స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
జాగ్రత్ - స్వప్న- సుషుప్తి అని మానవుడికి మూడు దశలున్నాయి. చక్షురాది జ్ఞానేంద్రియాలు తమ పనులు ఉత్సాహంగా నిర్వహిస్తున్న సమయం ‘జాగ్రద్దశ’ సాధారణంగా ఆ దశలో జీవులు బహిర్ముఖంగా ఉంటాయి. అప్పుడు ఆ జీవికి బాహ్యవిషయాల పరిజ్ఞానం కలుగుతుంది. అలాకాక చక్షురాది బాహేంద్రియాలు తమ విధులను విడిచి కేవలమొక్క మనస్సు మాత్రమే పనిచేస్తూ ఉంటే ఆ దశ ‘స్వప్న’దశ అనబడుతుంది. ఆ దశలో అద్భుతమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అలాకాక మనఃఇంద్రియం మరియు జ్ఞానేంద్రియాలు తమ పనులను విరమిస్తే ఆ దశను ‘సుషుప్తి’అని అంటారు. ఆ దశలో ఆత్మకు బాహ్య విషయసంబంధం పూర్తిగా తెగిపోయి పరమాత్మతో సంబంధమేర్పడుతుంది. ఆ దశలో జీవికి స్వప్న ప్రసక్తియే సంభవించదు.
కాని ఇంద్రియాలతో సంబంధం లేని మనస్సు చేసే కార్యకలాపమే స్వప్నం. అది దుస్స్వప్నం కావచ్చు. సుస్వప్నం కావచ్చు. ప్రస్తుత మంత్రం ఈ స్వప్న ఫలితాలనే వివరిస్తూ ‘యత్స్వప్నే అన్నమశ్నామి’ ఏ అన్నం కలలో తింటున్నానో అంటూ ప్రారంభించింది. అలా కనబడినవి ‘న ప్రాతరధిగమ్యతే’ ‘‘అవి ఉదయం కానరావు’’అని తేల్చి చెప్పివేసింది వేదం. ఈ వేద వచనమే ‘కలలోనిది ఇలలో ఉండదు’అన్న తెలుగు నుడికారంగా మారిపోయింది. మరి ఆ కల మంచిదయితే మంచిదే. కాని చెడుకల అయితే...? ఏదయినా అవి ‘సర్వం తదస్తు మే శివమ్’ ‘‘అన్న మాకు శుభకరమే కావాలి’’అని భావించమంటూంది వేదం.
కాని మనిషి నిజంగా అనుకోగలడా? మంచి కలను స్మరించి స్మరించి సంతోషంగా అందరికి చెప్పుకొన్న విధంగా చెడుకలను స్మరించి అలా ప్రవర్తించగలడా? ఎంతో తలచుకొని తలచుకొని బాధపడతాడు. అలా బాధపడవలదని ‘బ్రహ్మాహమంతరం కృణ్వే పరా స్వప్నముఖాః శుచః’ ‘‘నేను దైవాన్ని స్మరించి దుఃస్వప్న దుఃఖంనుండి విముక్తుడనవుతాను’’అని దృఢ నిశ్చయం చేసుకోమంటూంది వేదం.
- ఇంకాఉంది