స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మంత్రంలో భగవంతునకు గల అనేక నామాలలో కొన్ని పేర్కొనబడ్డాయి. శుక్లయజుర్వేదం ముప్పది ఒకటవ అధ్యాయంలో భగవానుడు పురుషునిగా అనగా వ్యాపకరూపునిగా వర్ణనచేయబడ్డాడు. అదే వేదంలో ఆయన ప్రజాపతిగా కీర్తింపబడ్డాడు. ఈ ప్రస్తుత మంత్రంలో అదే విధంగా ‘స ప్రజాపతిః’ (శు.య.31-19)అని భగవానుడు కీర్తింపబడ్డాడు. దీనినిబట్టి ఆ ప్రజాపతియే అగ్ని, సూర్యుడు, వాయువు, చంద్రుడు, శుక్రుడు, బ్రహ్మ, జలం ఇలా ఎన్నో నామాలుకలవాడని స్పష్టపడుతూంది.
భగవంతుడు అనేక గుణాలుకలవాడు. అనేక కర్మలను నిత్యమూచేస్తూ ఉండేవాడు. వానిననుసరించి ఆయన నామాలుకూడ అనంతం. ఉదాహరణకు ఒక మనిషి ఒకరికి పుత్రుడుకావడం వలన పుత్రుడని, సోదరుడు కావడంవలన సోదరుడని, తండ్రి కావడంవలన తండ్రి అని, అల్లుడు కావడంవలన అల్లుడని. ఇలా అనేక నామాలతో పిలువబడుతూ ఉంటాడు. అలాగే భగవానుడు కూడ. అందరకు అభ్యున్నతి కలిగించేవాడు కావడం వలన ‘అగ్ని’అని, అఖండుడుగా ఉండేవాడుకాన ‘ఆదిత్యు’డని, మహాబలశాలి మరియు గమనప్రదాత కావడంవలన వాయువని, సమస్త జీవులకు ఆనందాన్ని కలిగించేవాడు
కాబట్టి ‘చంద్రు’డని, శీఘ్రకారి మరియు శుద్ధికర్త కావడం వలన ‘శుక్రు’డని, అందరికన్న ఉన్నతుడు కావడం వలన బ్రహ్మ అని సర్వవ్యాపకుడగుట వలన ‘ఆపః’ జలమని, సమస్త జనులకు పరిపాలకుడగుటవలన ‘ప్రజాపతి’ అని ఇలా నామాలన్నీ ఆ ఒక్కదైవానివే. పరిశీలన చేస్తే ఆ నామాలన్నీ సార్థకమైనవే. ఈ భగవన్నామాలను గురించి దయానంద సరస్వతి తమ సత్యార్థప్రకాశంలో ఇలా వ్రాసారు.
‘‘లోకంలో ధనపతి అన్న దరిద్రుని నామంలా భగవన్నామాలు నిరర్థకమైనవి కావు. భగవన్నామాలన్నీ గుణ సంబంధమైనవో, కర్మనిష్ఠాగరిష్ఠమైనవో, స్వభావ జనితమైనవో, అయి ఉంటాయి.
ఋగ్వేదంలో భగవానుని అనేక నామాలను ప్రకటించే ఈ మంత్రమొక దానిని చూడండి.
ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాహురథో దివ్యః స సుపర్ణో గరుత్మాన్‌
ఏకం సద్విప్రా బహుధా వదంత్యగ్నిం యమం మాతరిశ్వానమాహు.॥ (ఋ.1-164-46)
సర్వాగ్రగణ్యుడైన పరమేశ్వరుని ఇంద్రుడని, మిత్రుడని, వరుణుడని వ్యవహరిస్తాడు. ఆయనయే దివ్యుడు, సుపర్ణుడు మరియు గరుత్మంతుడు. అట్టి అద్వితీయుడైన సత్ స్వరూపుడు అనేక నామాలతో వ్యవహరింపబడుతున్నాడు. ఆయననే అగ్ని, యముడు, మాతరిశ్వుడు అని కూడ పిలుస్తారు.
మనువు ఈ విషయానే్న మనుస్మృతిలో ఇలా వివరించాడు.
ప్రశాసితారం సర్వేషామణీయాంస మణోరపి రుక్మాభం స్వప్నధీగమ్యం విద్యాత్తం పురుషం పరమ్‌
ఏతమగ్నిం వదంత్యేకే మనుమనే్య ప్రజాపతిమ్‌
ఇంద్రమేకే పరే ప్రాణమపరే బ్రహ్మ శాశ్వతమ్‌॥ (మను.12-122-23)
సమస్త జీవులకు శిక్షకుడు- సూక్ష్మం కంటె మిక్కిలి సూక్ష్మమైనవాడు- జ్యోతిర్మయుడు - నిర్వికల్ప సమాధియందు మాత్రమే తెలియబడువాడు అయిన పరమేశ్వరుడు పరమ పురుషుడు. ఎందరో ఆయనను అగ్ని అని, మనువని, ప్రజాపతి అని వ్యవహరిస్తూ ఉంటారు. మరికొందరు ఆయనను ప్రాణమని, ఇంద్రుడని, బ్రహ్మ అని కూడ చెబుతూ ఉంటారు.
మరి ఇంకేం. నామభేదాలను విడిచి మనమంతా ఇష్టనామాలతో ఆ ఏకైక భగవంతున్ని భక్తిగా ఆరాధిద్దాం రండి.
***
సమస్త విశ్వ పరిశీలనా ఫలం
పరీత్య భూతానుని పరీత్య లోకాన్ పరీత్య సర్వాః ప్రదిశో దిశశ్చ
ఉపస్థాయ ప్రథమ జామృతస్యాత్మనాత్మానమభి సం వివేశ॥ ॥
భావం:- పృవ్యప్ తేజో వాయు రాకాశాలనే పంచభూతాలను సర్వవిధాల తెలుసుకొని, సప్త దిక్కులను, దిక్కుల మూలలను పరిశీలించి, ఋతాన్ని ప్రథమంగా సృష్టించిన భగవంతుని ఆరాధించి ఆత్మద్వారా పరమాత్మలో సర్వాత్మగా విలీనమయ్యాను.
యజుర్వేదంలోని ముప్పది ఒకటవ మరియు ముప్పది రెండవ అధ్యాయాలలో పురుషమేధ యజ్ఞ విషయముంది. దాని అర్థం- సకల వ్యాపకుడైన పరమాత్మలో విలీనమయ్యే విధానమని. భగవంతునిలో విలీనం కావడానికి భక్తుడు పంచభూతాలను, నాలుగు దిక్కులను, నాలుగు మూలలను శోధించి తెలుసుకొంటాడు.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512