స్వాధ్యాయ సందోహం
స్వాధ్యాయ సందోహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముక్తి నుండి పునరాగమనం
యే యజ్ఞేన దక్షిణయా సమక్తా ఇంద్రస్య సఖ్యమమృతత్వ మానశ
తేభ్యో భద్రమంగిరసో వో అస్తు ప్రతి గృభ్ణీత మానవం సుమేధసః॥ 1॥
య ఉదాజన్ పితరో గోమయం వస్వృతేనాభిందన్ పరివత్సరే బలమ్
దీర్ఘాయుత్వమంగిరసో వో అస్తు ప్రతి గృభ్ణీత మానవం సుమేధసః॥ 2॥
య ఋతేన సూర్యమారోహయన్ దివ్యప్రథయన్ పృథివీం మారతం వి
సుప్రజాస్త్వమంగిరసో వో అస్తు ప్రతి గృభ్ణీత మానవం సుమేధసః ॥
అయం నాభా వదతి వల్గు వో గృహే దేవపుత్రా ఋషయస్తచ్ఛృణోతన
సుబ్రహ్మణ్యమంగిరసో వో అస్తు ప్రతిగృభ్ణీత మానవం సుమేధసః॥ 4॥
(ఋ.10-62-1,2,3,4)
భావం:- 1. యజ్ఞమూ, దానమూ, నిష్కామ కర్మపుణ్యంచేత మోక్షస్థితిని పొందిన బుద్ధివైభవం గల అంగిరసులారా! మానవ శరీరాన్ని మీరు మరల పొందండి. అట్టి మీకు శుభమగుగాక!
2. వేదవేత్తలయిన ఏ మహావిద్వాంసులు దివ్యవాణీ వైభవాన్ని పొంది భౌతికమైన సంపదను తిరస్కరించారో ప్రకృతి ధర్మాచరణ ద్వారా (ఋతం) మానవ దేహాన్ని బలంగా ఆవరించియుండే అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసికొన్న సుజ్ఞానంగల అంగిరసులారా! మానవ శరీరాన్ని తిరిగి పొందండి. అట్టి మీకు చిరాయువు కలుగునుగాక!
3. సృష్ట్ధిర్మాచరణ (ఋతం)ద్వారా పరమాత్ముని హృదయాకాశంలో ప్రతిష్ఠించుకొని వేదాలను ప్రచారంచేసియున్న అట్టి పుణ్యమూర్తులయిన అంగిరస మహాపురుషులారా! మానవ శరీరాన్ని మరల పొందండి. మీకు ఉత్తమ సంతానం, ఉత్తమ శిష్యపరంపర కలుగును గాక!
4. సర్వలోక బంధువులైన ఈ జ్ఞానులు మీమీ అంతరంగాలలో మనోహరమైన ఉపదేశం చేస్తారు. పరమాత్మ తనయులైన ఋషులారా! అంగిరసులారా! మానవ శరీరాన్ని తిరిగి పొందండి. మీకు సంపూర్ణ వేదజ్ఞానం ప్రాప్తమగుగాక!
వివరణ:- ఇక్కడగల నాలుగు మంత్రాలలో ‘ప్రతి గృభ్ణీణ మానవం సుమేధసః’అన్న వాక్యం చివరగా కనబడుతుంది. దీనిలోని ప్రతి ఉపసర్గతు అర్థం ‘తిరిగి’అని. లౌకిక సాహిత్యంలో దీనికిదే అర్థం. ఇప్పుడు ప్రతి గృభ్ణీత అన్న పదానికి ‘తిరిగి రా’ అని అర్థం.
- ఇంకాఉంది