స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
భావం: జ్ఞానదృష్టితో వస్తుతత్వాన్ని దర్శించగల శాంతికాముక జీవులారా! సమస్త భోగవస్తువులతో నిండిన ఈ లోకాలన్నీ మీ కొరకు మాత్రమే సృజింపబడియున్నాయి. నదీ నదాలు, సెలయేర్లు మొదలగునవన్నీ మీ కొరకు మాత్రమే పుష్కల జలప్రవాహాలతో ప్రవహిస్తూ ఉన్నాయి.
వివరణ: విశాలమైన ఈ సృష్టిజాలాన్ని చూచినపుడు ఇది ఎవరికోసం? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. నిజంగా ఇది చాలా గంభీరమైన ప్రశ్న. ఇక్కడ జీవించే జీవులకోసమే అని దానికి సమాధానం. అంటే జీవుడు పరమాణువు కంటె చాలా సూక్ష్మమైనవాడు. అతడికోసమీ బృహత్తర సృష్టిజాలమవసరమా? అని వేదార్థ జ్ఞానశూన్యులు భావించవచ్చు. వాస్తవానికి ఈ బ్రహ్మాండాలన్నీ నిష్ప్రయోజనమైనవేనా? లౌకిక దృష్టితో పరిశీలించినచో లోకంలో ఎవరికి కూడా ఉపయోగకరంగాని వస్తువును సృష్టించే శాస్తజ్ఞ్రుడు గాని, శిల్పిగాని ఉంటాడా? వస్తు నిర్మాణకర్త ఎదురుగా లేకపోయినా కనబడుతున్న వస్తువును బట్టి దానిని నిర్మించినవాడెవరో అర్థమవుతుంది. దానితోబాటు వినియోగించుకొనే వ్యక్తి ఎవడో ఉన్నాడని కూడా తెలుస్తుంది. అలాగే కనబడే ఈ సృష్టిజాలమంతా కూడా. ఈ సందర్భంలోనే వేదం ‘తుభ్యేమం భువనా.. సింధవః’- జీవుడా! ఈ విశాల బ్రహ్మాండజాలమంతా నీకోసమేనని ఈ సృష్టి ఎవరికోసమో అనే ప్రశ్నకు బదులు చెప్పింది.
మరి దానితోబాటు ఆ సృష్టిని వినియోగించుకొనే జీవుడా! నీవు ఈ లోకంలోనికి పదే పదే వస్తువు. ‘ఆ వరీవర్తి భువనేష్వంత’ అని ఋగ్వేదం సృష్ట్భిక్త ఎవరో కూడా నిర్దేశించింది.
ఒకవేళ ఈ సృష్టి జీవుని కొరకు కాకుంటే అతడికసలు ప్రవేశముంటుందా? అందుకే జీవుని కొరకు మాత్రమే అయిన ఈ సృష్టి జీవుని ఘనతను ఋగ్వేదంలో ‘ఇంద్రాయ ద్యావ ఔషధీ రుతాపో రయిం రక్షంతి జీరయో వనాని’- ఆ స్వయంప్రకాశకాలైన అంతరిక్షలోకాలు- పృథివి- దానిపైగల ఓషధులు- జలం- వనలా- ఇలా అన్ని జీవుని ధనసంపన్నుడిగా చేస్తున్నాయి అని ధృవపరిచింది.
అయితే జీవుడీ ప్రకృతి వస్తువులను సదుపయోగం చేసికొన్నపుడే అవి ప్రీతిసాధనం కాగలవు. లేకుంటే అవి మృత్యుసాధనాలవుతాయి. జీవుని కొరకే అయిన ఈ సృష్టి జాలమంతా జీవుని ఘనతనే చాటుతున్నా మావటివాని చిన్న అంకుశంతో పెద్ద ఏనుగు కూడా లొంగిపోయినట్లుగా జీవుడెంతటి ఘనుడైనా సృష్టిని సద్వినియోగపరచుకోకుంటే పరిణామం అతడికి మృత్యుసాధనమే అవుతుంది. కాబట్టి జీవులు అంటే మా000నవులు సృష్టినెలాగయినా ఉపయోగించుకోవచ్చు. కాని పరిణామాన్ని మాత్రం ఆలోచించుకోవాలి.
జ్ఞాని - అజ్ఞానుల భేదం
ఆ యద్యోనిం హరిణ్యయమాశుర్ ఋతస్య సీదతి జహాత్య ప్రచేతసః
అభి వేనా అనూషతే యక్షంతి ప్రచేతసః మజ్జంత్య విచేతసః

ఇంకావుంది...