స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
కాకుంటే సంకల్ప వికల్పాలు గల మనస్సుచేసే తొందరపాటు నిర్ణయాలు అనతికాలంలోనే ‘చిత్త’ తార్కిక పరీక్షకు గురి అయి మార్పుకు గురి అవుతాయి. అందుకే మనస్సుతో చిత్తం కూడ ఏకీభవించి ప్రవర్తించాలని దైవం హితవు చెప్పింది. ఆ హితవును పాటించకుంటే సాఫల్యత సందిగ్ధమైపోతుంది.
ఈ విధంగా అన్ని సమానంగా ఎందుకుండాలి? భగవానుడు ‘సమానం మంత్రమభి ... జుహోమి’ ‘‘మీ అందరికి ఒకే విధమైన భోగ ద్రవ్యాలను ప్రదానం చేసా’’నని జ్ఞాపకం చేసాడు.
సృష్ట్యారంభంలో భగవంతుడు జీవుల కల్యాణానికి వేదాలను ప్రసాదించాడు. అది అందరకు సమాన కల్యాణప్రదమే. అందుకే వేదం విశ్వజన కల్యాణదాయినిగా ప్రసిద్ధివహించింది. దానితోబాటు సూర్య, చంద్ర, భూమి, జల, వాయు, ఆకాశాది పంచభూతాలు కూడ అందరికి సమానంగా ఈయబడ్డాయి. ఇలా అన్ని భగవానునిచే మానవాళికి సమానంగా ఈయబడితే వారిలో విభేదాలెందుకు?
ఈ మంత్రంలో గల ‘మనః’ శబ్దానికి బదులుగా వ్రత శబ్దంతో ఇదే మంత్రం యథాతథం
అథర్వణవేదంలో క్రింది విధంగా కనిపిస్తూంది.
‘సమానో మంత్రః సమితిః సమానీ, సమానం వ్రతం సహచిత్తమేషామ్’ ॥
ఈ మంత్రంలో గల ‘వ్రత’ శబ్దానికి ‘ఉద్దేశ్య’మని అర్థం. ఆలోచనలు చేసేందుకు, గురుమంత్రాన్ని ధ్యానించేందుకు ‘స్థలం’ ఒకటే కావడం అందరి ‘వ్రతం’ అంటే ‘ఉద్దేశ్యం’ ఒక్కటి అయినప్పుడు మాత్రమే సంభవం. అంటే ఈ మంత్రం ఋగ్వేద మంత్రమైన సమానీ మంత్రః అన్నదానికి వివరణాత్మకమని గ్రహించాలి. ఇట్లే పై అథర్వణవేద మంత్రం ఉత్తరార్థమైన ‘సమానేన వో హవిషా జుహోమి, సమానం చేతో అభి సంవిశధ్వమ్’ (అథ.వే.6-64-2) అనే వాక్యంలో మనస్సు, చిత్తం ఎందుకు ఏకృకృతం కావాలో కారణాన్ని వివరిస్తూ ‘‘మీ అందరికి సమానమైన భోగ ద్రవ్యాలను సృష్టిలో సిద్ధంచేసి సమానంగా ఇచ్చి యున్నాను వాని ననుభవిస్తున్న మీరందరు ఒకే మనస్సు కలవారు కండి’’ అని హితవు పలికింది.
అవును. నిజమే. భగవానుడు సృష్టిలో అందరికి సమానంగా సిద్ధపరచి ఇచ్చిన సమస్త భోగ ద్రవ్యాల ననుభవిస్తున్న మానవజాతిలో ఈ వైమనస్యాలెందుకో!! అది ఒక విధంగా అందరు చేస్తున్న దైవాపచారం కాదు కదా!
***
- ఇంకాఉంది