స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రియాణాం తు సర్వేషాం యద్యేకం క్షరతీంద్రియమ్‌
తేనాస్య క్షరతి ప్రజ్ఞా దృతేః పాత్రాదివోదకమ్‌॥ మ.స్మృ. 2-99॥
‘‘సర్వేంద్రియాలలో ఏ యొక్కటి స్ఖలితమైనా చిల్లు పాత్రలోని నీరు కారిపోయినట్లుగా ఆ మనిషి నిరర్థకుడవుతాడు.’’ అందుచేత-
వశే కృత్యేంద్రియగ్రామం సంయమ్య చ మనస్త్థా
సర్వాన్ సంసాధయేదర్థానక్షణ్వన్ యోగతస్తనుమ్‌॥ మ.స్మృ 2-100॥
ఇంద్రియాలను, మనస్సును వశపరచుకొని యోగాభ్యాసం ద్వారా శరీరానికి బాధకల్పింపక సర్వకార్యాలను నిర్వహించుకొమ్ము.
పై ఏడు మర్యాదలలో ఏ ఒక్కదానిని భంగపరచేందుకు ప్రలోభాలు ఎదురయిన పరీక్షా సమయాలలో ఎవరు భగవంతుని మరువడో అతడే నిజమైన వీరుడు. అట్టి వీరుని మనుస్మృతి కర్త జితేంద్రియుడని చెప్పాడు.
శ్రుత్వా స్పృష్ట్వా చ దృష్ట్యా చ భుక్త్వా ఘ్రాత్వా చ యో నరః
న హృష్యతి గ్లాయతి వా స విజ్ఞేయో జితేంద్రియః॥ మ.స్మృ 2-98॥
‘‘విషయాలను చూచి, విని, స్పృశించి, భుజించి, ఆఘ్రాణించి రాగ విరాగాలను పొందనివాడు జితేంద్రియుడు.’’ అతడే వీరుడు. అట్టివాడే జ్ఞానమార్గంలో నడిచే స్థిరమైన స్తంభం వంటివాడు.
***
271. ముక్తికి అధికారి ఎవరు?
నృచక్షసో అనిమిషంతో అర్హణా బృహద్దేవాసో అమృతత్వమానశుః
జ్యోతీరథా అహిమాయా అనాగసో దివో వర్ష్మాణ్యం వసతే స్వస్తయే॥ ॥ ఋ.10-63-4॥
భావం:- జ్ఞానరథారూఢుడై కర్మలను జ్ఞాన పూర్వకంగా చేసేవాడు, పాపరహితుడు, - ప్రపంచ హితంకోసం తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినియోగించేవాడు, ముక్తికొఱకు తగిన సాధనోపాయాలను ఆచరించేవాడు, జగద్గురువై ప్రజలను జ్ఞానమార్గంలో నడిపించేవాడు. నిష్కామకర్మయోగి అయిన విద్వాంసుడు మోక్షస్థితిని పొందుతాడు.
వివరణ:- ‘పునరపి జననం పునరపి మరణమ్’= తిరిగి తిరిగి పుట్టడం తిరిగి తిరిగి మరణించడం అనే జన్మమరణ చక్రమే సంసారం. ఈ సంసారంనుండి విడివడి అఖండ బ్రహ్మానంద స్థితిని పొందడమే మోక్షం. ఈ మోక్షస్థితినే వేదం పలుచోట్ల అమృతత్వంగా వ్యవహరించింది. శాస్త్రగ్రంథాలలో ఈ అమృతత్వస్థితికే పరమపురుషార్థం- అత్యంత పురుషార్థం. కైవల్యం, అపవర్గం, మోక్షం మొదలైన ఎన్నో పేర్లు కనబడతాయి. ‘దుఃఖం నుండి నేను విముక్తి పొందరాదు’ అని తలంచేవాడు లోకంలో ఎవడూ ఉండడు. కాని ఆ విధంగా ఎవరో కొద్దిమందియే దుఃఖంనుండి విముక్తి పొందుతారు. ఆ విధంగా దుఃఖ విముక్తులై ముక్తస్థితిని పొందేందుకు ఏ లక్షణాలు కలిగియుండాలో ఈ మంత్రం వివరిస్తూంది.

- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు