స్వాధ్యాయ సందోహం
స్వాధ్యాయ సందోహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
నా రుూ సాధన సంపత్తి ద్వారా శత్రువుల బాహువులను ఖండిస్తున్నాను.
వివరణ:దేశాధిపతి లక్షణాలేవిధంగా వుండాలో ఈ మంత్రంలో వివరించబడ్డాయి. బలం ముఖ్యంగా రెండు విధాలు. బ్రహ్మబలం మరియు క్షాత్రబలం అని. ఈ రెండు బలాల చేత తాను సమృద్ధం కావాలనే ఆకాంక్షను ప్రకటిస్తున్న ఒక దేశాధ్యక్షుని ఆకాంక్ష ద్వారా ఆ రెండు బలాల ఆవశ్యకతను వేదం ఇలా ప్రకటించింది. ‘సంశితం మ ఇదం బ్రహ్మ సంశితం వీర్యం బలం’- ‘‘నా బహ్మ బలం తీవ్రతరమగుగాక! నా వీర్యం మరియు భుజబలం తీవ్రతరమగుగాక!’’ - బ్రహ్మబలమంటే జ్ఞానబలం. వీర్యబలమంటే శత్రువులను ఓడించి వారు పారిపోవడమో లేదా వారిని బంధించడమో చేయగల శక్తి. శత్రువుల చేత చిక్కినా తనను తాను రక్షించుకొనగల శక్తి. ఈ వీర్యం మరియు బలం క్షాత్రశక్తిలో రెండు రకాలు. ఈ బ్రహ్మబలం మరియు క్షాత్రబలం ఈ రెండు ఎక్కడ సమానంగా ఉంటాయో అంటే ఏ రాజునందు ఉంటాయో వాని ద్వారా శాంతి పరిపూర్ణంగా పరిఢవిల్లుతుంది. ‘య బ్రహ్మ చ క్షత్రం చ సమ్యంచౌ చరతః సహా’ అని శుక్ల యజుర్వేదం ఈ అథర్వణవేద వచనాన్ని గట్టిగా సమర్థించింది.
క్షాత్రశక్తి క్షత్రియుడైన రాజుకు జన్మతః సిద్ధించవచ్చు. తదుపరి ధనుర్విద్యాది యుద్ధ విద్యాభ్యాసం వలన అది ద్విగుణీకృతం కావచ్చును. మరి బ్రహ్మ తేజస్సు సిద్ధించేదెలా? అతడు కూడా ధనుర్విద్యాది యుద్ధ విద్యలతో బాటు వేదాది వైదికవిద్యలు అభ్యాసం చేయడంవలన మరియు ఆ విద్యలను దేశంలో వృద్ధి చేయడంవలన, బ్రహ్మధర్మాలయిన దాన, తపో, క్షమా అహింసా, సత్య, శౌచాది ధర్మాలను చిత్తశుద్ధితో ఆచరించడం వలన క్షత్రియుడికి బ్రహ్మతేజస్సు సిద్ధిస్తుంది. వేదమీవిషయానే్న ప్రతిపాదిస్తూ సమసా మేషాం రాష్ట్రం స్వామి సమోజో వీర్యం బలమ్- ‘‘క్షాత్ర- బ్రహ్మశక్తులను ఒక త్రాటిమీదకు తెచ్చి (సమన్వయపరిచి) ఈ దేశాన్ని నేను నడిపిస్తున్నాను అని దేశ పాలకుని ఆత్మవచనంగా స్పష్టపరచింది. ఇలా దేశాన్ని ఏకత్రాటిమీద నడిపించేందుకు కేవలం తనకే కాదు దేశ ప్రజలముందు సాధించదగిన ఒక ప్రధానలక్ష్యాన్ని ఉంచాలి. ఆ లక్ష్య సాధనలో తనతోబాటు దేశ ప్రజలు సహితం అదే లక్ష్య సాధనకంకితమవుతూ సహకారమందిస్తారు. దూరదృష్టి గల రాజు చేసే మొదటి పని ఇదే. ఈ విషయానే్న వేల యేండ్లకు పూర్వమే ఏషాం రాష్ట్రం సువీరం వర్థయామి - ‘ఈ దేశాన్ని సువీరంగా అనగా అజేయంగా చేస్తాను’ అథర్వణ వేదం రాజు ప్రతిజ్ఞా వచనంగా నిర్దేశించింది. దేశాన్ని సువీరంగా ఉంచడం ప్రజా సహకారం లేకుండా ఏ రాజుకైనా సాధ్యమా? అందుకే దూరదర్శి అయిన రాజు రాష్ట్రాన్ని సువీరంగా చేసే తన లక్ష్యమే ‘యథా రాజా తథా ప్రజాః’ అన్న రీతిగా ప్రజల లక్ష్యం కూడా కావాలి అని కోరుకోవాలి.
ఈ రీతిగా ప్రజల ముందు సాధనా రూపమైన ఏకైక లక్ష్యాన్ని నిర్దేశించి దేశంలో క్షాత్ర - బ్రాహ్మీ శక్తులను పుష్కలంగా పూరించి దేశాన్ని అజేయంగా నిర్మాణం చేసే రాజు ఆత్మవిశ్వాసమెంత మహోన్నతంగా వుంటుందో అథర్వణ వేదమిలా ప్రకటించింది.
- ఇంకా ఉంది