స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాట ‘వరివస్యన్నుశనే కావ్యాయ’ ‘‘జ్ఞానులయిన వారిని కోరికోరి సేవచేయు’’ అను వేద వచనానికి ప్రతిబింబవాక్యమే.
వేదం మానవ సమాజం ఎడల చాల దయగలిగింది. అందుకే సేవ ఎలా చేయాలో కూడ ‘పరా... న పాతమ్’ ‘‘పూజ్యులైన తల్లిదండ్రులకు నూతన వస్త్రాలను- భోజనాన్ని - ధనాన్ని వానితోబాటు ఈయదగిన ద్రవ్యాలను- వస్తువులను సమర్పించు’’మని వివరించి చెప్పింది... పంచయజ్ఞాలలో పితృయజ్ఞమంటే యిదే. ఈ వేదోపదేశానే్న మనువు మనుస్మృతిలో దాదాపుగా యథాతథంగా చెప్పాడు. చూడండి.
అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవినః
చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోబలమ్ (మ.స్మృ.2-121)
‘‘పెద్దలు- జ్ఞానుల సేవ చేసే వారికి ఆయువు, విద్య, యశస్సు, బలం ఈ నాల్గు సిద్ధిస్తాయి.’’
నేటి యువతరం ఈ వేదోపదేశాన్ని పెడచెవిని పెడుతున్నదని చెప్పేందుకు సమాజంలో పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలే నిదర్శనం. అందులో వృద్ధాప్య బాధలతో మ్రగ్గుతున్న అసంఖ్యాక వృద్ధ మాతా- పితృసంఘాలే ప్రత్యక్ష సాక్ష్యం. వృద్ధాశ్రమాలలో వీరంతా మగ్గిపోయినంత కాలం మాది వేదభూమి అని చెప్పుకొనేందుకు ప్రతి భారతీయుడు సిగ్గుపడవలసినదే.
**
భగవంతుడెక్కడ?
యస్తా చకార స కుహ స్విదింద్రః కమా జనం చరతి కాసు విక్షు
కస్తే యజ్ఞో మనసే శం వరాయ కో అర్క ఇంద్ర కతమః స హోతా॥ ॥
భావం:- ఓ దైవమా! కనబడే ఈ లోకలోకాంతరాల నెవడు సృష్టించాడు? ఆ సృష్టించిన వాడెక్కడున్నాడు. అతడుఏ జనుల మధ్య తిరుగుతూ ఉంటాడు? ఏ మనుష్యుల వద్దకు పోతూ ఉంటాడు? నీ యజ్ఞాలలో అంటే పూజాసాధనాలలో ఏది శుభదాయకమైనది? నిన్ను తమవానిగా చేసుకొనేందుకు ఏ మంత్రముంది? ఆ విధంగా మంత్రానుష్ఠానం చేసినవాడెవడున్నాడు?
వివరణ:- భగవంతుని గురించి ఋగ్వేదం (ఋ.6-19-1)లో ‘సుకృతః కర్తృభిర్భూత్’ ‘‘స్వకీయ కర్తృత్వ శక్తులతో ఆతడు సుష్టు సృష్టినిర్మాణకర్త’’ అని మరియు లోక లోకాంతరాలను సృష్టించాడని చెప్పబడింది. ఆ కారణంచే ‘తము స్టుహి’ (అథ.వే.6-1-2) ‘‘ఆ దైవాన్ని స్తుతించు’’ అని అథర్వణవేదం శాసించింది. కంటికి ప్రత్యక్షంగా కనబడుతున్న సృష్టి రచనా నైపుణ్యాన్ని చూడగానే దీనికి తప్పక ఎవరో సృష్టికర్త ఉండాలని దృఢ నిశ్చయం కలుగుతుంది. కాని ఆ సృష్టికర్త కనబడటం లేదు కదా! అందుకే ఆయనను దర్శించాలనే తహతహ పెరుగుతూ ఉంటుంది. దానినే ఈ మంత్రం ‘యస్తా చకార స కుహ స్విదింద్రః’ ‘‘ఈ లోకాలను లోకాంతరాలను ఎవడు సృష్టించడు? అన్న ప్రశ్న ద్వారా ప్రకటించింది. ఆ తరువాత వెంటనే జనించే మరో ప్రశ్న ‘కమా జనం చరతి కాసు విక్షు?’ ‘‘అతడు ఏ జనుల మధ్య తిరుగుతూ ఉంటాడు? అతడు ఏ జనులవద్దకు వస్తూ ఉంటాడు? అని. ఈ ప్రవ్నలింతటితో ముగియలేదు. ఆ భగవంతుడు స్వయంగా తరచుగ ప్రియమార ఏ మనిషి వద్దకు ఆ చరతి= వస్తాడు? అన్నది మరో ప్రశ్న. ఇలా కనబడని దైవం గురించి ప్రశ్నలుదయించనిదెవరికి?
అఖిలాండ కోటి బ్రహ్మాండ సృష్టికారకుని దర్శించాలనే కోరిక కలిగినంతనే ఆయనను చూడాలనే వాంఛ తీవ్రతరం కాని దెవరికి? ఆయనతో మాటలాడాలని, ఆయనకిష్టమైనవేవో తెలుసుకొని చేయాలనే ఆతృత కలుగనిదెవరికి? ఈ అన్నింటికి ప్రతీకగా వేదం ‘కస్తే యజ్ఞో మనసే శమ్’ నీ యజ్ఞాలలో ఏది శాంతిదాయకం? అంటే సంపూర్ణ ఫలదాయకం? అని జిజ్ఞాసు హృదయాన్ని ఆవిష్కరించింది. కానరాకపోయినా తప్పక ఉన్నాడనే నిశ్చయ జ్ఞానం కలిగిన తరువాత ఆ దైవంతో సాన్నిధ్యాన్ని జిజ్ఞాసువు కోరుకోకుండ ఉంటాడా? దానికి ఉపాయమేది? ఎవరు చెబుతారు? అదేదో నీవే చెప్పు. ‘వరాయ కో అర్కః’ ‘‘నిన్ను తమ వారిగా చేసికొనే అది తీవ్రతరం కావడం సహజం.
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512