స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసు నిలిచిన చోటే నీ నివాసం
యత్ర క్వ చ తే మనో దక్షం దధస ఉత్తరమ్‌ తత్రా సదః కృణవసే॥ ఋ.6-16-17॥
భావం:- సమర్థవంతమైన ఇంద్రియాల దృష్ట్యా శ్రేష్ఠమైన నీ మనస్సును ఎప్పుడైనా ఎక్కడైనా లగ్నంచేస్తే అక్కడే అప్పుడే నీవు నీ నివాసాన్ని ఏర్పరచుకొంటావు.
వివరణ:- ఈ మంత్రంలో మనస్సును లగ్నం చేయడంవలన కలిగే ప్రయోజనం వివరింపబడుతూంది. దీనివలన మనస్సు మహిమ ఎంతటిదో బోధపడుతూంది. మనస్సు చాలా చంచలం. అది ఎక్కడా ఒకచోట స్థిరంగా ఉండదు. ఈ విషయాన్ని తెలిపే మంత్రాలు ఋగ్వేదంలో (10-58) ఎన్నో ఉన్నాయి.
1. యత్తే యమం వైవస్వతం మనో....
2. యత్తే దివం యత్పృథివీం మనో...
3. యత్తే భూమిం చతుర్భృష్టిం మనో...
4. యత్తే చితస్రః ప్రదిశో మనో...
5. యత్తే సముద్ర మర్ణవం మనో...
6. యత్తే మరీచీః ప్రవృతో మనో...
7. యత్తే అపో యదోషధీర్మనో...
8. యత్తే సూర్యం యుదుషనం మనో...
9. యత్తే పర్వతాన్ బృహతో మనో...
10. యత్తే విశ్వమిదం జగన్మనో...
11. యత్తే భూతం చ భవ్యంచ మనో జగామదూరకమ్‌
తత్త ఆ వర్తయామసీహ క్షయాయ జీవసే॥
నీ మనస్సు యముడు, ద్యావాపృథివీ, అంతరిక్షం నాలుగుదిక్కులు, సముద్రం. దూరంగా ఉండే సూర్యకిరణాలు, జలం, ఓషధులు, సూర్యుడు, ఉషాదేవి, మహాగిరులు ఇలా సంపూర్ణ జగత్తునకావలకు, భూత-్భవిష్యత్ కాలాల అవతలకు చాలా దూరంవెళ్లి తిరిగి నీవద్దకు వస్తుంది. చిత్రమేమంటే మనస్సు తానెక్కడికి పోతుందో అక్కడే అది నివాసమేర్పరచుకొంటుంది. మనస్సు మొదటి స్వభావం ఎప్పుడూ ఎక్కడికో అక్కడకు పోవడమే. ఈ లోకంలోనే కాదు. ఈలోకానికావలకు కూడ వెళ్లిపోతుంది. ఒకప్పుడు గతించిన వాళ్లకోసం చింతిస్తుంది. మరొకప్పుడు భవిష్యత్తుమీద ఎన్నో ఆశలు పెంచుకొంటుంది. అది చాలా చాలా దూరంపోతుంది. అయితే ఎప్పుడుపోతుంది? అది తెలియదు. జాగ్రత్ దశలోనూ పోతుంది. స్వప్న దశలోనూ పోతుంది. చిత్రమైన చంచలమైన మనోవ్యాపారాన్ని గురించి యజుర్వేదమీవిధంగా వివరిస్తూంది.
- ఇంకాఉంది