స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీక్ష్ణీయాంశః పరశోరగ్నేస్తీక్ష్ణత్రరా ఉత
ఇంద్రస్య వజ్రాత్ తీక్ష్ణీయాంసో యేషామస్మి పురోహితః
ఏ ప్రజలకు నేను నాయకుడనో ఆ ప్రజలు మరియు ఆయుధాలు అగ్నికంటే అత్యధికమైన తీక్షణమైన మరియు ఇంద్రుని వజ్రాయుధం కంటే శక్తివంతమైనవారు. వేదపదేశానుసారం ప్రజలకు ఏకైక లక్ష్య సాధనకోసం నడిపించి దేశాన్ని అజేయంగా తీర్చిదిద్దగల ప్రభువులకు మనమెప్పుడు స్వాగతిస్తామో!
అగ్నిహోత్రం
అభిభూర్యజ్ఞో అభిభూరగ్నిరభిభూః సామో అభిభూరింద్రః
అభ్యహం విశ్వాః పృతనా యథాసానే్యవా విధేమాగ్ని హోత్రా ఇదం హవిః॥ ॥
భావం:- యజ్ఞం, అగ్ని, సోమం, ఇంద్రుడు వీరందరిని అణచివేయువారు మరియు సర్వత్ర వ్యాపించియుండేవారు. నేను సమస్త సైన్యాలను, ఉపద్రవాలను అణచివేసే రీతిగా హవిస్సును సిద్ధం చేస్తాను.
వివరణ:- యజ్ఞానికి అగ్ని, సోమం, ఇంద్ర (ఆత్మ) మరియు యజ్ఞోపయోగి అయిన ద్రవ్యాలు అవసరం. ఈ ద్రవ్యాలన్ని సమంగా సమకూడితే యజ్ఞం తప్పక ‘అభిభూః’ అన్నింటిని అణచివేసేది లేదా వారు సర్వత్ర వ్యాపించి యుండేవారుగా సుసంపన్నమవుతుంది. దేవతలు యజ్ఞంచేసి రాక్షసులను పరాజితులను చేసినట్లుగా శతపథ బ్రాహ్మణంలో ఒక ఐతిహ్యముంది. కాబట్టి యజ్ఞం తప్పక శత్రు సంహారకారిణియే. ఇక అగ్ని విషయానికి వస్తే అది యజ్ఞాగ్ని అయినా భౌతికాగ్ని అయినా జ్ఞానాగ్ని అయినా అది సర్వాన్ని దహించగలదన్న విషయమందరికి అనుభవంలోనిదే. సోమానికి కూడ అగ్నికుండే శక్తియే ఉంది. దీనికి ప్రమాణం ఋగ్వేదం నవమ మండలంలో కనబడుతుంది. చూడండి.
‘అస్య వ్రతాని నా ధృషే పవమానస్య దూఢ్యా రుజ యస్త్వా పృతన్యతి’ ॥
‘‘పవిత్రమైన ఈ సోమరసానికున్న శక్తిని ఏ దుర్బుద్ధికూడ అణచిపెట్టలేదు. అందుచేత ఓ సోమం కలవాడా! నీకు ప్రమాదాన్ని తెచ్చే వాడిని సంహరించు’’. కాబట్టి సోమరసం కూడ అందరిని అణచివేయగలది మరియు సర్వత్ర వ్యాపించి యుండేది. ఈ కారణం చేతనే సోమపానం చేసే ఇంద్రుడు కూడ ‘అభిభూః’అందరిని అణచివేయగలవాడు. సర్వత్ర వ్యాపించినవాడు. ఋగ్వేదంలో ఈ క్రింది ప్రమాణాన్ని చూడండి.
అభి భువే- భిభంగాయ వన్వతే- షాళ్హాయ సహమానాయ వేధసే
తువిగ్రయే వహ్నయే దుష్టరీతవే సత్రాసాహే సమ ఇంద్రాయ వోచత॥ (ఋ.2-21-2)
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512