స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
చేతులెత్తి నమస్కరించు
వీతీ యో దేవం మర్తో దువస్యేదగ్ని మీళీతాధ్వరే హవిష్మాన్‌
హోతారం సత్యయజం రోదస్యోరుత్తానహస్తో నమసా వివాసేత్‌॥

భావం:- ఏ మనిషి భక్త్భివంతో పరమాత్మను సేవిస్తాడో, శ్రద్ధాసంపన్నుడై యజ్ఞార్థమైన ద్రవ్యాలను సమకూర్చుకొని సర్వేశ్వరుని పూజిస్తాడో అతడు భూమ్యాకాశాలను సమంగా కలిపే విశే్వశ్వరునకు చేతులెత్తి నమస్కరించి ఆరాధించుగాక!
వివరణ:- భగవదారాధన ప్రేమరహితంగా, మలిన హృదయాలతో చేయరాదు. ఋగ్వేద మీవిషయంలో ‘ప్ర దేవం దేవవీతయే భరతా వసువిత్తమమ్’ (ఋ.6-16-41) ‘‘సర్వాధికలక్ష్మీ సంపన్నుడైన భగవంతుని చేరుటకొఱకై సేవచేయు’’అని ఆదేశించింది. భగవంతుని పూజించి ధనాన్ని అర్థించకు. ధనంగల ధనేశ్వరుడినే అర్థించు. ఆయననే పూజించు. భగవానుడే నీవాడయితే ఆయన సమస్తమూ నీదేగదా! అందుచేతనే విశే్వశ్వరునే అర్థించు.
యజ్ఞం కూడ భగవదారాధనకు అత్యుత్తమ సాధనం. దాని ద్వారా భగవంతునకు ప్రతిరూపమైన అగ్ని ఆరాధింపబడతాడు. ఋగ్వేదమీ అగ్ని ఆరాధననే ‘అగ్నిమీళే పురోహితమ్’(ఋ.1-1-1) అన్న మంత్రంలో ఆరంభించింది. చాలా సందర్భాలలో వేదం అగ్ని ఆరాధనా విధానాన్ని ఉటంకించింది. చూడండి.
‘ఆ తే అగ్న ఋచా హవిర్హృదా తష్టం భరామసి’ (ఋ.6-16-47) ‘‘ఓ అగ్రగణ్య భగవాన్! మంత్రాల ద్వారా హృదయంతో సిద్ధంచేయబడిన హవిస్సు నీకు కానుకగా సమర్పింపబడుతున్నది’’ హృదయంతో సిద్ధం చేయబడిన హవిస్సు శ్రద్ధకు మరియు భక్తికి చిహ్నం. ఈ భావం చేతనే భగవదారాధన చేయుమని ప్రస్తుత మంత్రం కూడ ‘అగ్నిమీళీతాధ్వరే హవిష్మాన్’ ‘‘శ్రద్ధ్భాక్తి సంపన్నుడవై యజ్ఞంలో భగవదారాధన చేయు’’మని ఆదేశిస్తూంది.
గురువు, రాజు, వైద్యుడు, విద్వాంసుడు, సన్న్యాసి వీరివద్దకు రిక్తహస్తాలతో వెళ్లరాదని శాస్త్ర నియమం. మరి భగవంతుని వద్దకు పోయినపుడు ఏమితీసుకొని వెళ్లాలి? నిజమే తీసుకుని వెళ్లాలి. మరి తీసుకొని వెళ్లేందుకు ఆయనవద్ద లేనిది ఏముంది? ఆయన మనకు ఈయనిది ఏముంది? అంతా-అన్నీ ఆ దైవమిచ్చిందే. అయితే మనవద్ద ఒకటి మాత్రముంది. అదే నమస్కారం. దానినే దైవానికి సమర్పించు ‘ఉత్తాన హస్తో నమసా వివాసేత్’ ‘‘చేతులు పైకెత్తి నమస్కారం చేత పూజించు’’ మని వేదం పూజావిధిని నిర్దేశిస్తూంది. శుక్లయజుర్వేదం కూడ ‘్భయిష్ఠాం తే నమ- ఉక్తిం విధేమ’ (శు.య.వే.40-16) ‘‘గొప్ప నమస్కార వచనంతో నిన్ను అర్చన చేస్తాం’’అనే వచనం ద్వారా ఋగ్వేద మంత్రాభిప్రాయానే్న పునరుక్తిగా చెప్పింది. **

- ఇంకాఉంది