స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
తనకు సహాయపడే మిత్రుడు ‘అన్నాభిలాషియై రాగా అతడికింత అన్నంపెట్టి ఆదరించనివాడు మిత్రుడే కాడు. అటువంటి మిత్రుడినుండి దూరంగా వెళ్లిపోవాలి. ఎందుకంటే అటువంటి వాని ఇల్లు ఇల్లేకాదు. వానిని విడిచి సులభంగా ఆశ్రయమిచ్చే దాతనాశ్రయించాలి.
వివరణ:- ఋగ్వేదంలోని 10-117 సూక్తం పూర్తిగా దాన ప్రోత్సాహకమే. అన్నాభిలాషియై మిత్రున్నాశ్రయిస్తే వానికన్నం పెట్టనివాడు మిత్రుడేకాడు’అని వేదం ప్రతిపాదిస్తూంది. మిత్రుడంటే సంకట పరిస్థితులలో రక్షించేవాడుగా ‘సఖా సఖాయ మతరద్ విషూచోః’ (ఋ.7-18-6) అని వేదం పలు సందర్భాలలో చెప్పింది. ఎదురుగా అన్నార్తుడై విలపించే మిత్రుడికింత అన్నంపెట్టి ఆదరించని పాషాణ హృదయుని గర్హిస్తూ-
య ఆధ్రాయ చకమానాయ పిత్వో- న్నవాన్‌త్సన్ రఫితాయోపజగ్ముషే!
స్థిరం మనఃకృణుతే సేవతే పురోతో చిత్స మర్డితారం న విందతే॥ ॥
‘‘దుర్దశాగ్రస్తుడు, దుఃఖితుడు, అన్నార్తుడై దరికి చేరినవానికి సంపూర్ణంగా అన్న సమృద్ధికలవాడయినా కూడ వారికన్నంపెట్టక కఠిన మనస్కుడై వాని ఎదుటనే అన్నాన్ని తినేవాడు జీవితంలో సుఖమన్నదానిని పొందజాలడు’’అని ఋగ్వేదం కఠినంగా శపించింది. దీనుడు దుఃఖితుడైన మిత్రుని దుఃఖాన్ని నివారింప ప్రయత్నింపనివాడు, దుఃఖోపశమనంగా కనీసం స్వాంతన వచనాలు పలుక నిష్టపడనివాడు, సానుభూతిని ప్రకటింపనివాడు ఎంత ధనవంతుడైతేనేమి? సమాజంలో ఎంతటి గౌరవనీయుడయితే నేమి? పొరుగువాడి దుఃఖార్తిని నివారించడం కేవలం ప్రశంసార్హమేగాదు నిజమైన దానమదే. ఈ విషయాన్ని దయానందమహర్షి ఇలా వివరించారు. ‘‘అన్నార్తుడు, దాహార్తుడు వచ్చినంతనే అన్న- పానాలను వారికి తప్పక ఈయాలి. అట్టివారు పొరుగువారే అయితే ముందుగా వారికి సమర్పించాలి. ఆ రీతిగా చేయడం ద్వారా మనలోని దయ-ఔదార్యాల ప్రకటనకొక అవకాశం లభిస్తుంది. ఈ అవకాశం అభిమాన గర్వంగల వానికి లభింపదు. దయ, సహానుభూతి మున్నగు హార్దిక గుణాలు సమీపంలో ఉన్న దుఃఖితులు, పీడితులను చూచే అవకాశమే నెపంగా మదిలో ఉద్భవిస్తాయి. తనకు దగ్గరలోఉన్న దుఃఖార్తుల మీద కరుణ చూపక మరెక్కడో ఉన్నవారిపై చూపితే అతడిని నిజమైన దయాశీలుడు సానుభూతిపరుడు అనరు.

- ఇంకాఉంది