స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
‘ఇహైవ నిహితం గుహాయామ్’ హృదయగుహలోనేన్నాడు కాబట్టి హృదయంతో దర్శించినపుడే ఆ దైవం ప్రత్యక్షమవుతుంది. ఈ ఆధ్యాత్మిక సత్యానే్న పై వేద మంత్రం ‘మనసాగ్నిం నిచాయ్య’ అని; ముండకోపనిషత్తు ‘ఏషో - ణురాత్మా చేతసా వేదితవ్యః’ ఈ దివ్యాత్మ చిత్తం మరియు మనస్సు సచేత మాత్రమే గమ్యమానం కాగలదని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసాయి. కాకపోతే ‘జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః’ జ్ఞానసమృద్ధి చేతనే విశుద్ధ తత్త్వసిద్ధి అని ముండకోపనిషత్తు చెప్పిన మాట అనుషత్యం (అను+సత్యం) సత్యమార్గం చేతనే సత్యస్వరూపుని దర్శనం కాగలదని ఋగ్వేదం చెప్పినంత స్పష్టంగా లేదు. ఎందుకంటె సత్యం జీవన అంతస్సారమే కాబట్టి.
పైవిధంగా ఋగ్వేద- ముండకోపనిషత్తులు చెప్పిన రీతిగా ఋగ్వేదంలోని మరో మంత్రం ‘హృదామతిం జ్యోతిరను ప్రజానన్’ హృదయంలో ధ్యానం చేసి పరమాత్మ ప్రకాశాన్ని మరియు జ్ఞానాన్ని సంపూర్ణంగా దర్శించు అని పునరుద్ఘాటించింది. అంటే ధ్యానం హృదయ వ్యాపారమే గాని వాగ్వ్యాపారం కాదని వేదోపనిషత్తుల సందేశం. అంతమాత్రం చేత ఋగ్వేదం స్మరణ మరియు కీర్తన రూపంగా భగవన్నామోచ్ఛారణ వాగ్వ్యాపారాన్ని పూర్తిగా నిషేధించలేదు. పై మంత్రమే ‘గీర్భీరణ్వం కుశికాసో హవామహే’ బ్రస్మనిష్ఠులమైన మేము దివ్య సుందరుడైన ఆ భగవానుని దివ్య సన్నుతులతో స్తుతిస్తాము అన్న వచనంతో హృదయంలో వలెనే వాక్కుచేత కూడా భగవంతుని స్మరణరూపమైన ధ్యానం చేయమని అనుమతించింది. ఈ విధంగా మనసా,వాచా, కర్మణా భగవానుని ఎందుకు ఆరాధించాలి? అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ వేద మంత్రమే ‘సుదానుం దేవం రథిరం’ జీవాత్మకు బ్రహ్మానందాన్ని ప్రసాదించే మహాదానశీలి అని దైవాన్ని వర్ణించింది. అంటే ఏమిటి? సృష్టిలోని సమస్త వస్తుజాలం శరీరేంద్రియాలకు సుఖాన్ని ఇస్తాయి. కాని బ్రహ్మానందాన్ని మాత్రం ఆ దైవమొక్కడే ప్రసాదించగల వితరణ గుణాఢ్యుడు అని సారాంశం. ఈ విశ్వాసం చేతనే బుధులు ఆ పరంజ్యోతిః స్వరూపుని నిత్యమూ తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తారని మరో ఋగ్వేద మంత్రమూ ప్రబోధించింది.
భావం: పునీతుడు, సర్వజగన్నాయకుడు, సర్వవ్యాపి, సర్వజన సంస్తవనీయుడు. సర్వజ్ఞుడు, సర్వశ్రోత, కరుణార్ద్రశీలుడు అయిన భగవంతుని తమ సంరక్షణ కొరకై మరియు సామీప్యసిద్ధికై బుధులు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు.
ప్రపంచంలోని సమస్త పదార్థాలను చవిచూచి నాత్ర భోగ్యమస్తి, వీనిలో అనుభవించదగినది ఏమీ లేదు అని ఆత్మ పరీక్షించి తెలిసికొన్నది. అందుచేత ఆ ఆత్మ వ్యాకులత చెంది తనకు తాను సంరక్షణ లేనిదానిగా భావించి భౌతిక పదార్థాలన్ని తనను నశింపజేసేవిగా భీతి చెందింది. ఆ సమయలం ‘తం శుభ్రమగ్నిమవసే హవామహే’- మేము మా సంరయణ కొరకై వైశ్వానరాగ్ని దేవుని ఆహ్వానిస్తున్నాము. మరియు బృహస్పతింమనుషో దేవతాతయే-
మనుజుడు దేవత్వసిద్ధి పొందేందుకు భగవానుని బిగ్గరగా ఆహ్వానిస్తున్నాడు. అన్న వేదోపదేశాలు చెవిన పడ్డాయి. ఇంకేముందు, మార్గం దొరికింది. వారు శీఘ్రసంతోషాన్ని పొందారు. మీరూ రండి, ఆ పరమాత్ముని మనసా వాచా కర్మణా సంతోషపరచి మన ఎడల వివశుని చేసుకొందాము.
పెద్దలను అనుసరించు
యస్త్వద్ధోతా పూర్వో అగ్నే యజీయాన్ ద్వితా చ సత్తా
స్వధయా చ శంభుః తస్యాను ధర్మ ప్ర యజా
చికిత్వో- థా నోధా అధ్వరం దేవవీతౌ॥ ఋ.3-17-5.
ప్రతిపదార్థం:- అగ్నే= ఓ జ్ఞానీ! త్వత్= నీ కంటె; యః= ఎవడు; హోతా= హోత; పూర్వః= పూర్వుడై యుండెనో; యజీయాన్= మిక్కిలి యజ్ఞాలు చేసినవాడై యుండెనో; చ= మరియు; స్వధయా= స్వస్వభావం చేత;
ఇంకావుంది...