స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో పాపనాశనమంటే ఏమిటి? దీనుల, దరిద్రుల దుఃఖాన్ని నివారించడమే. సమాజంలో తరతరాలుగా స్థిరపడిపోయిన హెచ్చుతగ్గుల తారతమ్యాల కారణంగా కొందరకు దుఃఖం కలుగుతూ ఉంది. సమాజగత నిషమస్థితులను సరిదిద్దటం సాధ్యపడుతుంది. ఈ విషయంలో వేదం ‘కరోయత్ర వరివో బాధితాయ జనాయ’ ‘‘బాధలకు గురిఅయిన జనులకు సేవచేయి’’అని సేవా విధిని ఆదేశిస్తూ ఉంది.చిత్రమేమంటే ఒకప్రక్క సమాజ బాధితులకు సేవచేయుమని చెబుతూనే వేదం వారి ఆ బాధలకు కారణం ఒక విధంగా వారేనని, వారిలో ఉండే లోపాలను ఎత్తిచూపుతూ ‘యత్ర తనే్వ గృణానః దివే బాధితాయ జనాయ’అని పేర్కొంది. ఈ వాక్యంలో ‘దివే’అన్నమాట చాల ముఖ్యమైనది. నిద్రాలాలసత మరియు ఏమరుపాటుతనం గలవారని దాని అర్థం. ఈ రెండు మనిషిలోని పెద్ద దుర్గుణాలు. నిద్రాలాలసత్వమంటె సుఖం మీద అత్యంతాసక్తి. ఏమరుపాటుతనమంటే అజాగ్రత్తతనం. ఈ రెండు దుర్గుణాలుకల మనిషేకాదు జాతి యావత్తూ పతనమైపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ లోపాల కారణంగానే మనిషి అయినా జాతి అయినా దీనస్థితికి చేరుకొంటుంది. ‘వరివః కరో’ ‘సేవచేయి’అన్న వేదవాక్కు అట్టి దీనులకు అవసరమైన దైనందిన అవసరాలను తీర్చి సేవచేయుమని కాదు.
ఆ సేవకు అంతమెక్కడ? మంత్రంలో ‘దివే’అన్న పదాన్ని చేర్చడంద్వారా దీనుల దీనత్వానికి కారణమైన సోమరితనం, అజాగ్రత్త స్వభావం మొదలైన దుర్గుణాలను తొలగించి వారు సోత్సాహులై స్వయంశక్తివంతులై జీవించేలా దోహదపడమనియే వేద ప్రధాన సేవాసందేశం.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512