స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేత చిక్కిన శత్రువులను వధించు
య ఉగ్ర ఇవ శర్యహా తిగ్మశృంగో న వంసగః అగ్నే పరో రురోజిథ॥॥
భావం:- ఓ మహానాయకా! సూర్యునివలె ఎవడు పరాక్రమశాలి అయిన వీరునితో సమానంగా బాణాలకు చిక్కినవానిని విడువక వధించి పొందవలసిన విజయాన్ని పొందుతాడో అతడు శత్రువుల నగరాలను ధ్వంసం చేస్తాడు లేదా వారి నగరాలను ముందుగానే ఆక్రమిస్తాడు.
వివరణ:- ఈ మంత్రం లౌకిక యుద్ధనీతిని గురించి వివరిస్తూంది. జీవితంలో సాఫల్యసిద్ధి కలగాలంటే ఒక్కోసారి కఠినమైన ఎదురుదెబ్బలు తినవలసి యుంటుంది. అప్పుడప్పుడు కోమలంగా ప్రవర్తింపవలసి యుంటుంది. సమయానుగుణంగా ఎవడు ప్రవర్తిస్తూ ఉంటాడో అతడే జీవితంలో సాఫల్యాన్ని పొందగలడు. వేద మీ రెండు విధానాలను అంగీకరిస్తూ ‘య ఉగ్ర ఇవ శర్యహా’ ‘‘పరాక్రమశాలియైన వీరునితో సమానంగా బాణప్రహారాలకు చిక్కిన శత్రువును సంహరిస్తాడు’’అని హింసాకృత్యమైన హింసనే ప్రబోధించింది.
మితిమీరిన దయతో శత్రువును విడిచిపెడితే అతడు ప్రబలిపోయి చివరకు తనకే ముప్పు తెచ్చిపెడతాడు. కాబట్టి చేత చిక్కిన శత్రువును వధించమనియే వేదం అనుమతించింది. దానికి ఉదాహరణగా ‘తిగ్మ శృంగో న’ సూర్యుని వలె ప్రవర్తించుమని కూడ హితవుచెప్పింది. మేఘాలు ఆడంబరంగా వచ్చి నింగినంతా క్రమ్ముతూ ఉంటే మహోష్ణకిరణాలుగల సూర్యుడు వాటిని చెల్లాచెదరు చేయక మిన్నకుంటాడా? అట్లే పరాక్రమశాలియయిన వీరుడు చేజిక్కిన శత్రువును విడువక వధించుమనియే వేదం ఆదేశించింది.
మంత్రంలో రెండవ వాక్యమైన ‘పురోరురోజిథ’ శత్రునగరాలను ధ్వంసం చేస్తాడు లేదా ముందుగానే ఆక్రమిస్తాడు అనే వాక్యంలో ఒక గొప్ప ధ్వని ఉంది. విజయ యాత్రకు వెళ్లిన వీరుడికి ఎప్పటికప్పుడు ఆత్మరక్షణ సందిగ్ధంగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు శత్రువు బలపడేవరకు వేచి యుండరాదు. ముందే శత్రు నగరాలను ఆక్రమించడమో లేదా నగరాలను ధ్వంసం చేయడమో చేయాలి. అప్పుడే శత్రువు పరాజితుడు కావడమో- పరమపదించడమో సంభవమవుతుంది. ఈ మహార్థాన్ని గర్భీకరించి వేదం ‘పురో రురోజిథ’అన్న వాక్యాన్ని మంత్ర నిష్ఠం చేసింది.
‘అహింసా పరమో ధర్మః’ ‘అహింసయే ముఖ్యధర్మ’’మని కదా వేదప్రధానోపదేశం. మరి ఆ వేదమే ఈవిధంగా హింసను ప్రబోధిస్తూ ఉన్నదేమిటి? అన్న సందేహం ఈ సందర్భంలో ఎవరికయినా కలగడం చాల సహజం. వేదం అహింసను పరమ ధర్మంగా చెప్పినంత మాత్రాన సమయం సందర్భం లేకుండా అహింసను బోధించిందని భావించరాదు.
లౌకికంగా అహింస ఎంత శాంతిదాయకమో అది శాంతికి సమర్థం కాని సందర్భంలో హింసయే శాంతిదాయకమని వేదంయొక్క పరమోద్దేశ్యమని గ్రహించాలి.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512