స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఇటువంటి ధ్యాననిష్ఠులకు ధ్యానంవలన కలిగే ప్రధాన ప్రయోజనమేమిటో ఋగ్వేదమంత్రం ‘ఉరు జ్యోతిర్వివిదుర్ద్ధ్యీనాః’ (ఋ.7-90-4) ధ్యానం ద్వారా గొప్ప జ్ఞానప్రకాశాన్ని దర్శించగలరు అని పేర్కొంది. దోషాలు సహజంగా అంధకారంలోనే జరుగుతాయి. వెలుగులో ఎవరో గ్రుడ్డివారో లేదా సావధాన బుద్ధిలేనివారో వారు మాత్రమే దోషాలు చేస్తారు. కాని కళ్లుకలవాడు చేయడు కదా. కాబట్టి ధ్యానంమీద వారికి శ్రద్ధతోకూడిన అనుష్ఠానం ధ్యాననిష్ఠుల సావధానతకు చిహ్నం. దానివల్లనే వారు జ్ఞానప్రకాశాన్ని దర్శించి గాఢాంధకార పాపజాలాన్ని పారద్రోలుకో గలుగుతున్నారు.
అలా పాపవిముక్తులైన ధ్యానతత్పరులు తాము పుణ్యాత్ములమని ఏ కర్మలను చేయక అకర్మణ్యులుగా ఉండరు. ధ్యానంలో వారిపై ప్రసరించిన జ్ఞాన జ్యోతి ద్వారా నిరాటంకంగా జ్ఞానప్రసాదం జరిగేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో వారు నిరంతర జ్ఞానప్రకాశ ప్రసారాన్ని అందుకొంటూనే ఉంటారు. ఆ విధంగా దిన దిన ప్రవర్థమానమయ్యే జ్ఞానప్రకాశంలో వారి అజ్ఞానాంధకారం పటాపంచలైపోతుంది. అంతేగాదు నిరంతర ధ్యానయోగంతో వారిలో ఇంద్రియశక్తి కూడ వృద్ధియవుతుంది. ధ్యానయోగుల ఇట్టి ధ్యాన తపోనిష్ఠా ప్రభావంవలన ఆధ్యాత్మిక శాంతి జలధారలు ప్రవహించి వానిలో లవలేశంగా మిగిలియుండే పాపజాలం కొట్టుకొనిపోతుంది. మహిమాన్వితమైన ఇట్టి జలప్రవాహాన్ని-
ఇదమాపః ప్ర వహత యక్తిం చ దురితం మయి
యద్వాహమభిదుద్రోహ యద్వా శేప ఉతానృతమ్‌॥
ఋ. 10-9-8
‘ఓ ఆధ్యాత్మిక శాంతి జలప్రవాహమా! నాలోని ఏ పాపలేశంగాని, ఇతరుల ఎడల నేనుచేసిన ఏదేని ద్రోహచింతన గాని, తెలిసియో తెలియక ఇతరులకు చేసిన దూషణ హింసగాని, నాయందలి అసత్య దోషంగాని గ్రహించి నీ ప్రవాహవేగంలో లాగికొని పొమ్ము’’అని వేదర్షిచేసిన ఋగ్వేదప్రార్థన ఈ మంత్రార్థానే్న సమర్థిస్తూ ఉంది.
***
31. నీవే తల్లివి తండ్రివి
అగ్ని మనే్య పితరమగ్నిమాపి మగ్నిం భ్రాతరం సదమిత్ సఖాయమ్‌
అగ్నేరనీకం బృహతః సపర్యం దివి శుక్రం యజతం సూర్యస్య॥ ఋ. 10-7-3.
ప్రతిపదార్థం:- అగ్నిమ్= అందరికన్న ముందుండేవాడు; సర్వజనులకు అభ్యుదయాన్ని కలిగించేవాడు; సృష్టికి పూర్వమందున్నవాడు అయిన భగవంతుడు; పితరమ్= తండ్రిగా; మనే్య= స్వీకరిస్తున్నాను; ఆప్తమ్= ఆప్తురాలైన తల్లిగా కూడ; అగ్నిమ్= అగ్నిరూపుడైన భగవంతునే; మనే్య= స్వీకరిస్తున్నాను భ్రాతరమ్= సోదరునిగా కూడ; అగ్నిమ్= ఆ అగ్నినే; మనే్య= స్వీకరిస్తున్నాను; సదమ్+ఇత్= ఎల్లప్పుడు; సఖాయమ్= స్నేహితుడిగా; అగ్నిమ్= అగ్నినే; మనే్య= గ్రహిస్తున్నాను; తాదృశః= అటువంటి (అధ్యాహార్యం); బృహత్=గొప్ప; అగ్నేః= పరమాత్మ స్వరూపుడైన అగ్నియొక్క; అనీకమ్= జీవన ప్రదాయకమైన తేజస్సు; సపర్యమ్= పూజార్హమైనది; తథా= ఆ విధంగా; దివి= బుద్ధియందు; సూర్యస్య= పరమాత్మ స్వరూపుడైన సూర్యాగ్నియొక్క;

ఇంకావుంది...