స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
దాని నుండి విముక్తి పొందాలనే ప్రయత్నమే చిన్నదైనా ఎవరైనా చేస్తున్నారా? చిత్రమేమంటే నిత్యం ఆనందం సుఖాన్ని ఇచ్చే మోక్షమార్గాన్ని విడిచి అందరూ ఈ దుఃఖబాహుళ్యమైన లౌకిక సుఖాల వెంట పడిపోతూ ఉండటం అవిద్య కాదా?
ఎక్కడైనా ధనం దొంగలింపబడిందనుకోండి. అలా పోగొట్టుకొన్నవాడు నా ధనమంతా కోల్పోయానని బాధపడతాడు. అలా ధనం కాక గౌరవం, అభిమానం కోల్పోతే అతడు సర్వస్వం కోల్పోయినట్టే కదా!
గ్రుడ్డితనం కళ్లలో ఉంటే మనిషి తనను తానే గ్రుడ్డివాడనని అనుకొంటాడు. అట్లే రోగం శరీరంలో ఉంటే మనిషి తనకు తానే రోగిగా భావిస్తాడు. అట్లే ధనం - ఇంద్రియాలు- శరరం అన్నీ అనాత్మ పదార్థాలు. అవిద్య మహిమంతా వీనినన్నింటిని శాశ్వతమైన పదార్థాలుగా - ఆత్మగా భావించడంలోనే ఉంది. అంతేకాదు అసలు ఆత్మనే అంగీకరించకపోవడం, ఆ భావన నుండి పుట్టిన అంశాలను శాశ్వతంగా విశ్వసించడం. ఇలా అవిద్య అనేక విధాలుగా ఉంటుంది.
వింత ఏమంటే అజ్ఞానం కారణంగా పాపహేతువులైన హింసాకృత్యాలను కూడా పుణ్యకార్యాలుగా భావిస్తూ ఉంటారు. అంతేకాదు, అవి పరమేశ్వర ప్రీతిసాధనాలని తలంచి పుణ్యం కూడా చేసామని ఆత్మసంతృప్తి పొందుతారు. వారి అవిద్యా విలాసమెంత దయనీయమైనది? కాబట్టి ప్రపంచంలో పాపాలెన్ని ఉన్నా ఆ అన్నింటికీ మూలం అవిద్య ఒక్కటే. అట్టి అవిద్యను తొలగించి యధార్థ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు ఒక్క భగవానుడు మాత్రమే. అందుచేత మేము అదితికి అనగా జగన్మాత ఎడల పాపకర్మలు చేసేవారిగా మమ్ము చేయవలదు. సత్యజ్ఞానాన్ని ప్రసాదించు. పాపచింతనను మా మనస్సుల నుండి దూరం చేయి అని భగవంతుణ్ణి అందరూ ప్రార్థించాలి. జ్ఞానం కలిగినవాడు పాపమే చేయదు. అయినా ఎక్కడైనా, ఎప్పుడైనా చేస్తే ఆయనలో పాపవాసనలు ఇంకా తొలగిపోలేదని అర్థం. అవి కూడా నిరంతర ప్రార్థన ద్వారా కలిగిన భగవత్కృప ద్వారా స్వయంగా తొలగిపోతాయి. అందుకే చివరలో ఈ వేద మంత్రం ‘వ్యేనాంసి శిశ్రథో విష్వగగ్నే’- జ్ఞానాగ్ని చేత పాపవాసనలను దగ్ధం చేసే ఓ అగ్నీ! నా మనోగతమైన పాపవాసనలను సంపూర్ణంగా దగ్ధం చేయి అని మానవ సమాజానికి హితోపదేశం చేసింది.
భగవన్మహిమకు మూలకారణం
వవక్ష ఇంద్రో అమిత మృజీష్యుఁ్భ ఆ పప్రౌ రోదసీ మహిత్వా
అతశ్చిదస్య మహిమా వి రేచ్యభి యో విశ్వా భువనా బభూవ॥ ఋ.4-16-5.
ప్రతిపదార్థం:- ఇంద్రః= సకలైశ్వర్య సంపన్నుడైన భగవంతుడు; అమితమ్= అపరిమితంగా; వవక్ష= వహించియున్నాడు; ఋజీషీ= సర్వ జీవులకు సులభుడై యుండుటను ఇష్టపడు పరమాత్మ; మహిత్వా= తన మహామహిమను; ఉభే= ఊర్ధ్వ- అధో; రోదసీ= లోకాలలో, ఆ పప్రౌ= సంపూర్ణంగా నింపియున్నాడు; యః= ఏ మహిమ; విశ్వా= సకల; భువన+ అభి=లోకాలలో; బభూవ= వ్యాపించి యున్నదో; అస్య= ఆ భగవంతుని మహిమ; అతః+ చిత్= అంతకంటె అధికమై; విరేచి= వ్యాపించియుంది.
భావం:- సకలైశ్వర్య సంపన్నుడైన భగవానుడు అనంత మహిమాన్వితుడు. సకల జీవులకు తాను సులభుడై యుండుట కిష్టపడే ఆయన ఊర్ధ్వ- అధో లోకాలలో తన మహిమను సంపూర్ణంగా వ్యాపింపచేసి యున్నాడు. ఆ రీతిగా సకల భువనాలలో వ్యాపించియున్న ఆ పరమాత్మ మహిమ ఇంతకంటె ఎంతో అధికమై చెప్పరానంతగా ప్రకాశిస్తూ ఉంది.
వివరణ:- పరమాత్మ, ఆత్మ మరియు ప్రకృతి ఈ మూడు ఒకే రీతిగా అనాది అయినవి కాగా పరమాత్మ ప్రత్యేకత ఏమిటి? అని సజ్జనులైనా హేతువాద రహితంగా మాటలాడుతూ ఉంటారు. ఇట్టివారి నుద్దేశించియే పరమాత్మ ఆత్మ మరియు ప్రకృతులకంటె ఎందుకు విశిష్టమైనదో ఋగ్వేదం ‘వవక్ష ఇందో అమితమ్’= భగవంతుడు అనంత మహిమను వహించియున్నాడని సూటిగా చెప్పింది.
ఇంకావుంది...