స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
దీని అర్థం సోమపానం చేసేవాడు మరియు సోమలతను రక్షించేవాడని. జీవుడు సోమంచేత వృద్ధి పొందేవాడు. సోమమంటే కేవలం సోమలతయే కాదు బ్రహ్మానందాన్ని కూడ సోమమని వేదం వ్యవహరిస్తూంది. ఋగ్వేదం ఈ సోమాన్ని గురించి యిలా వర్ణించింది.
సోమం మన్యతే పపివాన్యత్సంపింషంత్యోషధిమ్‌
సోమం యం బ్రహ్మాణో విదు ర్న తస్యాశ్నాతి కశ్చన॥ ఋ.10-85-3॥
సోమలతౌషధిని పిండితే సోమపానం చేయడం కూడ అర్థమవుతుంది. అయితే సోమలతను కేవలం బ్రహ్మవేత్తలే తెలుసుకోగలరు. వారు దానిని తినరు. త్రాగరు. అంతేకాదు దానిని బ్రహ్మవేత్తలు కానివారు ఉపయోగించినట్లుగా బ్రహ్మవేత్త లుపయోగించరు. బ్రహ్మవేత్తలకు సోమలత బ్రహ్మానందమే. సోమలతా పానం చేయడం దానిని రక్షణ చేయడమే. ఎందుకంటె అది పానం చేయబడినా దానం చేయబడినా వృద్ధి పొందుతుంది. ఈ మాటను సాక్షాత్తు ఋగ్వేదమే ఇలా చెప్పింది.
యత్త్వా దేవ ప్రపిబంతి తత ఆ ప్యాయసే పునః॥ ఋ.10-85-5॥
ఓ దివ్యపురుషుడా! నీవు దానిని (సోమరసాన్ని) త్రాగితే మరింత అభివృద్ధి చెందుతావు. బ్రహ్మానంద రస (సోమలతారస) పానం చేత జ్ఞానప్రకాశం వృద్ధి పొందుతుంది.
ఋగ్వేదంలోని ఈ ప్రార్థన కూడ సోమరస ప్రాశస్త్యాన్ని యిలా ప్రశంసిస్తూ ఉంది.
సనా జ్యోతిః సనా స్వ ర్విశ్వా చ సోమ సౌభగా అథా నో వస్యసస్కృధి॥
ఋ.9-4-2॥
ఓ సోమమా! నిన్ను సదా జ్ఞానం- ఆనందం- సమస్త సౌభాగ్యాలకొఱకు అర్థిస్తున్నాము. నీవు వానిని మాకు ప్రసాదించి మమ్ము పూజనీయులుగా- ప్రశంసనీయులుగా చేయుము.
తీయని మాట
యా తే జిహ్వా మధుమతీ సుమేధా అగ్నే దేవేషూచ్యత ఉరూచీ
తయేహ విశ్వా అవసే యజత్రానా సాదయ పాయయా చా మధూని॥
ఋ.3-57-5.
ప్రతిపదార్థం:- అగ్నే= ఓ పురోహితుడా! ఓ నాయకుడా!; తే= నీ; మధుమతీ = తీయని; సుమేధాః= సద్బుద్ధితో; ఉరూచీ= జ్ఞానోపదేశకమైన; యా= ఏ; జిహ్వా= మాట; దేవేషు= దేవతలలో లేదా విద్వాంసులలో; ఉచ్యతే= ప్రసిద్ధమైయున్నదో; తయా= ఆ మాట ద్వారా, అవసే= సత్ప్రయోజనసిద్ధి కొఱకు; విశ్వాన్= సమస్త; యజత్రాన్= యాజ్ఞికులను (యజ్ఞాలను చేయించు వారిని); ఇహ= ఇక్కడకు; ఆసాదయ= ఆహ్వానించి; మధూని= మధుర పదార్థాలను; పాయయ= తినిపించు.
భావం:- ఓ పురోహితుడా! జ్ఞానోపదేశకంగా సద్బుద్ధితో పలికే ఏ నీ మాట దేవతలచే మరియు విద్వాంసులచే సమాదరింపబడుతూ ఉందో ఆ మాట ద్వారా ప్రసిద్ధులైన సర్వయాజ్ఞికులను ఇక్కడ కాహ్వానించి వారికి మధుర పదార్థాలను తినిపించు.
వివరణ:- చాలామంది వారికి సన్నిహితులైన కొంతమందితో మాత్రమే ప్రియంగా మాటలాడతారు. కానీ వేదం అలా కాదు. అందరితో అలాగే ప్రియంగా మాటలాడమని హితవు చెబుతూంది. ఈ అంశాన్ని వేదమనేక సందర్భాలలో హెచ్చరించింది. అథర్వణ వేదం చెప్పిన ఈ వచనం చూడండి.
మధుమతీ స్థ మధుమతీం వాచముదేయమ్‌॥ అథర్వ. 16-8-8॥
భావం:- మానవులారా! మీరు మధుర భావనలు కలిగి యుండండి. అవే మధుర భావనలతో మాటలాడండి. అంటే ఇతరులు తనతో ప్రియంగా మాట్లాడాలనుకొంటే అడు ఇతరులతో ప్రియంగా సంభాషించాలి అని అర్థం.

ఇంకావుంది...