స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ మనస్సులతోబాటు మీ చిత్తం (తర్క సహితమైన బుద్ధి) కూడ సమానంగా ఉండుగాక. నేను మీ అందరికి ఒకే విధమైన భోగ ద్రవ్యాలను సృష్టించి ప్రదానం చేసియున్నాను.
వివరణ:- మనసుతో ఆలోచించుట, దానిని బాహ్యంగా పలుకుట, పలికిన దానినిచేయుట ఈ మూడు సమానంగా ఉండే సాధనోపాయాలను భగవంతుడీ మంత్రంలో ఆదేశిస్తున్నాడు.
సమానో మంత్రః:- మనస్సులోని ఆలోచన గాని, ధ్యానంచేసే గురు మంత్రం గాని అందరికి సమానంగా ఉండాలని దైవోపదేశం. చిత్రమైన రుూ ఉపదేశం సాధ్యమా? అని శంకింప పనిలేదు. మనోభావాలు సమానమైతే ఇది సుసాధ్యమే. ఈ రీతిగా మానవాళి మనుగడ సాగించాలన్నదే భగవంతుని ఆకాంక్ష.
సమితిః సమానీ:- ఆలోచనలు చేసేందుకు, గురుమంత్రాన్ని ధ్యానించేందుకు స్థలం కూడ ఒకటే కావాలని దైవాదేశం. ఇది మనుష్యుల మధ్య వైషమ్యాలు, భిన్నాభిప్రాయాలు లేనప్పుడు పైదానివలె ఇది కూడ సంభవమే. గురుమంత్రం దైవారాధనకు సంకేతం. ఆధునిక భాషలో చెబితే దైవం పేరుతో చేసే మత భావనలు దైవమొక్కటే అన్న భావం మానవులందరిలో సమానంగా నెలకొనియుంటే అందరు కలిసి ఒకేచోట సఖ్యతతో దైవరాధాన చేసుకోగలగడం దుస్సాధ్యమేమీ కాదు. మానవాళి అంతా అలా దైవసంబంధంగా ఏకాభిప్రాయం కలిగి జీవించాలన్నదే దైవ హృదయం.
ఈ దైవ హృదయాన్ని విస్మరించి దైవమొక్కటే అంటూనే దైవంకోసం పరస్పరం మానవులు అనాదిగా సాగిస్తున్న మారణకాండతో రక్తపుమరకలు పడిపోయిన మానవ చరిత్ర పుటలను చిరకాలంగా మనం చదువుతూనే ఉన్నాం.
సమానం మన. సహ చిత్తమేషామ్:- మనస్సుతోబాటు చిత్తంకూడ సమానం కావాలి’అని దీని అర్థం. మనస్సు స్వభావం సంకల్ప వికల్పాలను చేయడం. వానిలో తార్కికత ఉండవచ్చు లేకపోవనూవచ్చు. కాని చిత్తమలా కాదు. ప్రతి అంశాన్ని తార్కికంగా విచారిస్తుంది. బుద్ధి వానిలో ఏది సముచితమో నిర్ణయిస్తుంది. అందుకే ‘నిశ్చయాత్మికాబుద్ధిః’ అని నిర్వచనం చెప్పారు. సంకల్ప వికల్పాలతో నిండిన మనస్సుతోబాటు తార్కికంగా ఆలోచించే చిత్తం కూడ ఒకటి కావాలని దైవాదేశం.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512