స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆ విశే్వభి సరథం యాహి దేవైః’ ‘‘ఆనంద నాయక సాధనాలతో ప్రపూర్ణుడవై దివ్యగుణ సహితుడవై సర్వత్ర వ్యాపించిన నీవు మాకు సన్నిహితుడవగుదువుగాక’’! అట్టి ప్రార్థన ఎందుకంటే-
‘యస్య దేవైరాసదో బర్హిరగ్నే- హాన్యస్మై సుదినా భవంతి’(ఋ.7-11-2) ‘‘ఎవని హృదయంలో దివ్యగుణ సంపన్నుడైన భగవానుడు సదా విరాజమానుడై యుంటాడో అట్టివానికి దినాలన్ని శుభదినాలే’’కాబట్టి భగవత్సాంగత్యం సిద్ధించిన వానిక దుఃఖం, దారిద్య్రం, అశక్తత మొదలైన దుర్గుణాలన్నీ నశించిపోతాయి. సుఖం, సమృద్ధి, ఐశ్వర్యం, శక్తి మొదలైన సర్వసంపద్వైభవం ప్రాప్తమవుతుంది. ఇవన్నీ సిద్ధించడం దైవకృప లేనిదే అసంభవం. ‘న ఋతే త్వదమృతా మాదయంతే’ ‘‘నీవులేక ముక్తానందం లభించదు’’. ఇక్కడ చెప్పబడ్డ ముక్తానందం (అమృతానందం) లౌకికానందానుభూతులకు ఉప లక్షకమే. ఆ సర్వేశ్వరుడే ఆనందధామం. అందుకే ‘త్వే విశే్వ అమృతా మాదయంతే’(ఋ.1-59-1) ‘‘అందరు నీనుండియే ముక్తానందాన్ని పొందుతున్నారు’’అని ఋగ్వేద ప్రశంసను అందుకొని శుక్లయజుర్వేదం ‘యత్రదేవా అమృతమానశానాః’ (శు.య.వే.32-10) ‘‘్భగవానుని సన్నిధిలోనే సర్వులు మోక్షానందాన్ని పొందుతున్నారు’’అని మహాదేవుని మోక్షప్రదాతృత్వాన్ని కీర్తించింది. ముండకోపనిషత్తు మరొక అడుగుముందుకువేసి ‘తమేవైకం జానథ ఆత్మానమన్యా వాచో విముంచథ అమృత స్యైషసేతుః’ (ముండకం. 2-2-5) ‘‘సర్వవ్యాపకుడైన పరమాత్మ నొక్కని తెలుసుకో. ఇక అన్యవిషయాలను విడిచిపెట్టు. ఆయనే మోక్షప్రదాత కాగలడు’’అని మానవులకు మోక్షోపాయాన్ని ప్రబోధించింది. ** - ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512