స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాటనే వేదం మరో సందర్భంలో ‘జివ్రీ యువానా పితరా కృణోతన’ (ఋ.1-110-8) వృద్ధ తల్లిదండ్రులను యువకులుగా చేయి’’అని పునరుద్ఘాటించింది. యువకులుగా చేయమంటే వార్థక్యంలో దుఃఖం కలుగకుండా చేయుమని అంతరార్థం.
వేదం మూడవ చరణంలో సౌధస్వనా అశ్వాదశ్వమతక్షత ‘‘ఉత్తమ విలువిద్యా నిపుణులారా! గుఱ్ఱంనుండి గుఱ్ఱాన్ని పుట్టించండి’’అని చిత్రమైన మాట చెప్పింది. గుఱ్ఱంనుండి గుఱ్ఱంకాక మరేది పుడుతుంది? మరి వేదమెందుకు ఇలా చెప్పింది? అంటే ఇక్కడ గుఱ్ఱమను మాట పశుసంపదకు పర్యాయంగా గ్రహించాలి. పశుసంపద కాలక్రమంలో ఆకారంలోగాని, శక్తిలో గాని, అందంలో గాని హీనత పొందకుండ నిరంతరం అన్ని విషయాలలో పరిపుష్టంగా ఉండేవిధంగా శ్రద్ధవహించుమని వేదమంతర్భావం.
చివరగా వేదం ‘యుక్త్వా రథముప దేవాన్ అయాతన’రథాలను సిద్ధపరచుకొని ఉత్తమ పదార్థాలను సులభంగా పొందుము లేదా రథాలను సిద్ధపరచుకొని విద్వాంసుల వద్దకు వెళ్లుము అని దివ్య సందేశమిచ్చింది. అంటే మానవుడు రథాన్ని సిద్ధపరచుకొని అంటే సర్వసన్నద్ధుడై ఉత్తమ జీవనంకోసం ఉత్తమ పదార్థాలను సంగ్రహించుకోవాలని అలాగే సదా ఉత్తములైన సత్పురుషులవద్దకుచేరి ఉత్తమరీతిగా విజ్ఞానాన్ని పొందాలని వేద దివ్యోపదేశంలోని అంతరార్థం. ఇది మానవుడెక్కడున్నా అతడికి శిరోధార్యమైన సందేశమే కదా!
**
అగ్నిర్జాతో అథర్వణా విదద్విశ్వాని కావ్యా
భువద్దూతో వివస్వతో వి వో మదే ప్రియో యమస్య కామ్యో వివక్షసే॥ ॥
భావం:- జ్ఞాని లేదా పురోహితుడు అథర్వణ వేద విజ్ఞానంలో ప్రసిద్ధుడై భగవద్వచనమైన వేదాలను పరిపూర్ణంగా తెలుసుకొని యుంటాడు. అతడు కాలానికి దూత అవుతాడు. నీ ఆనందానికి మరియు నీకు విశేషంగా ప్రబోధించేందుకు, నీ సంపూర్ణ్భారాన్ని వహించేందుకు సంయమి అయిన యమునకు నీవు మిక్కిలి ప్రియమైన వాడవవుతావు.
వివరణ:- వేదంలో పలుచోట్ల అగ్నిదేవుడిని పురోహితుడుగా స్తుతించడం జరిగింది. వేదాలలో మొదటిదైన ఋగ్వేదారంభంలోనే అగ్ని పురోహితుడుగా కీర్తింపబడ్డాడు.
‘అగ్నిమీళే పురోహితమ్’ (ఋ.1-1-1) ‘‘పురోహితుడయిన అగ్నిని స్తోత్రం చేస్తున్నాను’’
‘అసి గ్రామేష్వవితా పురోహితో- సి యజ్ఞేషు మానుషః’ (ఋ.1-44-10) ‘గ్రామాలలో నీవు రక్షకుడవు.
యజ్ఞకర్మలలో మానవులకు నీవు హితైషివయిన పురోహితుడవు.’’ఇలా అగ్ని పురోహితుడుగా శ్లాఘింపబడిన మంత్రాలెన్నో ఉన్నాయి.పురోహితుడు కావడానికి ప్రధానంగా అథర్వణవేద విజ్ఞానమెంతో అవసరం. ఎందుకంటే యజ్ఞాలలో నిర్వహింపబడే అనేక కర్మలకు సంబంధించిన మంత్రాలు అథర్వణ వేదంలోనే ఉన్నాయి. అంతేగాక అథర్వణ వేదంలో శరీరాన్ని, ఆత్మను సంస్కరించే సాధనాలు ఎంతో విపులంగా వర్ణింపబడి యున్నాయి.అథర్వణ వేదం నాలుగు వేదాలలో చివరిది. ఇందుచేత దానిని అర్థం చేసుకోవాలంటే మొదటి మూడు వేదాలు పరిపూర్ణంగా తెలియవలసి యుంది.
అంటే అథర్వణవేదం వేదాధ్యయనం పూర్తిఅయ్యే సమయానికి సంపూర్ణ వేద విజ్ఞానమంతా అవగాహనలోనికి వస్తుంది. ఈ కారణం చేతనే ఈ మంత్రంలో ‘వి దద్విశ్వాని కావ్యా’ ‘‘పరమ కవీశ్వరుడైన పరమేశ్వరుని సంపూర్ణ వచన సముదాయమైన వేద విజ్ఞానం తెలుసుకొంటాడు’’అని పేర్కొంది.

ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512