స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 72

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
రేణుమ్= ధూళికణం వలె అల్పునిగా; కృణోతి= చేయుచున్నావు; విభంజనుః= సమస్త సంహారకుడయిన; సః = ఆతడు (నీవే); అశనిమాన్ ఇవ= వజ్రాయుధధారి అయిన ఇంద్రునివలె; ద్యౌః= ప్రకాశమానుడవై ఉన్నావు; ఉత=మరియు; మఘవా= సకలైశ్వర్య సంపన్నుడైన ఆ పరమాత్మ; స్తోతారమ్= స్తుతిచేసే వానిని; వసౌ= సమస్త సంపదలతో; ధాత్= తులతూగువానిగా చేయుచున్నావు.
భావం:- ఓ సకలైశ్వర్య ప్రదాతఅయిన పరమాత్మ! నశించిపోతున్న వానిని అభివృద్ధిచెందేవానిగా, సమృద్ధంగా ఉన్నవానిని బికారివానిగా, బికారిని ధనవంతునిగా, అల్పుణ్ణి బలవంతునిగా, బలవంతుని అల్పునిగాచేయుచున్నావు. అఘటన ఘటనా సమర్థుడైన ఇంద్రునివలె సకలైశ్వర్యప్రదాతగా విరాజమానుడవై నిన్ను సన్నుతి చేసేవారిని భోగభాగ్య వైభవునిగా చేయుచున్నావు.
వివరణ:- ఈ మంత్రంలో భగవంతుడు సమస్త సంహారక భయానక మూర్తిగా మరియు కరుణామూర్తియైన సకలైశ్వర్య ప్రదాతగా వర్ణింపబడ్డాడు. స్తోతారం మఘవా వసౌ ధాత్‌ తనను సన్నుతిచేసే ఆశ్రీతుణ్ణి భగవానుడు వైభవ సంపన్నుడిగా చేస్తున్నాడు. ఇక్కడి ‘స్తోతారం’అన్నమాటే ధనప్రదానానికి భగవంతుడు విధించిన నియమం సూచింపబడింది. అంటె ముందుగా ఆశ్రీతుడు భగవత్స్తోత కావాలని ఆ నియమం. ఇంతకూ ఆశ్రీతులనుండి భగవంతుడాశించిన ఆ స్తుతి ఎలా ఉండాలి?? అందరు స్తుతి అంటే ఏమనుకొంటారంటె - ‘ఓ పరమేశ్వర! నీవు దయగలవాడవు. అందరకు సుఖ-సంతోషాల ననుగ్రహిస్తావు. నీవు జగత్తుని సృష్టించేవాడవు. దానిని నడిపించేవాడవు అంటూ దైవాన్ని పొగడాలని అనుకొంటారు. నిజానికది స్తుతికాదు. దైవమాశించేది అట్టి స్తుతికాదు. నిజమయిన స్తుతి ఏమంటే- భగవంతుని సర్వగుణ సంపన్నతను గ్రహించి తనలో ఉన్న దుర్గుణాలను గుర్తించి వానిని తొలగించుకొని సద్గుణాలను తనకు అనుగ్రహించమని భక్తితో దైవాన్ని అర్థించడమే నిజమైన సన్నుతి. ఇట్టి స్తోత్రానే్న భగవానుడాశించేది. మహర్షి దయానందులు తమ సత్యార్థప్రకాశం సమస్త సముల్లాసంలో సగుణ-నిర్గుణ స్తుతి భేదాలను వివరిస్తూ ఇలానే పేర్కొన్నారు.
స్తోత్ర ఫల మేమంటే పరమేశ్వరునియందే యే సద్గుణ సంపత్తి ఉందో ఆ గుణ- కర్మ- స్వభావాలను భక్తుడు తన గుణ-కర్మ-స్వభావాలుగా తీర్చిదిద్దుకొనుటయే. ఒక భట్రాజువలె దైవాన్ని స్తుతించి ఆ దైవీ గుణాలను అలవరచుకొనక తాను దుష్టప్రవర్తనుడయితే ఆ స్తుతి నిరర్థకం. కాబట్టి దైవాన్ని ఏ గుణాలు కలవానిగా స్తుతిచేస్తామో ఆ గుణాలకనుగుణంగా తన శీలాన్ని సరిదిద్దుకోవడమే నిజమైన స్తుతి అని సారాంశం. సకలైశ్వర్య సంపన్నుడైన (మఘవ) దైవాన్ని ఈ విధంగా సంస్తుతి చేసేవాడు తప్పక ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఎందుకంటె దైవం సర్వార్థప్రదాత. ఈ మంత్రమేకాదు ఋగ్వేదంలోని మరో మంత్రం.
వాతా మఘాని మఘవా సురాధాః॥ (ఋ.4-17-8)
‘‘శాస్ర్తియంగా ఆరాధితుడైన మఘవా= లక్ష్మీ సంపన్నుడైన ఆ పరమాత్మ ప్రీతితో ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు’’అని ఈ మంత్రార్థానే్న సమర్థించింది. అంతేకాదు ఆస్తికులు దైవాన్ని ఇలా ప్రార్థిస్తారని ఋగ్వేదమే యిలా వివరించింది.
యత్కామస్తే జుహుమస్తన్నో అస్తు వయం స్యామ పతయో రరుూణామ్‌॥
ఋ.10-121-10॥
ఓ ప్రభూ! మేమే కోరికతో నిన్ను అర్థిస్తామో అది మాకు సిద్ధించుగాక! మేము ధనవంతుల మగుదుము గాక!
ముఖ్యమైన అంశమేమంటె ఆరాధన అంటె భగవానుని నోరార పిలవడమే. అలా పిలిస్తే దైవం అనుగ్రహించడంలో ఏ చిన్నలోటు రానీయడు. ఆయన అఘటన ఘటనా సమర్థుడు.
‘క్షియంతం త్వమక్షియంతం కృణోతి’అని రుూ మంత్రం పేర్కొన్న రీతిగా పేదను రాజుగా, రాజును పేదగా కూడ చేయగలడు.
అందుచేత ప్రతి మానవుడు భక్తితో భగవంతుని స్తుతించాలి. అలా స్తుతింపబడిన పరమాత్మ స్తోతను ఉత్త్యున్నత స్థితికి చేరుస్తాడు.
*
ఇంకావుంది...