
పంచ స్వంతః పురుష ఆ వివేశ తాన్యంతః పురుషే- అర్పితాని
ఏతత్త్వాత్ర ప్రతిమన్వానో- అస్మి న మాయయా భవస్యుత్తరో మత్
॥ 52॥
॥ 52॥
భావం:- ఓ బ్రహ్మస్వరూపా! జీవాత్మ వేనియందు ప్రవేశిస్తున్నది? ఏవి జీవాత్మయందు లేదా జీవాత్మకు సమర్పించబడ్డాయి. నీ దరిచేరి ఈ ప్రశ్నను అడుగుతున్నాం. దీనికేమి బదులిస్తావు?
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలైదింటిలో జీవాత్మ ప్రవేశించింది. ఆ ఐదు కోశాలే జీవాత్మలో లేదా జీవాత్మకు సమర్పింపబడ్డాయి. ఈ విషయంలో నీకిదే సమాధానం. బుద్ధియందు నీవు నాకంటే శ్రేష్ఠుడవు కావు.
వివరణ:- అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలలో జీవాత్మ ప్రవేశించింది. ఆ ఐదుకోశాలే జీవాత్మకు సమర్పించబడ్డాయి. ఈ కోశాలను గురించి దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశంలో ఈ విధంగా వివరించారు.
1. అన్నమయ కోశం:- చర్మంనుండి అస్థి పర్యంతం శల్యాల వరకుగల స్థూల శరీరం.
2 ప్రాణమయ కోశం:- ప్రాణమనగా వాయువు. శరీరంలో ఇది ఐదు విధాలుగా ఉంటుంది.
1) ప్రాణం:- శరీరం లోపలినుండి బయటకు విడువబడునది.
2) అపానం:- శరీరంనుండి లోపలకు చేరే వాయువు.
3) సమానం:- నాభియందు నిలిచి శరీరమంతట శక్తిని వ్యాపింపచేసే వాయువు.
4) ఉదానం:- కంఠప్రదేశంలో ఉండి అన్నపానాదులను లోపలకు ప్రవేశింపచేసే వాయువు.
5) వ్యానం:- శరీరంలోని కర- చరణాది అవయవాలను కదిలించి పనులను చేయించే వాయువు.
3) మనోమయ కోశం:- మనస్సు అహంకారంతోబాటు, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలనే ఐదు కర్మేంద్రియాలుగల కోశం.
4. విజ్ఞానమయ కోశం:- బుద్ధి, చిత్తం, చక్షువులు, శ్రోత్రములు, జిహ్వ, నాసిక, చర్మం అనే వాని సమాహారం విజ్ఞానమయ కోశం.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు