స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక జీవునిపరంగా ‘‘ఇతరులచేత పలుకబడిన శబ్దాలను విని గ్రహించగల శక్తి కలుగుతుంది’’అని రెండవ అర్థం. అంటే బాలుడు స్వయంగా పలుకలేకపోయినా తల్లి మొదలగువారు పలికిన మాటలను విని అర్థంచేసుకోగల శక్తి కలిగియుంటాడని భావం. భగవద్దత్తమైన జన్మనే జీవుడు స్వీకరించి ఆతడు చేసుకొన్న కర్మఫలాలను జీవుడు అనుభవిస్తాడన్న ఈ అథర్వణవేద సిద్ధాంతాన్ని ఋగ్వేదం కూడ ఇలా సమర్థించింది.
ఆ యో యోనిం దేవకృతం ససాద క్రత్వా హ్య గ్నిరమృతాన్ అతారీత్‌॥ ॥
‘‘తాను సృజించిన దేహాలలో ఉండే జీవులను భగవానుడే వారి కర్మలనుండి తరింపచేస్తాడు’’ ఇక్కడ తరింపచేస్తాడు అన్న మాటకు ఒక జన్మనుండి మరొక జన్మకు పంపబడటమో లేదా ఆ జన్మనుండి విముక్తం చేయడమో చేయబడతాడని అర్థం. ఆ పనిని భగవంతుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయనొక్కడే చేయ సమర్థుడు అని అథర్వణవేదమీవిధంగా వివరించింది. సర్వం తద్రాజా వరుణో వి చష్టే యదంతరా రోదసీ యత్పరస్తాత్‌సంఖ్యాతా అస్య నిమిషో జనానామ్‌॥ (అథ.వే.4-16-5)
ఈ విశ్వంలో మరియు ఈ విశ్వానికి అవతల ఏమి ఉన్నాయో అంతర్యామి మరియు విశ్వప్రభువు అయిన పరమాత్మకే తెలుసును. ఆయన ప్రాణుల కనురెప్పపాటులను సహితం గణింపగలడు.
***
ఎవడు దీర్ఘాయువువ కోరుకొంటాడు?
కో అస్యా నో ద్రుహో- వద్యవత్యా ఉనే్నష్యతి క్షత్రియో వస్య ఇచ్ఛన్‌
కో యజ్ఞకామః క ఉ పూర్తికామః కో దేవేషు వసుతే దీర్ఘమాయుః॥ ॥
కః పృశ్నిం ధేనుం వరుణేన దత్తామథర్వణే సుదుఘాం నిత్యవత్సామ్‌
బృహస్పతినా సఖ్యం జుషాణో యథావశం తన్వః కల్పయాతి॥ ॥
భావం:- మాకు సమస్త సత్ఫలాలు కలగాలనికోరే శ్రేష్ఠ క్షత్రియుడెవడు? ఈ ద్రోహభావననుండి మమ్ము ఎవడు ఉద్ధరించగలడు? యజ్ఞాలను చేయాలని కోరేవాడెవడు? లోటులను పూరించేవాడెవడు? ఇంద్రియాలలో సుదీర్ఘమైన ఆయువును కోరుకొనే వాడెవడుంటాడు?
ప్రతిపదార్థం:- అథర్వణే= సందేహరహితుడైన యోగికొఱకు; వరుణేన= వరుణుని చేత; దత్తామ్= ఈయబడిన; సుదుఘామ్= బాగా మంచి పాలనిచ్చే; నిత్యవత్సామ్= ఎప్పుడు దూడలను కలిగిన; పృశ్నిమ్= వివిధ వర్ణాలుగల; ధేనుమ్= ఆవును; కః= ఎవడు కోరుకొంటాడు?; బృహస్పతినా= బృహస్పితితో; సఖ్యమ్= మైత్రిని; జుషాణః= ప్రీతిపూర్వకంగా ప్రదర్శించేవారికి; యథావశమ్= ఇచ్ఛానుసారంగా; తన్వః=శరీరాలను; కల్పయాతి=అధికారాన్ని కల్పిస్తాడు.
భావం:- సందేహరహితుడైన యోగికి వరుణునిచే ఈయబడిన వివిధ వర్ణాలు కలిగి బాగా పాలనిచ్చే నిత్యమూ దూడలను కలిగిన ఆవునెవడు కోరుకొంటాడు? బృహస్పతితో ప్రీతిపూర్వకంగా మైత్రిని నెరపేవారికి వారి శరీరాలపై స్వేచ్ఛానుసారమైన అధికారాన్ని కల్పిస్తాడు.
వివరణ:- ఈ రెండు మంత్రాలకు దేవత అంటే ప్రతిపాద్య విషయం ‘ఆత్మ’గా చెప్పబడింది. ఇంద్రియాలు విషయాలవైపు బాగా వేగంగా కదిలి వెళ్లిపోతున్నాయి. ఒక విధంగా ఆ ఇంద్రియాలన్నీ ఆత్మ వశం తప్పి పూర్తిగా బయట తిరుగసాగాయి. ఇది ఆత్మకు విరుద్ధంగా ఇంద్రియాలు చేసిన ద్రోహకార్యమే అనాలి. పాపాచరణకు మూలమిక్కడ నుండే ఆరంభమవుతుంది. ఈ విషయానే్న అథర్వణవేదం ఆలంకారికంగా ఇలా వర్ణించింది.