స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 68

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
గ్రంథ విజ్ఞానం మరియు దాని అనుష్ఠానమూ రెండూ కూడ సమానంగా ఎవడు కలిగి యుంటాడో ఆతడు గురుత్వాన్ని లేదా ఆచార్యత్వాన్ని వహించే యోగ్యుడుకాగలడు. బ్రహ్మవేత్త అయిన గురువు శిష్యుణ్ణి ముందుగా బ్రహ్మవిద్యా సంపన్నుడిగా చేస్తాడు. అందుకే మంత్ర ద్వితీయార్థంలో గురువు బ్రహ్మజ్ఞాన నేతృత్త్వం స్థాపింపబడింది.
***
చల్లని చూపు
తవ స్వాదిష్ఠాగ్నే సందృష్టి రిదా చిదహ్న ఇదా చిదక్తోః
శ్రీయే రుక్మోన రోచత ఉపాకే॥ ఋ.4-10-5.
ప్రతిపదార్థం:- అగ్నే= ఓ అగ్నే!; తవ= నీ; స్వాదిష్ఠా= ఆనందదాయకమైన; సందృష్టి ఇత్= చల్లని చూపే; అహ్న+చిత్+ఆ= దినారంభం నుండి; అక్తోః+చిత్+ఆ= రాత్రివరకు; ఇత్= కూడ! రుక్మః+న= బంగారంవలె ప్రకాశవంతమై; ఉపాకే= సన్నిహితమై! శ్రీయే= శుభదాయకంగా; రోచతే= వెలుగుతూ ఉంది.
భావం:- ఓ అగ్నీ! ఆనందప్రదాయకమైన నీ చల్లని చూపు దినారంభం నుండి రాత్రివరకు బంగారంవలె ప్రకాశవంతమై మాకు సన్నిహితమై శుభదాయకంగా వెలుగుతూ ఉంది.
వివరణ:- చూపు రెండువైపుల పదునుగల కత్తివంటిదని పెద్దలంటారు. ఆ చూపు బారినపడినవారు ఎవరైనా తీవ్రంగా నష్టపడతారు. సుందరి వాలుచూపుసోకి ఎందరో కాముకజనులు పిచ్చివాళ్లయిపోయిన గాథలెన్నో కనబడతాయి. క్రోధం వచ్చినవారి కళ్లు ఎఱ్ఱబడతాయి. ఆతడి కళ్లలోనికి చూడటమే భయాన్ని కలిగిస్తుంది. పిల్లలు తమ మనోభావాలను అన్నింటిని ప్రకటించలేరు. తల్లిని మాత్రం దీనంగా చూస్తారు. మరి ఆ బిడ్డలను చూచిన తల్లిలో ప్రేమ ఎలా ఉబుకుతుంది? అంటె బిడ్డ అమాయకపు చూపులే తల్లిలో మాతృప్రేమను వెల్లువగా ప్రవహింపజేస్తుంది.
ఇలా దృష్టి చాలా శక్తివంతమైంది. అది నవ్వేవాళ్లను ఏడిపిస్తుంది. ఏడ్చేవాళ్లను నవ్విస్తుంది. మిత్రుణ్ణి శత్రువుగా చేస్తుంది. శత్రువును ప్రాణమిత్రుడుగా చేస్తుంది. మహాపురుషుల దృష్టి అధమాధముల పాపాన్ని కూడ ప్రక్షాళితం చేయగలదని సజ్జనులెందరెందరో చెప్పే గాథలెన్నో ఉన్నాయి. సజ్జనుల దృష్టి పాప సముద్రాభిముఖంగా ప్రవహించే దుర్జనుల చిత్తనదీ ప్రవాహాన్ని పుణ్యసముద్రాభిముఖంగా మరలించి వారిని పవిత్రులుగా చేస్తుంది. దృష్టి మనోగతమైన భావాలకు దర్పణమని మనస్తత్వవేత్తలు చెబుతారు. అది నిజమే. సాధారణంగా లోకంలో ఆశాదృష్టులు, కోపిష్టి కళ్లు, కుళ్లుకళ్లు, ప్రేమకళ్లు, మత్తుకళ్లు, ఇలా వినబడే మాటలు ఈ మాటనే సత్యంచేస్తాయి. కళ్ళు భిన్నభిన్న మనోభావాలను రకరకాల భంగిమలను ప్రదర్శిస్తాయి. ఒక్క మూఢులు తప్ప జ్ఞానులు, చదువరులు అందరూ ఆ నేత్ర భంగిమల వెనుకగల మనోభిప్రాయాలను గ్రహించగలరు. ఇట్టి మనోభావాలలోని తారతమ్యాన్ని గుర్తించియే కళ్లలో కనబడే చల్లనిచూపు మహిమను ఈ మంత్రం ‘‘తవ స్వాదిష్ఠాగ్నే సం దృష్టిః’’ ఓ అగ్నీ! నీ చూపుచల్లనిది అని ప్రశంసించింది.
సన్మార్గాన్ని చూపేవాడు కళ్లు చిట్లించితే ఇది మంచి మార్గం కాదు చెడు మార్గంలో పడిపోతున్నావని హెచ్చరికకు సంకేతం. గురువుకళ్లతో అయిష్టంగా చూస్తే నేర్చిన విద్యలో తప్పు దొర్లిందని మందలింపు. మరి గురువులకే గురువయిన జగద్గురువుల వాత్సల్యదృష్టి మనపై పడకుంటే మనకు ఏ గతి పడుతుంది?
*
ఇంకావుంది...