స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్వం దాతా ప్రథమో రాధసామస్యసి సత్య ఈశానకృత్‌
తువిద్యుమ్నస్య యుజ్యా వృణీమహే పుత్రస్య శపసో మహ.॥॥
భావం:- ఓ సర్వేశ్వరా! సమస్త ధనాలను ప్రదానంచేసే ప్రథమ ప్రదాతవు నీవే. భూత భవిష్యత్ వర్తమానాలలో పరిణామం చెందని సత్యస్వరూపుడవు. సమస్త శాసనకర్తవు -రాజాధిరాజువు నీవే. తేజశ్శాలివి, బలశోధకుడవు, పూజ్యుడవు అయిన నీ సాంగత్యాన్ని మేము కోరుకొంటున్నాం.
వివరణ:- సృష్టిలోని సమస్త ధనరాశికి ప్రభువు పరమేశ్వరుడే ‘త్వం హి రాధస్పతే రాధసో మహః క్షయస్యాసి విధతః’ (ఋ.8-61-14) ‘‘ఓ ధనపతీ! నీవే సకల ధనాలకు పెన్నిధివి. దాతవు కూడ నీవే’’అని ఋగ్వేదం భగవంతుని శ్లాఘించింది. ఈ మంత్రంలో కూడ ఋగ్వేదం సకల ధనాలకు ప్రథమ ప్రదాత పరమేశ్వరుడే అని కీర్తించింది. మహాదాతగా సర్వేశ్వరుడు ‘ఇంద్ర ఇన్నో మహానాం దాతా’(ఋ.8-92-3) జీవులమైన మనందరకు గొప్పగొప్ప పదార్థాలను దానంచేస్తాడు. జగద్విభుడు దానంచేసిన ఘనమైన ప్రదానాలన్నీ శుభదాయకాలే. ‘్భద్రా ఇంద్రస్య రాతయః’ (ఋ.8-62-1) దైవదత్త ప్రదానాలు క్షేమదాయకాలే అని ఋగ్వేదం వచించింది. లోకనాథుడయిన పరమేశ్వరుడు సర్వజీవుల ఎడల సముడు. ఆయన దృష్టిలో రాజు, పేద అన్న తారతమ్యం లేదు. కాలానుగుణంగా ఆయనలో ఎట్టి విపరిణామం చోటుచేసుకోలేని సత్య స్వరూపుడు. ‘సత్యః’అని చెప్పిన ఈ మంత్రాభిప్రాయమే మరింత విపులంగా కృష్ణ యజుర్వేద మీవిధంగా వర్ణించింది.
కస్త్వా సత్యో మదానాం మంహిష్ఠో మత్సదంధసః (య.వే.36-5)
‘‘బ్రహ్మానందజ్ఞులలో పూజనీయుడు, సత్యస్వరూపుడు అయిన లోకాధ్యక్షుడు నీకు అన్నాది ప్రదానాల చేత ఆనందాన్ని కలిగిస్తున్నాడు’’. ఊర్జిత శాసనుడయిన ఆ దైవం ఈశానకృత్= శాసకులకే శాసకుడు అని చెప్పిన ఈ మంత్రార్థమే వేదాలలో బహుధా వర్ణింపబడింది.
త్వమీశిషే సుతానా మింద్ర త్వమనుతానామ్‌ త్వం రాజా జనానామ్‌॥॥
ఓ అమేయాత్మా! జగత్తులోని సమస్త వస్తుజాలానికి, జీవులకు ఈశ్వరుడవు. నీవే సర్వలోకాలకు శాసనకర్తవు. ‘త్వం హి శశ్వతీనాం పతీ రాజా విశామసి’ (ఋ.8-95-3) ‘‘ఓ విశ్వయోనీ! నీవే జీవన సమూహానికి నిజమైన పాలకుడవు.’’
అట్టి జగద్వల్లభుడు, జగద్రక్షకుడయిన భగవంతుని అండదండలెవరికి అవసరముండదు? అందుకే మీరందరు ఆ దైవాన్ని ఆశ్రయించండని ‘తువిద్యుమ్నస్య... మహాః’ ‘‘మహా తేజస్వి, బలశోధకుడు, పూజనీయుడు అయిన ఆ మహేశ్వరుని సాన్నిధ్యాన్ని -సహయోగాన్ని కోరుకొంటున్నాం’’ అన్న ప్రార్థనా వచనం ద్వారా ప్రస్తుత మంత్రం మానవాళికి శరణాగతిని ప్రబోధించింది. ఈ శరణాగతి ఆపదల సమయంలోనేనా? కాదు. మనిషి యోగ-క్షేమాలతో సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవత్సన్నిధిని కోరుకోవాలని ‘క్షేమే యోగే హవ్య ఇంద్రః’ (ఋ.10-89-10). యోగ- క్షేమాలతో సుఖంగా ఉన్నప్పుడు కూడ భగవత్ స్మరణచేయాలి’అని ఋగ్వేదమాదేశించింది. లేనిదానిని పొందడం యోగం. ఉన్నదానిని రక్షించుకోవడం క్షేమం. ఈ రెండింటికోసం దైవాన్ని ఆశ్రయించాలి అని భావం. తాత్పర్యమేమంటే జీవితంలో ప్రతి కార్యారంభంలో దైవస్మరణను మరువక ఎల్లప్పుడు చేయాలనియే ఈ విషయాన్ని ఋగ్వేదం స్పష్టంగా ఇలా శాసిస్తూంది. ‘యోగే యోగే తవస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే’ (ఋ.1-30-7) ‘‘మిత్రులమైన మేము జీవితంలో ప్రతి ప్రయత్నంలో ప్రతి జీవన సంగ్రామంలో మహాబలియైన దైవానే్న గట్టిగా పిలుస్తాము’’ ఆస్తికుడెవడైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ వేద సందేశాన్ని మరుస్తాడా?
**
మేము నీవారలం- నీవు మా వాడవు
త్వయేదింద్ర యుజా వయం ప్రతి బ్రువీమహి స్పృధం
త్వమస్మాకం తవ స్మసి॥ ఋ.8-92-32॥
భావం:- ఓ పరమేశ్వర! నిన్నాశ్రయించిన వారిని ఆశ్రయించే మేము మమ్ము అణచివేయాలని చూచే శత్రువులకు తగిన సమాధానం చెప్పగలం. ఎందుకంటె నీవు మా వాడవు. మేము నీవారం.
వివరణ:- శత్రు సంహారార్థం చేసే భగవత్ప్రార్థనామంత్రమిది. శత్రువులనేక విధాలుగా ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆత్మకు శత్రువులు

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు