స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాప సంస్కారాలను వీడు
యో నః పాప్మన్న జహాసి తము త్వా జహిమో వయమ్‌
పథామను వ్యావర్తనే- న్యం పాప్మాను పద్యతామ్‌॥ అథ.వే.6-26-2॥
భావం:- ఓ పాపమా! నీవు మమ్మువీడవు. కాని నినే్న మేము వీడెదము. నీ మార్గాన్ని మార్పుచేస్తే మరొక మార్గంలో నీవు వస్తుంటావు.
వివరణ:- పాపమార్గం సక్రమంగా ఉండదు. ఒకసారి పాపమార్గంలోనికి వెళ్లితే తిరిగి బయటపడటం చాలా కష్టం. పాప మార్గంలో నడిచేవానికి తత్‌క్షణం ఏ హాని కలిగినట్లు కనబడదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఆ పాప మార్గంలో నిరాఘాటంగా నడుస్తాడు. ప్రస్తుత కాలంలో పాపకర్మాచరణకు ఎంతగా అలవాటుపడ్డారంటే ఆరంభంలో అయిష్టంగానే పాపకర్మలకు పూనుకొంటారు. క్రమంగా ఆ పాపాచరణవలన వారి సంస్కారం కూడ కుసంస్కారంగా మారి మరలమరల పాప వ్యవహారాలకే సిద్ధపడే హీనస్థితికి దిగజారిపోతారు.
మానవులలో సంస్కారమూ మరియు వ్యవహారాల (నడవడిక) చక్రభ్రమణాన్ని వర్ణిస్తూ యోగదర్శన మీవిధంగా వివరిస్తూంది.
తథా జాతీయకాః సంస్కారా వృత్త్భిరేవ క్రియంతే సంస్కారైశ్చ
ఏవం వృత్తి సంస్కార చక్రమనిశమావర్తతే॥ (యో.ద.1-5)
మనుష్యుల వృత్తులకు (నడవడిక) తగిన విధంగా సంస్కారాలు ఏర్పడతాయి. ఆ సంస్కారాల వలన వృత్తులు ఏర్పడతాయి. ఈ విధంగా వృత్తుల మరియు సంస్కారాల చక్రం రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉంటుంది.
పాప సంస్కారంనుండి విముక్తుడు కావడమంత సులభంకాదు. వేదం దాని స్వభావాన్ని వివరిస్తూ
‘యో నః పాప్మన్ న జహాసి’ ‘‘ఓ పాపమా! నీవు మమ్ము విడువనే విడువవు’’అని పేర్కొంది. పాప సంస్కారం మరియు ఆచారంనుండి విడివడాలంటే పాపాచారం మరియు సంస్కారాలకు విరుద్ధమైన ఆలోచనా రీతిని అలవరచుకోవడమొక్కటే ఉపాయం. యోగశాస్త్ర పరిభాషలో ఈ ఉపాయానే్న ‘ప్రతిపక్ష భావన’గా చెప్పబడుతుంది. ఈ భావనను దృఢంగా సంకల్పిస్తే పాప సంస్కారం మరియు ఆచరణలను విడువటం అసాధ్యమేమీ కాదు. వేదమీ సంకల్పానే్న ‘తము త్వా జహిమో వయమ్’ ‘‘అట్టి పాప సంస్కారాన్ని, పాపాచరణను మేమే విడిచిపెడుతున్నాం’’అని సంకల్పించమని ఆదేశించింది.
జీవిత ప్రయాణమునే నాలుగు రహదార్ల కూడలిలో పాప-పుణ్యాలకు వేరువేరు మార్గాలుంటాయి. అక్కడే ఈ పాపమార్గాన్ని విడిచిపెట్టవలసి ఉంది. పాప-పుణ్య వాసనలు రెండూ ఒకేచోట ఉంటాయి. వానిని చూచే శక్తి నిస్సందేహంగా ఆత్మకే ఉంటుంది. కాని వానిని కళ్లు మాత్రమే చూపుతాయి. ఏది శుభమో ఏది అశుభమో విచారించగల సామర్థ్యం ఆత్మకే ఉన్నా ఆ పనిని మనస్సు మాత్రమే చేయిస్తుంది. ఈ విధంగా సమస్త రూపాలను చూచేందుకు కళ్లు ఎలా ఆధారమో అలాగే మంచి చెడులన్నింటిని చూచేందుకు మనస్సే ఆధారం. కాబట్టి వేదపరిభాషలో మనస్సు మార్గాలను పరివర్తనం అంటే మార్పుచేసేది మాత్రమే. అందువల్ల మార్గాలు వేరుపడిన మనస్సునుండి పాపాన్ని, పాపాచారాన్ని ప్రక్కదారికి మళ్లించాలి. దారి మళ్లిన పాపం తిరిగి తనవద్దకు రాజాలదు.
పాపం ప్రక్కదారికి మళ్లినా మనసునకంటిన పాప సంస్కారం మాత్రం నిలిచి యుంటుంది. అది చాల ప్రబలమైనది. అది మనస్సులో మరల మరల పొడసూపుతుంది. అప్పుడే పైన యోగదర్శనం చెప్పిన ప్రతిపక్ష భావనను ఆయుధంగా గ్రహించాలి. యోగదర్శన భాష్యంలో వేదవ్యాసుడీ విధంగా దీనిని వివరించాడు.
ఏవమున్మార్గ ప్రవణ వితర్కజ్వరేణాతిదీప్తేన బాధ్యమానస్తత్ప్రతిపక్షాన్ భావయేత్‌
ఘోరేషు సంసారాంగారేషు పచ్యమానేన మయా శరణముపగతో యోగధర్మః ష
ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512