స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
*

పంచభూతాల అనాది చక్రం

పంచారే చక్రే పరివర్తమానే తస్మిన్నా తస్థుర్భువనాని విశ్వా
తస్య నాక్షస్తప్యతే భూరిభారః సనాదేవ న శీర్యతే సనాభిః

భావం: పంచభూతాలనే ఐదు బండికంటి ఆకులతో అనుసంధింపబడిన ఇరుసు ఆధారంగా తిరిగే చక్రంమీదనే సమస్త భువనాలు సంచరిస్తున్నాయి. ఆ చక్రపుటిరుసు ఎప్పటికి చెడదు. అది బరువు కాదు. చాలా ప్రాచీన కాలం నుండి ఇరుసుతో ఆ బండియాకులు అనుసంధింప బడియుండటంవలన ఆ చక్రం చెక్కుచెదరక (విరుగ) నడుస్తూంది.
వివరణ: పంచభూతాలనే ఐదు బండి ఆకులతో అనుసంధింపబడిన చక్రం ఈ విశ్వం. విశ్వ చక్రభ్రమణాన్ని గురించి ఈ మంత్రం ఇలా వివరిస్తూంది. ‘సప్త దిశో నానా సూర్యాః’ - ‘‘ఏడు దిక్కులలో అనేక సూర్యులున్నారు’’ అని ఋగ్వేద వచనం. ఒక సూర్యుడున్నది ఒక లోకం. ఏడు దిశలలో అనేక సూర్యులున్నారంటే లోకాలు కూడా ఎనె్నన్నో. ఆ లోకాలకన్నింటికి ఉపాదానకారణం (ప్రధాన కారణం) పృథివ్యప్ తేజో వాయురాకాశాలనే పంచభూతాలే. కుండ మట్టితోనే తయారవుతుంది. కాబట్టి మట్టి కుండకు ఉపాదాన కారణం. మట్టి లేని కుండ ఎక్కడుంటుంది? అలాగే ఉపాదాన కారణమైన పంచభూతాలు లేని లోకాలెక్కడుంటాయి? అంటే లోకాలన్ని ఈ పంచభూతాల సమ్మేళనంతో నిర్మింపబడి నడుస్తున్నాయి. ప్రళయకాలంలో లోకాలు లయమైనా తిరిగి ఆ పంచభూతాల సమ్మేళనంతోనే అనగా ఉపాదాన కారణంగా పునర్నిర్మింపబడి విశ్వవ్యాప్తమై నడుస్తాయి. కాబట్టి లోకాల నిర్మాణం పునర్నిర్మాణం నిరంతరం సాగే ఒక చక్రభ్రమణం. ఆ భ్రమణంలో పంచభూతాలు సదా స్థిరంగా అనుసంధింపబడిన ఐదు విధాలైన బండి కంటి ఆకులు. ఈ సృష్టి చక్రభ్రమణాన్ని వేదం ‘పంచారే చక్రే పరివర్తమానే తస్మిన్నా తస్థుర్భువనాని విశ్వా’ - ‘పంచభూతమయమూ నిరంతర భ్రమణశీలమూ అయిన సకల భువన చక్రం విశ్వమంతా సంచరిస్తూ వుంది’’ అని కవితాత్మ భాషలో ప్రకటించింది వేదం.
బండి కంటి ఆకులుగా వున్న పంచభూతాలు ఇరుసుకు బంధింపబడి యుండాలి కదా. దాని దృఢత్వాన్ని వేదం వివరిస్తూ ‘నాక్షస్తప్యతే న భూరి భారః సనాదేవ న శీర్యతే స నాభిః’- ఈ చక్రపుటిరుసు ఎన్నడూ చెడదు. బహుభారంవలన విరుగదు. శిథిలం కూడా కాదు’ అని పేర్కొంది. ఎందుకంటే ఇరుసునకు పంచభూతాలు బండి కంటి ఆకులుగా తాత్కాలికంగా అనుసంధింపబడినవి కావు. ‘సనాదేవ’ ఎంతో ప్రాచీన కాలంలోనే అనుసంధింపబడ్డాయి. అంతటి ఘనమైన ఆ ఇరుసు ఏది? భగవంతుడే ఆ చక్రానికి ఇరుసు (నాభి). అందుకే ఆ భగవన్నాభి తప్తం కాదు. శిథిలం కాదు. చెక్కుచెదరదు. రాత్రి వెంట పగలు- పగలు వెంట రాత్రి నడిచివచ్చినట్లు భగవన్నాభికి అనుసంధింపబడియున్న పంచభూతాలు అనే బండి కంటి ఆకులు గల భువన చక్రం సదా చక్రరూపంగా భ్రమణం సాగిస్తూనే వుంది. వుంటుంది.

ఆనందమయ దాంపత్యం

సూర్యో దేవీముషసం రోచమానాం మర్యో న యోషామభ్యేతి పశ్చాత్
యాత్రా నరో దేవయంతో యుగాని వితన్వతే ప్రతి భద్రాయ భద్రమ్

భావం: తన ఎడల ప్రసన్నతగల వనిత వెంట పురుషుడు వెళ్లే విధంగా సూర్యుడు ఉషాదేవి వెంట వెళుతున్నాడు. సుఖాభిలాషియై మనిషి శ్రేష్ఠతకు ప్రతిరూపమైన సమాన గుణ కర్మ స్వభావాలు కలిగిన స్ర్తి పురుష యుగళానే్న కల్పించుకొంటున్నాడు.

వివరణ: సంస్కృత సాహిత్యంలో ఈ క్రింది శ్లోకం ప్రసిద్ధంగా కనబడుతుంది. ‘అవిభిద్య నిశాకృతం తమః ప్రభయా నాంశుమతాప్యుదీయతే’ ‘రాత్రి కల్పించిన గాఢాంధకారాన్ని ప్రభాత కాంతులతో తొలగించకుండా సూర్యుడు కూడా ఉదయించడు’ ఈ భావం వేదంలోని ‘సూర్యో దేవీ ముషసం.. అభ్యేతి’- ‘ప్రకాశమయమైన ఉషస్సు వెనుకే సూర్యుడుదయిస్తున్నాడు’ అను వేదవాక్యార్థం నుండి గ్రహింపబడింది. ఉషస్సు ఉదయించిన వెనుకనే ఉదయించే సూర్యుణ్ణి ప్రియమైన భార్యను అనుసరించే భర్త అనుకూల్యతకు ప్రతీకగా వేదం గ్రహించింది. మనువు కూడా ఈ భావానే్న గ్రహించి మరింత రమణీయంగా ఇలా చెప్పాడు.
యది హి స్ర్తి న రోచేత పుమాంసం న ప్రమోదయేత్
అప్రమోదాత్ పునః పుంసః ప్రజనం న ప్రవర్తతే
స్ర్తీయాం తు రోచమానాయాం సర్వం తద్రోచతే కులమ్
తస్యాం త్వరోచమానాయాం సర్వమేవ న రోచతే
స్ర్తి పురుషుణ్ణి ఇష్టపడకుంటే అతన్ని ఆమె సంతోషపరచదు. పురుషుడు సంతోషడకుంటే సంతానాపేక్షయే సంభవింపదు. స్ర్తి సంతోషంతో ఉంటే ఆమె వంశమంతా సంతోషంతో ఉంటుంది. ఆమెకు సంతోషమే లేకుంటే వంశవంతా దుఃఖపూరితంగా వుంటుంది.
వేదం ‘రోచమానా యోషా’ ప్రసన్నురాలయిన స్ర్తికి అనుకూలంగా ప్రవర్తించే పురుషుడు అంటే పురుషుని ప్రవృత్తిని ప్రస్తావించగా మనువు ‘రోచమానా స్ర్తి’ ప్రసన్నురాలయిన స్ర్తి కారణంగా వంశమంతా సంతోషంగా వుంటుందని పేర్కొన్నాడు. స్ర్తి పురుషుణ్ణి అభిమానించాలి. మరియు పురుషుడు అట్టి స్ర్తిని అనుసరించి నడవాలి. అప్పుడే దాంపత్యం సుఖమయమవుతుంది. ఇది ఎలా సంభవమవుతుందో కూడా వేదం ‘యుగాని వితన్వతే ప్రతి భద్రాయ భద్రమ్’ - ‘సమానమైన గుణాలు, స్వభావాలు, కర్మలు స్ర్తి పురుషుల మధ్య సమానంగా జతకూడినప్పుడే సుఖ దాంపత్యం సంభవిస్తుంది’ అని సూచించింది. ఈ సూచన సార్వకాలికమైనది. సార్వజనీనమైనది. ఇది విస్మరింపబడి దంపతులుగా స్ర్తి పురుషుల జోడీలు కూర్చబడవచ్చు. కాని ఆ జోడీలు ‘ప్రతి భద్రాయ భద్రమ్’ స్ర్తి పురుషులమధ్య గల శ్రేష్ఠతల సమానత్వాన్ని అనుసరించి కూర్చబడినవై యున్నపుడే వారి దాంపత్య జీవితం సుఖమయమవుతుంది. అంటే శ్రేష్ఠత, కర్మ, స్వభావం, సంస్కారం, వయస్సు’ ఇలా అనేకాంశాల నాశ్రయించి ఉంటుంది. ఈ వేదార్థమే ‘ఈడూ జోడూ’ చూడాలన్న నానుడిగా స్థిరపడింది. అలా చూడబడక జత గూర్చబడిన దంపతులను గూర్చి కాకి ముక్కుకు దొండపండు అన్న ఈసడింపు తెలుగునాట వ్యవహారంలోనికి వచ్చింది. వివాహ వ్యవస్థలో స్ర్తి పురుషుల ఈడు జోడుతనాన్ని మరియు దంపతులుగా వారి ప్రేమానురాగ అనుకూల్య దాంపత్య జీవితాన్ని గురించి వేలయేండ్లకు పూర్వమే ప్రస్తావించిన వేదోపదేశాన్ని ఆధునిక సమాజం నేటికీ చెవిని పెట్టకపోవడం శోచనీయం.

ఇంకాఉంది