స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంటే వేదంలో మానవాభ్యుదయ మార్గాలెన్నో వర్ణింపబడ్డాయి. మానవ పతన హేతువైన ఏ అంశమూ వేదంలో కనబడదు. అంతటి సుజ్ఞానదాయకమైన వేదజ్ఞాన భాండాగారాన్ని, మనిషి ఎందుకు చేజార్చుకొంటున్నాడు? వేదం బ్రహ్మజ్ఞానం కల మహాద్భుత గ్రంథం. అందులో జీవుల చర్చ ఉంది. ప్రకృతి వర్ణనలున్నాయి. అగ్ని ఆరాధనా విధానముంది. జల విజ్ఞానముంది. పృథివీ విజ్ఞానముంది. అంతరిక్ష శాస్తజ్ఞ్రానముంది. వేదంలో వర్ణించబడని- వ్యాఖ్యానించబడని సకల జనోపయోగ శాస్తమ్రొక్కటయినా ఉందా? అట్టి సర్వ విజ్ఞాననిధి అయిన వేదరాశిని విడిచిన కారణంగానే మానవ సమాజం నేడనేక విధాలుగా పీడింపబడుతూ ఉంది. నేడు మనిషి మనిషిగా జీవించడం లేదు. అందుకే మనిషి మనిషిగా, మనీషిగా పునరుజ్జీవింప చేసేందుకు వేద విజ్ఞానాన్ని ఆత్మీయంగా ఆత్మకు హత్తుకోవాలి.
***
భగవానుని జీవన దానాన్ని నిందించకు
మా నిందత య ఇమాం మహ్యం రాతిందేవో దదౌ మర్త్యాయ స్వధావాన్‌
పాకాయ గృత్సో అమృతో విచేతా వైశ్వానరో నృతమో యహ్వో అగ్నిః ॥ ఋ.4-5-2.
ప్రతిపదార్థం:- యః= యవడు; స్వధావాన్= సర్వశక్తి సంపన్నుడో; అమృతః= శాశ్వతుడో; విచేతాః= సర్వజ్ఞుడో; వైశ్వానరః= సర్వజన హితకారియో; నృతమః= నాయకోత్తముడో; అగ్నిః సమస్త జనులకు అభ్యుదయకారుడో; దేవః =దేవదేవుడో; సః= అతడు; మర్త్యాయ= మరణశీలుడనైన; మస్యమ్= నాకు; పాకాయ= నన్ను నేను పవిత్రీకరించుకొనుట కొఱకై; ఇమామ్= ఈ; రాతిమ్= జీవనదానాన్ని; దదౌ= ఇచ్చియున్నాడు; అతః= అందువలన (అధ్యాహార్యం); మా నిందత= నిందించను.
భావం:- శాశ్వతుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, ప్రభువులకే ప్రభువు, జ్ఞానప్రదాత, సర్వజనాభ్యుదయకారి, దేవదేవుడైన భగవంతుడు నన్ను పవిత్రీకరించేందుకు ఈ జీవన సౌభాగ్యాన్ని అనుగ్రహించాడు. అందువలన ఆయనను నిందించను.
వివరణ:- భగవంతు డీ సర్వజగత్తును జీవులకే దానం చేసాడు. కాని ఆ దానం జీవులనుండి తాను గ్రహించిన దానికి ప్రత్యుపకారంగా చేసింది కాదు. ఎందుకంటె ఆయన స్వధావాన్= సర్వశక్తి సంపన్నుడు. కావడం వలన దేనిని ఎవరినుండి ఆపేక్షించనివాడు. అందుకే ఆ దేవదేవుడేది ప్రదానం చేసినా అది నిష్కామమైనట్టిదే.
అంతేకాదు. పరమేశ్వరుడు విచేతా= సమస్తమూ విశేషంగా తెలిసినవాడు కనుకనే విచారించి విచారించి ఈ సృష్టిని రచించాడు. మూర్ఖుడు- విద్వాంసుడు, పుణ్యాత్ముడు- పాపాత్ముడు, సబలుడు- దుర్బలుడు, ధనికుడు- దరిద్రుడు, రాజు- ప్రజలు మొదలైన జనుల అవసరాలను తెలిసి వారిని ఆయనే సంరక్షించవలసి యుంది. ఎలా? అంటె వీరిలో పతితులైనవారి నుద్ధరించి వారికి ఊర్ధ్వగతులను కల్పించడమే, సృష్టిరచనోద్దేశ్యం కూడ అదే. అందుకే ఆయన అగ్ని అని వ్యవహరింపబడుతున్నాడు. అందుకే ఆయన ఉపదేశం కూడ అభ్యుదయదాయకం. ఈ మంత్రంలోకాకున్నా ఋగ్వేదమే ‘ఉచ్ఛ్రయస్వ మహతే సౌభగాయ) (ఋ.3-8-2) పరమ సౌభాగ్యం కొఱకు నన్ను సమున్నతునిగా చేయుమని ఆ దేవదేవుని ప్రార్థించింది.
నేను మరణశీలుణ్ణి. ఎప్పుడు మరణిస్తానో తెలియదు. ఆయన అమృతుడు. శాశ్వతుడు. కాలానికి కూడ కాలుడు. ఆయన వద్ద అమృతముంది. నన్ను అమృతుడిగా చేసేందుకే ఈ జీవనదానమిచ్చాడు. మానవులారా? ఆ జగత్పితను ఎందుకు నిందిస్తారు? అని వేదం ‘మా నిందత’ నిందించవద్దు అని మందలిస్తూ ఉంది. ఆయన వైశ్వానరుడు, గృత్సుడు(ఉపదేశకుడు) జీవనదానంతోబాటు జ్ఞానాన్నిగూడ ప్రబోధిస్తున్నాడు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు