స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రండి. రండి. సద్బుద్ధిని అలవరచుకొందాం
ఏతా ధియం కృణవామా సఖాయో- ప యా మాతాన్ ఋణుత వ్రజం గోః
యయా మనుర్విశిశిప్రం జిగాయ యయా వణిగ్వంకురాపా పురీషమ్‌॥ ॥
భావం:- దేనితో తల్లివంటి జ్ఞాన సముద్రాన్ని అందరికోసం తెరచి ఉంచుతాడో దేనిద్వారా మనిషి సజ్జనులను తనకనుకూలంగా వశపరచుకొంటాడో, వక్రస్వభావంగల వ్యాపారి కూడ దేనిద్వారా ధనాన్ని సంపాదించగలడో, అట్టి బుద్ధి లేదా కర్మలను మనమందరమూ చేద్దాం. మిత్రులారా! మాతో మీరూ రండి.
వివరణ:- లోకంలో మొదటి గురువు తల్లియే. ఆమె తన బిడ్డలలో మొదటగా జ్ఞానాన్ని వికసింపచేస్తుంది. ‘అత్త, తాత’అను మాటలనుండి బ్రహ్మజ్ఞానం వరకు బాల్యంలో ఆమె సంతానంలో బీజాలు నాటుతుంది. ఆ శిక్షణలో ఆమెకు ఆనందమే తప్ప అన్యభావన ఉండదు. తన సంతానం సర్వోత్తమంగా ఉండాలి అన్న చింతనే తల్లిమదిలో సదా మెదలుతూ ఉంటుంది. ఇట్టి ఉదాత్తాశయంతో ఆమె తన బిడ్డలకు జీవితోపయోగియైన సమస్త జ్ఞానాన్ని అరమరికలు లేక అందిస్తుంది. ఏ ఇంద్రియాలతో ఏ విధంగా పనిని చేయించుకొనాలో నేర్పుతుంది. మంత్రమీ అంశాలనే స్పర్శిస్తూ ‘గోఃవ్రజమ్’ జ్ఞాన సముద్రాన్ని ‘అప ఋణుత’ ప్రకటిస్తుందో ఆ రీతిగా మానవుడు తన జ్ఞాన సంపత్తిని ఇతరులకు అరమరికలు లేక ప్రకటించే సద్బుద్ధిని అలవరచుకోవాలని వేదమాదేశించింది. అట్టి బుద్ధివలననే సజ్జనులు ప్రీతిచెంది వారికి అనుకూలురై యుంటారని ‘యయా మనుర్విశిశిప్రం జిగాయ’అని అట్టి సద్బుద్ధి ప్రాముఖ్యాన్ని వేదం ప్రశంసించింది. ప్రశంసనీయమైన ఈ సద్బుద్ధి స్వరూపమేమిటో దీనికి పూర్వమంత్రంలో ఇలా వివరింపబడింది.
ఏతో న్వద్య సుధ్యో భవామ ప్ర దుచ్ఛునామినవామా వరీయః
ఆరే ద్వేషాంసి సనుతర్ద్ధామాయామ ప్రాంచో యజమానమచ్ఛ॥ ॥
భావం:- నేడు మనం సద్బుద్ధికలవారమై ఉందాం. మనుష్యులకు సహజమైన ఈర్ష్యాద్వేషాది దుర్గుణాలు కలవారినుండి కూడ సద్బుద్ధి చేత మేలునే పొందుదాం. మనలోని ఈర్ష్యాద్వేషాలను దూరంగా విసిరివేద్దాం. ఆ విధంగా సత్ప్రవర్తన కలిగినవారమై యజ్ఞపరాయణతా శీలాన్ని అలవరచుకొందాం.
ఈ విధమైన ద్వేషరహితమైన సద్బుద్ధి వ్యవహారమెంత ఘనమైనదో మంత్రం వివరిస్తూ ‘యయా వణిగ్వంకురాపా పురీషమ్’ ‘అంద విహీనమైన వక్ర శరీరంగల వ్యాపారి సహితం ఐశ్వర్యాన్ని పొందుతున్నాడు’అని సోదాహరణంగా చెప్పింది.
ఈ విధంగా సద్బుద్ధిని వర్ణించి దానిని జనులందరు ఆచరించవలసిన ప్రధాన కర్తవ్యంగా భావించి వేదం జనులనందరిని ఆహ్వానిస్తూ ‘ఏతా ధియం కృణవామా సఖాయో’ ‘ఈ సద్బుద్ధిని అలవరచుకొందాం. మిత్రులారా! మీ రందరూ రండి’అని ఎలుగెత్తి పిలిచింది. మరి ఆలస్యమెందుకు? రండి వేదమాత ఆదేశాన్ని పాటిద్దాం.
** - ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512