స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

పురుష్టుతస్య= అనేకులచే ప్రశంసింపబడుతున్న భగవానుని యొక్క; పరిప్రియః= ప్రేమపాత్రుడై; మతీ= సద్బుద్ధి కలిగి; హిన్వతే= సత్ప్రవర్తన కలిగి యుంటాడు.
భావం:- శరీరేంద్రియాలను శుద్ధపరచుకొనే రీతిగా జీవాత్మను కూడ పురుషుడు పరిశుద్ధపరచుకోగలడు. అతను జీవాత్మను అన్యమార్గాలకు గొనిపోగల ఇంద్రియాలుగల శరీర కలశంతోకూడి యుండికూడ స్వప్రయత్నం లేకనే లౌకిక సర్వభోగాలను అనుభవించగలడు. ఆనందంతో పరమాత్ముని సన్నుతి చేయగలడు. సర్వ జనసేవితుడైన భగవానుడికి పరమప్రేమపాత్రుడై సత్ప్రవర్తన కలిగి సదా ప్రవర్తిస్తాడు.
వివరణ:- ఓ మానవుడా! ఆత్మను పరిశుద్ధపరచుకో. జీవుని పవిత్రంగా ఉంచుకో. అన్న సందేశ మన్నిఎడల వినబడుతూ ఉంటుంది. కాని ఎలా పవిత్ర పరచుకోవాలో చెప్పేవారు మాత్రమెవరూ కనబడరు. కాని వేదమీ సమస్యకు ‘హరిం మృజంత్యరుషో న’ ఇంద్రియాలను పరిశుభ్రపరచుకొనే రీతిగా జీవాత్మను పరిశుద్ధపరచుకో అని సోదాహరణంగా మార్గాన్ని సూచించింది. అయితే ఈ సందర్భంలో ఇంద్రియాలను ఎలా పరిశుద్ధపరచాలి? అన్న మరో ప్రశ్న ఉదయిస్తుంది. జిజ్ఞాస ఉండాలే గాని సమాధానం దొరకదా? ధర్మశాస్త్రంలో మనువు దీనికి సమాధానాన్ని ఇలా చెప్పాడు.
ఇంద్రియాణాం విచరతాం విషయేష్వపహారిషు
సం యమే యత్న మాతిష్ఠే ద్విద్వాన్ యంతేవ వాజినామ్‌॥ మనుధర్మ. 2-88॥
భావం:- నిపుణుడైన సారథి గుఱ్ఱాలను సక్రమంగా నడిచే విధంగా ఎలా నియంత్రణ చేస్తాడో అలాగే విద్వాంసుడు చెడు మార్గమైన విషయాల వెంటబడిపోయే విధంగాచేసే చంచల స్వభావంగల ఇంద్రియాలను సంయమనం అంటే నిగ్రహం చేస్తాడు.
ఇంద్రియాణాం ప్రసంగేన దోషమృచ్ఛత్యసంశయమ్‌
సంనియమ్య తు తానే్యవ తతః సిద్ధిం నియచ్ఛతి॥ మనుధర్మ. 2-99॥
దీనినిబట్టి ఇంద్రియాలను పరిశుద్ధంచేసే ఉపాయం కేవలం సంయమన మొక్కటే అన్నది స్పష్టం. దీనివల్లనే ఇంద్రియాలు స్వాధీనమవుతాయి. ఈ ప్రయత్నాల్లో విఫలమయితే ఇంద్రియాలు అదుపుతప్పి ప్రవర్తించి అనేక పాపకార్యాలను చేయిస్తాయి.
ఈ విధంగా ధర్మశాస్త్రం కేవలం ఇంద్రియ పరిశుద్ధతతో తృప్తిపడక
ఆద్భిర్ గాత్రాణి శుధ్యంతి మనః సత్యేన శుధ్యతి
విద్యాతపోభ్యాం భూతాత్మా బుద్ధిర్ జ్ఞానేన శుధ్యతి॥ మనుధర్మ. 5-109॥
నీటితో శరీరావయవాలు, సత్యశీలంతో మనస్సు, విద్య, తపస్సులచేత ఆత్మ; వివేకంచేత గడ్డిపోచనుండి బ్రహ్మపర్యంతమూ పవిత్రతను, పరిశుద్ధతను పొందుతున్నాయి అని ఇంద్రియ పవిత్రత ద్వారా ఆత్మపవిత్రత దానిద్వారా ఆత్మగమ్యమైన మోక్షస్థితికి సాధనోపాయమైన వివేకమార్గాన్ని సూచించింది.

--ఇంకావుంది...