స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ జ్ఞానమెట్టిది? ప్రియమ్= ప్రీతికరమైనది. శూషమ్= బలవర్థకమైనది. బృహత్= చాలా శ్రేష్ఠమైనది. అందుకే భగవదత్తమైన ఈ జ్ఞానం భోగ- మోక్ష ప్రదాయక సమర్థమైనది. కాబట్టి మానవుడుగా జన్మించిన ప్రతి వ్యక్తికి ప్రథమకర్తవ్యం ‘దేవత్తం బ్రహ్మ గాయత’(ఋ.1-37-4) ‘‘పరమాత్మచే ప్రదానం చేయబడిన వేదాన్ని గానం చేయి’’అని ఋగ్వేదం శాసిస్తూంది. వేదభూమిలో పుట్టామని గర్వంగా చెప్పుకొనే మనం వేదాదేశాన్ని శిరసావహించి సార్థక జన్ములమవుదాం.
**
మనుష్యుడు- జన్మసార్థక్యం
వనేమ పూర్వీరర్యో మనీషా అగ్నిః సుశోకో విశ్వాన్యశ్వాః
ఆ దైవాన్ని వ్రతా చికిత్వానా మానుషస్య జనస్య జన్మ॥ ఋ.1-70-1॥
భావం:- అత్యంత సనాతన కాలంనుండి పరంపరగా వచ్చే జ్ఞాన విజ్ఞాన విషయాలను బుద్ధివిశేషంతో గ్రహించుట యందే మానవజన్మ సార్థక్యముంది. తేజోవంతుడు, అగ్రేసరుడయినవాడు ఆ సనాతన జ్ఞానసంపదను గ్రహిస్తాడు. మనిషిగా పుట్టి దేవత్వసిద్ధిని పొందింపచేసే సాధకమైన వ్రతాలను పరిపూర్ణంగా తెలుసుకొంటాడు.
వివరణ:- తనకు ప్రాచీనకాలంనుండి పరంపరగా వస్తున్న జ్ఞాన విజ్ఞాన విషయాలను గ్రహించుటయందే మానవజన్మ సాఫల్యముంది. మనిషి మనిషిగా కావడానికి అవసరమైన సాధనాలను వివరిస్తూ ఋగ్వేదం ‘జ్యోతిష్మతః పథో రక్ష ధియా కృతాన్’ (ఋ.10-53-6) ‘‘జ్ఞాన మార్గాలను స్వబుద్ధిచేత సమన్వయించుకొని రక్షణ పొందుమని వివరించింది. అంటే ఏమిటి? సనాతన జ్ఞాన విద్యలను ఎన్ని నేర్చుకొన్నా ఆ జ్ఞానంలో స్వబుద్ధిచేత ప్రకాశింపబడిన జ్ఞాన విశేషం కూడ జోడింపబడాలి. అప్పుడే పరంపరగా తనవరకు వచ్చిన జ్ఞానం మరింత పరివృద్ధవౌతుంది. ఆ విధంగా విజ్ఞానం క్రమక్రమంగా సమృద్ధమవుతూ ఉంటుంది. మనమెలా పూర్వులనుండి వచ్చిన జ్ఞాన సంపద వలన ప్రయోజనం పొందామో అదే ప్రయోజనాన్ని మన తరువాత రాబోయే తరాలవారు కూడ మనవలన జ్ఞానప్రయోజనం పొందాలికదా! ఆ పరంపర అలా కొనసాగాలి. ఈ విషయాన్ని గూర్చి ఋగ్వేద మీవిధంగా వివరించింది.
ప్రాతా రథో నవో యోజి సస్నిశ్చతుర్యుగస్ర్తీకశః సప్తరశ్మిః
దశారిత్రో మనుష్యః స్వర్షాః స ఇష్ట్భిర్మతిభీ రంహ్యో భూత్‌॥ (ఋ.2-18-1)
‘‘ముక్తినుండి తిరిగి వచ్చే జీవిత ప్రభాత సమయంలో (జన్మారంభంలో) ఒక క్రొత్త రథం (శరీరం) లభిస్తుంది. దానిలో నాలుగు యుగాలు (్ధర్మార్థ కామమోక్షాలు) ఉంటాయి. మూడు ఋణాలు (దేవ- పితృ- ఋషి ఋణాలు) ఉంటాయి. ఏడు కాంతులు (మనో-బుద్ధి- అహంకార- చిత్త- ఆత్మ- మహత్తు- పంచతన్మాత్రలు- జీవుడు) ఉంటాయి. పది అరిత్రాలు (ఐదు జ్ఞాన- ఐదు కర్మ ఇంద్రియాలు) ఉంటాయి. ఈ అన్నింటితో మనిషి సుఖపడుతూ యజ్ఞాచరణ ద్వారా మరియు జ్ఞాన పరంపరల సాధనల ద్వారా నిత్యోత్సాహిగా ఉంటాడు.’’ మానవ జన్మ సార్థక్యం ఈవిధంగా జీవించడంలోనే ఉంది. దానిని సాధించేందుకు మానవుడు ‘దైవాన్ని వ్రతాః’ దివ్య వ్రతాలను పూర్తిగా తెలుసుకొని ఆచరింపవలసి యుంది. ‘ఆ దైవ్యాని వ్రతా చికిత్వాన్’అని వేదం నిర్దేశిస్తూంది.
‘దైవాన్ని వ్రతాః’అంటే దేవతలకొఱకు చేసే వ్రతమని అర్థం. దేవవ్రతమంటె? సత్యధర్మమే. అదే పరమ ధర్మమని ధర్మశాస్త్రాలు ‘నాస్తి సత్యాత్పరో ధర్మః’ సత్యాన్ని మించిన ధర్మమే లేదని ముక్తకంఠంగా చెప్పాయి. సృష్టిలోని సమస్త జీవరాశికంటె మనిషి ఘనత ధర్మాచరణ వలననే సిద్ధిస్తూంది.
‘్ధర్మో హి తేషా మధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః’ (మిత్ర లాభం)
- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512