స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లే సోదరియు సోదరీసోదరులను ద్వేషింపరాదు. మీరందరు ఒకే ఆశయం కలవారై శుభవచనాలతో పరస్పరం సంభాషించుకోండి.
వివరణ:- ఈ మంత్రంలో కుటుంబంలోని మనుష్యులు, దేశంలోని ప్రజలు ఏవిధంగా కలిసిమెలసి జీవించాలో వివరించబడింది. కుటుంబంలో నయినా, దేశంలోనైనా పరస్పరం ప్రీతిభావం కలిగియుండాలి. పరస్పరం వైరభావం విడిచి మెలగాలి. అందుకు అందరిలో హృదయాలలో మరియు మనస్సులలో సమత, మమతాభావాలుండాలి. ఆవు తన దూడను ప్రేమిస్తుంది. కాని దానినుండి ఆవు ఏదైనా ప్రయోజనమాశిస్తుందా? అట్లే జనుల మధ్య సత్యమైన, అవాజ్యమైన ప్రేమ ఉండాలి.
దురదృష్టవశాత్తు మానవులలో అట్టి అవ్యాజమైన ప్రేమ ఉండదు. ముద్దుమురిపాలతో తమ బిడ్డలను పెంచిన తల్లిదండ్రులు ఏదో ఒకనాడు తమకు వారు తోడుపడతారని, తోడుపడాలని ఆశిస్తారు. ఇలా ఒక ఆశమీద పెరిగిన ప్రేమ స్వార్థతను తనలో నింపుకొని దూషితమవుతుంది. అందుకే వేదం మంత్రంలో కుటుంబంలో మరియు సమాజంలోని మనుషుల మధ్య ప్రేమను వర్ణిస్తూ ‘వత్సం జాతమివ అఘ్న్యా’ ‘ఆవు తనకు పుట్టిన దూడను ప్రేమించినట్లుగా’అన్న ఉపమానాన్ని చెప్పింది. అందుకే వేదం జనుల మధ్య అవ్యాజమైన ప్రేమ (కారణం లేని ప్రేమ) మాత్రమే ఉండాలని ఆ ఉపమానంద్వారా సూచించింది. అలాకాక ఏదో ఒక కారణంతోనే ప్రేమ జనిస్తే అది ఆ కారణం తొలగిపోగానే ప్రేమ కూడ తొలగిపోతుందని వేదం పరోక్షంగా సూచించింది.
తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవమన్న ఒక సామెత ఉంది. అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఇలా కుటుంబంలోని సభ్యులను అవ్యాజంగా ప్రేమించలేనివాడు సమాజంలోని మనుజులను ప్రేమించగలడా? అందుకే వేదం బహుశా కుటుంబ సభ్యుల ఎడల ప్రేమ సంఘం మీద ప్రేమకు ప్రథమ సోపానమని భావించిందేమో. అందుకే మూడు మంత్రాలలో కుటుంబ సభ్యుల మీద ప్రేమాభిమానాలెలా చూపాలో వివరణాత్మకంగా ప్రబోధించింది. ఆ విధంగా కుటుంబంపై ప్రేమచూపడాన్ని నేర్చుకొన్న వ్యక్తి సమాజంలో రాణించగలడని వేదోద్దేశ్యం కావచ్చు. దీనిని మనమంతా అందిపుచ్చుకుందాం. కుటుంబ సభ్యులను ప్రేమించడం ద్వారా సమాజాన్ని ప్రేమిద్దాం. భూలోకంలోనే ప్రేమలోకాన్ని స్థాపిద్దాం.
**
కుటుంబ సమైక్యతకు సాధనం
యేన దేవా న వియంతి నో చ విద్విషతే మిథః
తత్కృణ్మో బ్రహ్మ వో గృహే సంజ్ఞానం పురుషేభ్యః అథ.వే.3-30-4॥
భావం:- విద్వాంసులు పరస్పరం విభేదించి విడిపోవక, ద్వేషింపక పరస్పర ప్రేమభావంతో ఉంటున్న జ్ఞానాన్ని మీ హృదయాలలోనికి మరియు మీ ముంగిటకు తెచ్చి ఉంచుతున్నాం.
వివరణ:- జ్ఞానులు ఏ జ్ఞానం చేత పరస్పరం విభేదించక సంఘీభావంతో ఉంటున్నారో మరియు పరస్పరం ద్వేషించుకొనక ప్రేమభావంతో ఉంటున్నారో ఆ జ్ఞానం సృష్ట్యారంభంలోనే ‘యేన దేవా వియంతి.... మిథః’అని భగవంతుని చేత తెలుపబడింది. - ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512