స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరోపకారార్థం యజ్ఞాలను చేసే యజమానుల పశుసంపదను కాపాడండి.
వివరణ:- ఋగ్వేదం ప్రధానంగా భగవత్ స్తుత్యాత్మకమైన వేదం. ‘ఋగ్భిః స్తువంతి’ ‘‘ఋక్కుల ద్వారా భగవానుడు స్తుతింపబడతాడు’’అన్న వచనమే ఆ అంశాన్ని నిర్ధారిస్తూంది. యజుర్వేదం కర్మప్రధానమైన వేదం. ‘యజుభిర్యజంతి’ ‘‘యజుస్సులతో దైవమారాధింపబడుతూంది’’అన్న ఋషి వాక్యం యజుర్వేదం కర్మప్రాధాన్యాన్ని స్పష్టంచేస్తూ ఉంది. కర్మప్రధానమైన యజుర్వేదారంభం ‘ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే’ అంటూ కర్మప్రేరణతో ఆరంభమయింది. యజుర్వేదంలో అంతిమ అధ్యాయంలో ‘‘కుర్వనే్నవేహ కర్మాణి జిజీవిషేచ్ఛత సమాః’ (శు.య.వే.40-2) ‘‘ఈ లోకంలో మానవుడు కర్మచేస్తూనే నూరేండ్లు నిశే్వషంగా జీవించా’’లని జీవితమంతా కర్మలనాచరించమనియే శాసించింది. చిత్రమేమంటే ఏవేవో కర్మల నాచరిస్తూ జీవనం గడపటం కాదు. ఆచరించే కర్మలు మంచివా చెడ్డవా అని కూడ ‘కృతం స్మర’ (శు.య.వే.40-15) చేసిన వానిని స్మరించుమని యజుర్వేదమే (శు.య.వే.40-15) అదే మంత్రంలో హెచ్చరించింది.
ఇలా ఆద్యంతాలలోనేగాక మధ్యలో కూడ ‘అక్రన్ కర్మ కర్మకృతః సహ వాచా మయోభువా’ (శు.య.వే.3-17) ‘‘కర్మ నిష్ఠులు శ్రేయోదాయకమైన వేద వచనానుసారంగా కర్మలనాచరిస్తూ ఉంటారు’’ అని కర్మ ప్రాధాన్యాన్ని యజుర్వేదం జ్ఞాపకం చేసింది. ఈ ఓణవ ఓవర యజుర్వేదం కర్మ ప్రధానమైనదని స్పష్టపడుతూంది. ఆ కర్మ కేవలం సాధారణ కర్మకాదు. శ్రేష్ఠతను కర్మల నాచరింపమనియే వేద నిర్దేశం. వేద ప్రతిపాద్యుడైన భగవంతుని ఆదేశం జీవితంలో ‘ఆప్యాయధ్వమ్’ ‘‘పుష్పించు ఫలించు’’మనియే. అది ఎలాగైనాకాదు. కేవలం ‘ఆప్యాయధ్వమ్ అఘ్న్యాః’ ‘‘హింసాపీడితుడవుగాక జీవితంలో పుష్పించు ఫలించు’’మని దైవశాసనం. అహింసా పీడ స్వరూపమేమిటో వేదమే రెండు మూడుదాహరణలను పేర్కొంది. ‘అనమీవా-అయక్ష్మా మా వ స్తేన- ఈశత’ ‘‘రోగగ్రస్తులు కాకుండ క్షయరోగాది దీర్ఘరోగ పీడితులు గాకుందురుగాక! దొంగ మీకు శాసకుడుగాకుండుగాక’’!
ఈ అంశాలు ఎవరికయినా కర్మాచరణకు విరోధి అయినవే. రోగాదులు శరీరాన్ని హింసించేవి కాగా పాలకుల దుశ్శాసనాలు కూడ మనిషిని హింసించి కర్మలను ఆటంకపరచేవే. రోగాదులు కర్మనిరోధమని అందరికి అనుభవంలోనివే. ప్రజలనందరిని కన్నబిడ్డలవలె చూడవలసిన పాలకుడు వ్యక్తిగత విశ్వాసాలు, ఆలోచనలు, రాజకీయ ప్రయోజనాలతో పాక్షిక దృక్పథం కలిగి తనకనుగుణ విశ్వాసాదులను ప్రోత్సహిస్తూ తక్కినవారిని హింసకు గురిచేస్తూ ఉంటాడు. నేడు ఈ దుఃస్థితిని చాలకాలంగా దేశ ప్రజలు అనుభవిస్తూ ఉన్నదే. ఆ హింస కూడ లేకుండా ఉండి ప్రజలు స్వకర్మలను స్వేచ్ఛగా ఆచరించాలని వేదమభిలషించింది. ఆ పాలకుణ్ణి వేదం స్తేన దొంగగా నిందించింది. దొంగకు స్వప్రయోజనంకోసం హింసించడమే తప్ప ప్రేమించడం తెలియదు కదా!
ఈ అహింసాభావం మానవుల ఎడలనేగాదు, పశువుల ఎడల కూడ చూపమంటూ ‘యజమానస్య పశూన్ పాహి’యజ్ఞకర్తల పశువులను రక్షించండి’’అని వేదం జీవకారుణ్యాన్ని ప్రబోధించింది. *
ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512